Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికలకు వెళ్లే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా?

-3 రాజధానులపై ప్రజల మద్ధతుకోరుతూ తక్షణమే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా?
– విశాఖకేంద్రంగా ఉత్తరాంధ్రదోపిడీకోసమే జగన్ రెడ్డి అండ్ కో అభివృద్ధి వికేంద్రీకరణ రాగం ఆలపిస్తున్నారు
• మాటతప్పిన వారు రాజీనామాచేయాలి గానీ, మాటమీద నిలబడినవారు కాదు
• ప్రత్యేకహోదా తెస్తామని ప్రజల్ని మోసగించినవారు రాజీనామాచేయాలి
• పదవులకోసం ప్రాంతాలు, ప్రజలమధ్య చిచ్చుపెడుతున్నవారు రాజీనామాలుచేయాలి
• మూడేళ్లలో ఉత్తరాంధ్రకు ఏంచేయలేని అసమర్థులు రాజీనామాచేయాలి
• విశాఖ కేంద్రంగా సాగుతున్న వైసీపీ భూదోపిడీపై సీబీఐ విచారణ జరిపించాలి
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

“తన ధనదాహం, భూదోపిడీకోసం జగన్ రెడ్డి వికేంద్రీకరణముసుగులో మూడురాజధానుల జపంచేస్తుంటే, ఆయన విసిరే పదవులకోసం ఆశపడుతున్న వైసీపీనేతలు, పదవులు పోతాయన్న భయంతో బొత్స, ధర్మాన, తమ్మినేని లాంటివారు ఉత్తరాంధ్రవాసుల్ని రెచ్చగొడుతూ, అమరావతిరైతులపై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనంద్ బాబు గార్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
అచ్చెన్నాయుడిగారి విలేకరుల సమావేశం వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం…!

“అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ప్రజల్లో తనపై వ్యతిరేకత వచ్చినప్పుడల్లా, దాన్ని పక్కదారి పట్టించడానికి ముఖ్యమంత్రి ఏదో ఒకఅంశాన్ని తెరపైకి తేవడం ఆయనకు అలవాటుగా మారింది. మూడున్నరేళ్లనుంచి చూస్తున్నాం. ఈరోజుకీ ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమవుతోంది.

తాను, తన ప్రభుత్వం సాగిస్తున్న దోపిడీ, ప్రజాకంటకపాలన నుంచి ప్రజలు, మీడియా దృష్టి మళ్లించడానికే చేతగాని దద్దమ్మలైన ముఖ్యమంత్రి, మంత్రులు మూడురాజధానుల రాగం ఆలపిస్తూ, వికేంద్రీకరణ జపంచేస్తున్నారు. ఈ సన్నాసులంతా వాస్తవాలు తెలుసుకోవాలి. అసలు పరిపాలనా వికేంద్రీకరణకు ఆద్యుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారని తెలుసుకోండి. ప్రజలవద్దకుపాలన పేరుతో ప్రజల్ని, ప్రజాప్రతినిధుల్ని ప్రజలకు చేరువచేసింది చంద్రబాబు నాయుడుగారు. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రాకముందు ప్రజలు తమకు సమస్యవస్తే ఎక్కడికిపోవాలో, ఎవరికిచెప్పాలో తెలియక ఇబ్బందులుపడ్డారు.

మండల వ్యవస్థ ఏర్పాటుతో ప్రజలకు సుపరిపాలన అందించింది తెలుగుదేశంపార్టీ చేసినదాన్ని వికేంద్రీకరణ అంటారు. సాంకేతికత సాయంతో ప్రజలకు వచ్చిన సమస్యల్ని ఎప్పటికప్పుడు చంద్రబాబునాయుడు గారు పరిష్కరించారు..అదీ వికేంద్రీకరణ అంటే. దానికి విరుద్ధంగా అడ్డగోలుగా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి, కేంద్రప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇచ్చిన రూ.12వేలకోట్లను దారిమళ్లించాడు. అదేనా వికేంద్రీకరణ అంటే? స్థానిక సంస్థలకు ఉన్న అధికారాలు, విధులు, నిధులు లాక్కొని, వాటిని నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి వికేంద్రీకరణ గురించి మాట్లాడుతుంటే, దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది.

అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో జగన్ రెడ్డి ప్రాంతాలు, ప్రజలమధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారు. విభజనానంతరం ఏర్పడిన రాష్ట్రానికి రాజధానిలేని సమయంలో నిండు శాసనసభలో రాజధానిఏర్పాటుపై చర్చించాక, అన్నిపార్టీలు, 5కోట్లప్రజల ఆమోదంతో అమరావతిగా రాజధానిని ఎన్నుకోవడం జరిగింది. అమరావతి రాజధానిగా ఉంటే అభివృద్ధి జరగదని, అన్నిప్రాంతాల సొమ్ముని అమరావతిలో పెడుతన్నారని పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారు. అసలు తలకాయ ఉండే మాట్లాడుతున్నారా? టీడీపీ ప్రభుత్వంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్నిజిల్లాలకు వివిధరకాల పరిశ్రమలు వచ్చాయి.

