Suryaa.co.in

Andhra Pradesh

చిన్నారి బాలిక వైద్యానికి కోటి మంజూరు చేసిన జగన్

-అరుదైన “గాకర్స్‌’’ వ్యాధి బారినపడ్డ చిన్నారి హనీ వైద్యానికి రూ.1కోటి మంజూరు
-దేశవ్యాప్తంగా ఇలాంటి బాధితులు 14 మంది
-ఒక్కో ఇంజక్షన్ ఖరీదు లక్షా ఇరవై ఐదు వేలు
-నెలకు రూ.10వేల చొప్పున పెన్షన్‌కూడా మంజూరుచేస్తున్న ప్రభుత్వం

దీంట్లో భాగంగా అత్యంత ఖరీదైన 10 ఇంజక్షన్లను బి.ఆర్‌.అంబేద్కర్‌ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అందించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చిన్నారిని చదివించే బాధ్యతనుకూడా ప్రభుత్వం తీసుకొంటుంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాimage అల్లవరం మండలం నక్కా రామే రానికి చెందిన కొప్పాడి రాంబాబు నాగలక్ష్మి దంపతులకు చెందిన రెండున్నర సంవత్సరాల చిన్నారి బాలిక హనీ కి గాకర్స్ వ్యాధి పుట్టుకతోనే వచ్చింది. ఈ వ్యాధి వల్ల కాలేయం పనిచేయదు.

ఇటీవల గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా కోనసీమ జిల్లా గంటి పెద్దపూడిలో సీఎం పర్యటించారు. తిరుగు ప్రయాణంలో సీఎం ఉండగా, హనీ తల్లిదండ్రులు చిన్నారిని కాపాడాలంటూ ప్రదర్శించిన ప్లకార్డును సీఎం చూశారు. వెంటనే కాన్వాయ్‌ను ఆపి వారితో మాట్లాడారు . తన వెంట హెలిపాడ్‌ వద్దకు తీసుకురావాలని అక్కడున్న భద్రతా సిబ్బందిని ఆదేశించారు.

హెలిపాడ్‌ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో సీఎం క్షుణ్నంగా మాట్లాడి , హనీకి సోకిన వ్యాధి, చేయాల్సిన వైద్యం గురించి ఆరా తీశారు.చిన్నారి ప్రాణాలు నిలిపేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని, ఖర్చు ఎంతైనా పర్వాలేదని జిల్లాకలెక్టర్‌ హిమాన్షుimage-1 శుక్లాను సీఎం ఆదేశించారు. దీనికోసం ప్రతిపాదనలను వెంటనే పంపాలని ఆదేశించారు. కలెక్టర్‌ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, వాటిని మంజూరుచేసింది. హనీ వైద్యంకోసం కోటి రూపాయలు మంజూరుచేస్తూ ఆదేశాలు ఇచ్చిందని కలెక్టర్‌ వెల్లడించారు.

ఆదివారం అమలాపురంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి నందు చిన్నారి హనీకి ఇంజక్షన్లను కలెక్టర్‌ పంపిణీచేశారు. ఈ గాకర్స్ వ్యాధి నివారణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం 52 ఇంజక్షన్లను మంజూరు చేసిందని, ప్రస్తుతం 13 ఇంజక్షన్లను స్థానిక ప్రాంతీయimage-2 ఆసుపత్రికి పంపడం జరిగిందన్నారు. ఈ ఇంజక్షన్ ఖరీదు రూ 1,25,000 కాగా, కంపెనీతో తెప్పించారు. ప్రతి 15 రోజులకు ఒక ఇంజక్షన్‌ను, క్రమం తప్పకుండా చిన్నారికి ఇవ్వనున్నారు. దేశంలో ఈ వ్యాధి చాలా అరుదుగా సంక్రమిస్తుందని దేశవ్యాప్తంగా ఇటువంటి వ్యాధితో బాధప డుతున్న వారు 14 మంది ఉన్నారని ఆయన తెలిపారు.

LEAVE A RESPONSE