Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి పాలన మాటలు, సమీక్షలకే పరిమితం

• మూడున్నరేళ్లలో 3 కిలోమీటర్ల కొత్తరోడ్డు వేయని ముఖ్యమంత్రి, విమానాశ్రయాలు నిర్మిస్తాడా?
• జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం పరిస్థితి పేరుగొప్ప-ఊరుదిబ్బలా తయారైంది.
• రోడ్ల నిర్మాణంకోసం నాబార్డ్ ఇచ్చిన రూ.1100కోట్ల నిధులకు, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక చేతులెత్తేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిదే
• ఆలపాటి రాజేంద్రప్రసాద్

మూడున్నరేళ్ల పాలనలో 3కిలోమీటర్ల కూడా కొత్తరోడ్లు వేయించలేని జగన్ రెడ్డి, రోడ్లనిర్మాణం ఇతరఅభివృద్ధి కార్యక్రమాలపై ఉత్తుత్తిసమీక్షలుచేస్తూ, ప్రజల్నిఇంకా మోసగిం చాలనే చూస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటిరాజేంద్రప్రసాద్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!

“జగన్ రెడ్డి మాటలు, సమీక్షల ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు. మే 10న, జూన్ 21న, అక్టోబర్ 7న జరిగిన సమీక్షల్లో పట్టణాభివృద్ధి, పురపాలక, రోడ్లుభవనాలశాఖలపై జగన్ రెడ్డి అధికారులతో చర్చించారు. మే నుంచి అక్టోబర్ వరకు 3 సమీక్షలు చేసిన జగన్ రెడ్డి 3 కిలోమీటర్ల రోడ్డైనా వేశాడా అని ప్రశ్నిస్తున్నాం. జగన్ రెడ్డి మాటలపాలనలో చేతలు శూన్యంగా మారాయి. మూడున్నరేళ్లలో రోడ్లనిర్మాణంకోసం నిధులు విడుదలచేయని ఏకైక ప్రభుత్వం దేశంలో వైసీపీప్రభుత్వం ఒక్కటే. తాను అధికారంలోకి వచ్చినప్పటినుంచి రోడ్ల నిర్మాణంపై ఏంచేశాడో వివరిస్తూ జగన్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి లీటర్ ఇంధనంపై రూపాయి సెస్ వసూలు చేస్తూ 3న్నరేళ్లలో జగన్ రెడ్డి రూ.2,500కోట్లు రాబట్టాడు. ఆ సొమ్ముతో రాష్ట్రంలో ఎక్కడైనా ఒకచిన్నరోడ్డు వేశాడా? రూ.11,193కోట్లవ్యయంతో రోడ్లు వేస్తున్నట్లు, రూ.10,368కోట్ల విలువైన పనులకు శంఖుస్థాపన చేస్తున్నట్లు గతంలో జగన్ రెడ్డి బ్లూమీడియాలో ఆర్భాటంగా ప్రకటనలిచ్చారు. కానీ అంతిమంగా రోడ్లనిర్మాణాన్ని ప్రకటనలకే పరిమితంచేశాడు. రోడ్ల మరమ్మతులకు, కొత్తవి వేయడానికి కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావడంలేదో జగన్ రెడ్డిచెప్పాలి. గతప్రభుత్వంలో పనులుచేసిన కాంట్రాక్టర్లపై కక్షసాధింపులకు పాల్పడిన జగన్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని వారు నమ్మేపరిస్థితి లేకుండా పోయింది. నాబార్డ్ కింద వచ్చిన రూ.1100కోట్ల గ్రాంట్ కు రాష్ట్రప్రభుత్వవాటాగా ఇవ్వాల్సిన వాటా(మ్యాచింగ్ గ్రాంట్) ఇవ్వలేక జగన్ రెడ్డి చేతులెత్తేశాడు. దాంతో ఆసొమ్ముకూడా వెనక్కు వెళ్లిపోయింది.

