-ఏరివేసేందుకు కఠినమైన నిర్ణయాలు
-సొసైటీ ప్రెసిడెంట్ ప్రకటన
జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లో 5వేల మంది వరకు సభ్యులు ఉన్నారు.. వీరిలో 3,200 మంది వరకు ప్లాట్లు ఉన్నాయి.. మిగిలిన వారిలో చాలా మంది సభ్యత్వ మాత్రమే కలిగి ఉన్నారు. అంతేకాక, 700 నుంచి 800 మంది వరకు సభ్యులు బినామీలుగా ఉన్నట్లు అంతర్గత పరిశీలనలో వెల్లడైనట్లు సొసైటీ ప్రెసిడెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశాలు, ఇతర కార్యక్రమాల సమయంలో వీరిందరికీ లేఖల ద్వారా సమాచారం పంపుతున్నా సరైన చిరునామాలు ఉండకపోవడం చేత ఆ లేఖలన్నీ తిరుగు టపాలో వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బినామీలను ఏరివేసేందుకు కఠినమైన నిర్ణయాలకు ఉపక్రమించినట్లు సొసైటీ ప్రెసిడెంట్ చెప్పారు.
ఇకపై ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా సభ్యులను వివరాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియకు జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ శ్రీకారం చుట్టింది. ఇందు కోసం సొసైటీ సభ్యులు కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించవలసినదిగా కోరడమైనది. సెప్టెంబరు 18న నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో కొంతమంది సభ్యులు, కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించగా.. మరికొతమంది సభ్యులు ఇప్పటికీ స్పందించలేదు . బినామీ లు, కేవైసీ సమర్పించని సభ్యులసభ్యత్వాన్ని చట్ట ప్రకారం రద్దు చేసే హక్కును సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా పాలకవర్గానికి కట్టబెడుతూ తీర్మానించడమైనది. బినామీలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పాలకవర్గం తీర్మానించింది.