– ఉదయం నుంచి దాడులు విజయవాడలో రహస్యంగా సీబీఐ దాడులు
న్యాయమూర్తుల మీద అనుచిత వాఖ్యలు చేసిన వారిపై సీబీఐ దృష్టి సారించింది.ఇటీవల హైకోర్ట్ న్యాయమూర్తుల మీద అభ్యంతర వాఖ్యలు చేయడం,వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.రాష్ట్రంలో వీరు ఎక్కడ నివసిస్తున్నారు గుర్తించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి సీబీఐ పలువురు ఇళ్లపై దాడులు చేసింది.వీరిలో 7 గురిని అదుపులోకి తీసుకొని,వారి నుంచి కీలక ఆధారాలను సేకరించారు.
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 1.శొంఠి రంగా రావు,2. గంజి మల్లికార్జున రావు,3.సీహెచ్ ప్రదీప్ కుమార్,4. బత్తుల అశోక్ రెడ్డి,5.తియ్యకూర సుమా,6.చొక్కా రవీంద్ర ,7.పి రామాంజనేయ రెడ్డి మొదలైన వారిని సిబిఐ వారు ఈ రోజు విచారణకు పిలిపించి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న సిబిఐ క్యాంపు కార్యాలయం నందు విచారణ చేసి అనంతరం అరెస్ట్ చేసి హాస్పిటల్ లో వైద్య పరీక్షలు అనంతరం 5 వ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ మరియు సీబీఐ కోర్టు మెజిస్ట్రేట్ ఇంటి వద్ద మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.