-జగన్ రెడ్డి అండతోనే వైసీపీ గూoడాలు పగ్గాలు తెంచుకున్న ఆoబోతుల్లా దాడులకు తెగబడుతున్నారు
-జగన్ రెడ్డి రౌడీ పాలనకు రోజులు రోజులు దగ్గర పడ్డాయి
– కింజరాపు అచ్చెన్నాయుడు
జగన్ రెడ్డి రౌడీ పాలనలో వైసీపీ గూండాల అరాచకాలకు హద్దు, అదుపు లేకుండా పోతోంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై వైసీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్ రెడ్డి అండతోనే వైసీపీ గూoడాలు పగ్గాలు తెంచుకున్న ఆoబోతుల్లా టీడీపీ కార్యకర్తలపై, ప్రజలపై దాడులకు తెగబడుతున్నారు.
విజయవాడలో ఓ చోటా నాయకుడు వీధి రౌడీలను పెంచి పోషిస్తున్నారు.జగన్ రెడ్డి రౌడీ పాలనకు రోజులకు దగ్గర పడ్డాయి. టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న వారి పేర్లు, దాడుల్ని ప్రోత్సహిస్తున్న వారి పేర్లు రెండు ఎక్సెల్ షీట్లలో రాస్తున్నాం. లిస్ట్ లో ఉన్న ప్రతి పేరుకి శిక్ష తప్పదు.అధికార మదంతో ఇప్పుడు అరాచకాలకు పాల్పడుతున్న వారిని ప్రజలే రోడ్ల మీదికి లాక్కొచ్చి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.