Suryaa.co.in

Telangana

మిషన్‌ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చారనడం అబద్దం

బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం అసలు అంచనా వేయనేలేదు. తెలంగాణలో 100% నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రం ధ్రువీకరించనేలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే 100 శాతం నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు నివేదించింది. జల్ జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం 100 శాతం నల్లా కనెక్షన్లు ఉన్నట్లు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల ద్వారా తీర్మానాలు చేయాలి. కానీ పంచాయతీల ద్వారా ఇప్పటి వరకు ధ్రువీకరించనేలేదు.గ్రామీణ గృహాలకు నీటి సరఫరా విభాగంలో మాత్రమే అక్టోబరు 2న తెలంగాణకు అవార్డుకు ఎంపికైంది. ఫంక్షనాలిటీ అసెస్‌మెంట్ డేటా ప్రకారం తెలంగాణలోని 409 గ్రామాల్లోని మొత్తం 12,570 గృహాలలో శాంపిల్స్ పరీక్షించగా, 8% నివాసాలు ప్రతిరోజు 55 లీటర్ల తలసరి నీటి కంటే తక్కువ తాగునీరు పొందుతున్నాయి.అదేవిధంగా మొత్త నమూనాల్లో 5% నివాసాల్లో నీటి నాణ్యత JJM నిబంధనల ప్రకారం లేదని గుర్తించింది.

ప్రజా సమస్యలు వినే ఓపికలేని ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు.హన్మకొండ లో తమ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వీఆర్ఏ లు ప్రయత్నం చేస్తే, వారి తో ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు దౌర్భాగ్యమని, డ్రామాలు ఆడుతున్నారా అని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, వినతిపత్రం వీఆర్ఏల ముఖం పై విసరడం ముఖ్యమంత్రి అహంకారానికి నిదర్శనమని డీకే అరుణ మండిపడ్డారు.

వీఆర్ఏలు గొంతమ్మ కోరికలు ఏమి కోరడం లేదని, ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయమంటున్నారని డీకే అరుణ అన్నారు. ముఖ్యమంత్రి వెంటనే వీఆర్ఏలకు వెంటనే క్షేమాపణ చెప్పి, వారి సమస్యలను పరిష్కరించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE