– చేనేతపై అసత్య ప్రచారాలు వద్దు
గత తొమ్మిది మాసాలుగా చేనేతపై జీఎస్టీ పన్నులు తొలగించాలని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. ఇప్పటికే 13 రాష్ట్రాల నుండి 15 రాజకీయ పార్టీలు, ఒక ఇండిపెండెంట్ తో కలిపి 66 మంది పార్లమెంటు సభ్యులు జీరో జిఎస్టి ఉద్యమానికి మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారు. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, చేనేతపై జీరో జీఎస్టీ సాధన దిశగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మునుగోడు ఉప ఎన్నికల వేదికగా చేసుకొని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఈనెల 18న కొయ్యలగూడెం నుంచి మునుగోడు వరకు ఆరు రోజుల పాదయాత్ర నిర్వహించనుంది.
పాదయాత్ర ముగింపు రోజున సుమారు 20,000 మందితో మునుగోడులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి చేనేతపై జీరో జీఎస్టీ తొలగించాలని డిమాండ్ చేయనుంది. లేని పక్షంలో మునుగోడు ఉప ఎన్నికలలో తమ చైతన్యాన్ని చూపుతామని పద్మశాలి సమాజం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పద్మశాలి మరియు చేనేత సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటన చేస్తున్నారు. ఆదాయానికి టర్నోవర్ కు తేడా తెలియని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేనేత పై జీఎస్టీ గురించి మాట్లాడం విడ్డూరం. 20 లక్షల టర్నోవర్ వారికి జీఎస్టీ మినహాయింపు ఉంటుంది.
కానీ 40 లక్షల వరకు మినహాయింపు వుందని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పడ్డం పేర్కొనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం. గత డిసంబర్ నుండి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేస్తున్న జీరో జీఎస్టీ పవిత్ర యజ్ఞాన్ని కేవలం మునుగోడు ఎన్నికలలో బిజెపిని ఇరుకున పెట్టడానికే అనే చెప్పడం ఆయన అవివేకం.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ బుణకర్ భీమా యోజన, ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ స్కీమ్, త్రిఫ్టు ఫండ్ వంటి పథకాలను రద్దు చేసింది. చేనేత కళాకారుల గొంతుకైనా ఆలిండియా హ్యాండ్ బోర్డును ప్రస్తుత బిజెపి ప్రభుత్వం రద్దు చేసింది. చేనేత మరియు ఖాదీ ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. బడ్జెట్ కేటాయింపులను కుదించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి గాని అసత్య ప్రచారాలు చేయడం మర్యాద కాదు. అసత్యాలు ప్రచారం చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి పద్మశాలి సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
-యర్రమాద వెంకన్న నేత
అధ్యక్షుడు, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం
9246577488
– అవ్వారి భాస్కర్
రాష్ట్ర అధ్యక్షుడు,
తెలంగాణ పద్మశాలి యువజన సంఘం
8008711884