Suryaa.co.in

Telangana

సికింద్రాబాద్ లో ఘనంగా ర్యాలీ, హాజరైన వేలాది మంది పౌరులు

తెలంగాణా ప్రజలు శాంతి, సమగ్రత, ఐక్యతకు ప్రతి రూపాలని ఉప సభాపతి పద్మారావు అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అయన అన్నారు. ఉప సభాపతి పద్మారావు గౌడ్ తెలంగాణా జాతీయ సమక్యతా వజ్రోత్సవ ర్యాలీ’ని శుక్రవారం వారసిగుడా చౌరస్తా వద్ద ప్రారంభించి, సితాఫలమండీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ వరకు పాల్గొంటారు. భారీగా తరలి వచ్చిన విద్యార్ధులు, మహిళలు, యువతీ యువకులతో కలిసి అయన కూడా ఉత్సాహంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.
అనంతరం సితాఫలమండీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించిన బహిరంగ సమావేశంలో పద్మారావు ప్రసంగిస్తూ తెలంగాణా ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృధి సాగిస్తోందని తెలిపారు. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు సికింద్రాబాద్ లో శర వేగంగా అమలు జరుగుతున్నాయని తెలిపారు. సికింద్రాబాద్ లో ఇప్పటికే వివిధ కార్యక్రమాలను చేపట్టామని, 50 సంవత్సరాల్లో చేపట్టని ఎన్నో పనులను చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలను తామే ఏర్పాటు చేయించామని, వాటికీ కొత్త భవన్ సముదాయాలను నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి ఆమోదాన్ని సాధించామని తెలిపారు. తుకారం గెట్ వద్ద కొత్త ఆర్ యు బీ నిర్మించామని, మానికేశ్వరినగర్, మెట్టుగూడ వద్ద రూ.50 కోట్ల మేరకు నిధులను ఆర్ యు బీ ల నిర్మాణానికి మంజూరు చేశామని తెలిపారు.

డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసురి సునీత, తి లింగాని ప్రసన్న లక్ష్మి, తెరాస యువ నేతలు కిశోర్ కుమార్, కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్, తెరాస కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, లింగాని శ్రీనివాస్, కరాటే రాజు, కంది నారాయణ, డిప్యూటీ కమీషనర్ దశరద్, నోడల్ అధికారి మాధవి రెడ్డి, ఏ సీ పీ సుదీర్, అధికారులు డాక్టర్ రవీందర్ గౌడ్ తదితరుల తో పాటు పెద్ద సంఖలో విద్యార్ధులు, వివిధ స్కూల్ ల నిర్వాహకులు పాల్గొన్నారు. జండాలతో నినాదాలతో సికింద్రాబాద్ లోని అన్ని ప్రాంతాలు మార్మోగాయి. ర్యాలీలో పాల్గొన్న వేలాది మందికి భోజన సదుపాయాన్ని కల్పించడంతో పాటు ఏకంగా అయిదు వేల మందికి పైగా విద్యార్ధులకు తన వంతు వ్యక్తిగత కానుకల ప్రత్యేక కిట్లను పద్మారావు ఈ సందర్భంగా అందచేశారు.

LEAVE A RESPONSE