రోడ్లువేయలేని ముఖ్యమంత్రి టీడీపీ హాయాంలో జరిగిన అభివృద్ధిని తానుచేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటు….
రోడ్లమరమ్మతులు చేయలేని జగన్ రెడ్డి, గతప్రభుత్వం చేసిన అభివృద్ధిని తనదిగా చెప్పుకుంటున్నాడు. విజయవాడలో కనకదుర్గ వారధి టీడీపీహాయాంలో పూర్తైతే దాన్ని తాను పూర్తిచేసినట్లు డబ్బాలుకొట్టుకున్నాడు. చంద్రబాబుహాయాంలో 2,694కిలోమీటర్ల వరకు రోడ్లువేశారు. జగన్ రెడ్డి తన మూడున్నరేళ్లపాలనలో 2కిలోమీటర్లకొత్తరోడ్డు కూడా వేయలేదు. ఈ మూడు సమీక్షల మధ్యకాలంలో రాష్ట్రంలో ఏరోడ్డైనా బాగుచేశారా? అక్టోబర్ 7న జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ డిసెంబర్ ఆఖరికి రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణం పూర్తికావాలన్నారు. రూ.11,193కోట్లవ్యయంతో రోడ్లు వేయబోతున్నట్లు, రూ.10,368కోట్ల విలువైన పనులకు శంఖుస్థాపన చేస్తున్నట్లు గతంలో జగన్ రెడ్డి బ్లూమీడియాలో ప్రకటనలిచ్చారు. గతంలో జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మిస్తున్నామని చెబితే, జగన్ రెడ్డి ప్రజల్ని కూడా విమానాల్లో తిప్పుతారేమో అనుకున్నాం. రోడ్లు వేయడం చేతగాని సీఎం విమానాశ్రయాలు నిర్మిస్తాడా? రాష్ట్రంలోని రోడ్లపై ప్రయాణించాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. స్వయంగా వైసీపీఎమ్మెల్యేలుకూడా ప్రమాదాల బారిన పడుతున్నా రు. నేడు వైసీపీఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ గుంతలరోడ్డులో బైక్ కిందపడి గాయపడ్డాడు. ఆఖరికి చినజీయర్ స్వామి కూడా ఏపీలోని రోడ్లదుస్థితిపై వాపోయిన విషయాన్ని జగన్ రెడ్డి గుర్తించాలి. రోడ్లమరమ్మతులు చేయలేని జగన్ రెడ్డి, గతప్రభుత్వం చేసిన అభివృద్ధిని తనదిగా చెప్పుకుంటున్నాడు. చంద్రబాబుహాయాంలో 2,694కిలోమీటర్ల వరకు రోడ్లువేశారు. జగన్ రెడ్డి తన మూడున్నరేళ్లపాలనలో 294కిలోమీటర్లు కూడా వేయలేదు. కేంద్ర-రాష్ట్ర సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టాల్సిన అనేకప్రాజెక్ట్ లను అటకెక్కించారు. రాష్ట్రంలోని రోడ్లపై నాట్లువేయడం, చేపలు పెంచడం చేస్తున్నాకూడా ముఖ్యమంత్రికి సిగ్గులేదు. రోడ్లపై నడవలేక ఎక్కడైనా ఎవరైనా సొంతంగా రోడ్లు వేసుకుందామనుకుంటే వారిని పోలీసులసాయంతో అడ్డుకుంటున్నారు. మొసలికన్నీరు కారుస్తూ, మసిపూసిమారేడుకాయ చేస్తూ, ఎంతకాలం జగన్ రెడ్డి ప్రజల్ని మోసగిస్తాడు? కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించినందుకే రోడ్లు,ఇతరత్రా పనులు చేయడానికి వారు ముందుకురాని దుస్థితి. జగన్ రెడ్డి ఏలుబడిలో రాష్ట్రపరిస్థితి పేరుగొప్ప-ఊరుదిబ్బలా తయారైంది” అని ఆలపాటి స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE