పుల్లయ్య..
ఆయన గురించి
ఎన్ని రాద్దామన్నా
చుట్టూ తిరిగి చేరేది
లవకుశ దరికే..
ఆ సూపర్ హిట్టు దారికే..!
సినిమా తన ప్రపంచమై
ఇంట్లోనే మొత్తం మూవీ
తీసేసిన రుషి..
మూకీల నాటి మనిషి..
టాకీలు కూడా తెగతీసిన
ఆయన కృషి..
అందించింది అఖండాలు..
అందులో కొన్ని కళాఖండాలు!
ఒకసారి లవకుశ తియ్యడమే
ఓ యాగం..
ఇక ఒకటికి రెండుసార్లు తీస్తే
అశ్వమేధయాగమే..
వాల్మీకి అద్భుత రచనకు
అత్యద్భుత దృశ్యరూపం..
తెలుగులో తొలి రంగుల
దృశ్యకావ్యం..
అప్పటికీ..ఇప్పటికీ..
ఎప్పటికీ నవ్యాతినవ్యం!
రామాయణానికి ఇంత అందమైన రూపం..
నభూతో నభవిష్యతి అన్నది
లలితా శివజ్యోతి సాక్షిగా
సెల్యూలాయిడ్ సత్యం!
భారతీయ భాషల్లో
ఎన్నో పౌరాణిక సినిమాలు..
తెలుగులో మరీ ఎక్కువ
అయితే పుల్లయ్య లవకుశ
మార్చేసింది
తెలుగు సినిమా దశ!!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286