మా హయాంలో 5లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఈ ప్రభుత్వమే అసెంబ్లీసాక్షిగాఒప్పుకుంది. అనంతపురంజిల్లాకు కియాపరిశ్రమను, కర్నూలుకు విత్తనాభివృద్ధి కేంద్రాన్ని, మెగాసోలార్ పార్క్ ను తీసుకొచ్చాం. విశాఖను పెట్టుబడుల కేంద్రంగా నిలిపి, ఆర్థికరాజధానిగా దేశంలోనే పదిఅగ్రనగరాల జాబితాలో నిలిపాం. తిరుపతిలో ఎలక్ట్రానిక్ హబ్, కోస్తాలో పోర్టులు, పోలవరం నిర్మాణం, కాకినాడకు పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ ఇలాచెప్పుకుంటూ పోతే చాలాఉన్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇది. అంతేగానీ ఈ ముఖ్యమంత్రిలాగా ప్రజల మధ్యచిచ్చుపెట్టడం, ప్రాంతాలమధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు.

ప్రజలకు, ప్రభుత్వానికి లేని అధికారాన్ని బలవంతంగా బయటకు తీసుకొచ్చి, రాజధానిపేరుతో కులాలు, ప్రాంతాలమధ్య చిచ్చు పెట్టడం దేనికి చేస్తున్నారో ప్రజలంతా గమనించాలి. రాజధాని మార్చాలంటే రాజ్యాంగసవరణ చేయాలని హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టంగాచెప్పాయి. సాక్షాత్తూ వైసీపీఎంపీ విజయసాయిరెడ్డే, ఏపీకి మూడురాజధానులు పెట్టాలనుకుంటున్నామని, అలాచేసే అధికారం ఆ రాష్ట్రానికి ఇవ్వాలంటూ రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు పెట్టింది నిజంకాదా?

ముఖ్యమంత్రి మాటమీద నిలబడేవాడయితే తక్షణమే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలి. మూడున్నరేళ్లలో చేసిన కుంభకోణాలు, పన్నులతో, బాబాయ్ హత్యతో దేశంలో ఏ ప్రభుత్వంపై రాని వ్యతిరేకత వైసీపీ ప్రభుత్వంపై వచ్చింది. తన అవినీతి, హత్యరాజకీయాలు బయటకురాకూడదనే జగన్ రెడ్డి 3 రాజధానులు అంటున్నాడు. జగన్ రెడ్డి నిజంగా మాట మీద నిలబడేవాడు అయితే, తక్షణమే అసెంబ్లీని రద్దుచేసి, మూడు రాజధానుల రిఫరెండంపై ఎన్నికలకు వెళ్లాలి. ప్రజలు ఆయనఆలోచనలు అంగీకరించి ప్రజలు గెలిపిస్తే, తాముకూడా వారు చెప్పినట్టే నడుస్తాం.

మాది ఎప్పుడూ ఒకటే మాట… పదవులు ఓట్లకోసం, రోజుకోలా మాట్లాడటం టీడీపీకి, అచ్చెన్నాయుడికి అలవాటులేదు. 2019లో అమరావతే రాజధాని అని టీడీపీ ఎన్నికలకు వెళ్లింది..2024లోకూడా అలానే వెళ్తుంది. మాట్లాడితే నన్ను రాజీనామా చేయమంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు ఒకలా… ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నవారు రాజీనామా చేయాలా…నేను చేయాలా? అమరావతిని అంగుళంకూడా కదిలించమని, రాజధాని అభివృద్ధిచేసి ఉద్యోగాలు, పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పింది మీరా…మేమా?

నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న మంత్రులు బొత్స, ధర్మాన, స్పీకర్ తమ్మినేని విశ్వసనీయతలేనివారు. అధికారం ఉంటే ఒకలా… లేకపోతే మరోలా మాట్లాడటం వారికి ఆదినుంచి ఉన్నజబ్బే. ఉత్తరాంధ్రకు జగన్ రెడ్డి అన్యాయంచేసినప్పుడు, కేంద్రప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించినప్పుడు ఆప్రాంత వైసీపీనేతలకు రాజీనామాలు గుర్తురాలేదా?

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ను జగన్ రెడ్డి నాశనం చేసినపుడు ఈ వైసీపీ నాయకులు, ఆప్రాంత మంత్రులు ఎందుకు రాజీనామాలు చేయలేదు? 25మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేకహోదా తెస్తానన్న వ్యక్తి, ఇప్పుడు మోదీముందు నోరెత్తని దుస్థితిలో ఉన్నాడు. హోదా తీసుకురాలేని వారు రాజీనామాలుచేయాలి. రైల్వేజోన్ సాధించలేని అసమర్థులు రాజీనామాలు చేయాలి. జగన్ రెడ్డి, బొత్స, ధర్మాన, తమ్మినేని, ధర్మశ్రీ ఉత్తరాంధ్రను ఉద్దరిస్తామంటే చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు అడ్డుకున్నారా?

జగన్మోహన్ రెడ్డి మంత్రి ఇవ్వకముందు ధర్మాన నోటికి ప్లాస్టర్ వేసుక్కూర్చున్నాడు. ఇదే ధర్మాన, బొత్స సత్యనారాయణ గతంలోకాంగ్రెస్ లో ఉన్నప్పుడు జగన్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని ఏమన్నారో ప్రజలకు తెలియదా? (ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం, కరణం ధర్మశ్రీలు అమరావతిగురించి గతంలో ఏంచెప్పారు, ఇప్పుడేంచెబుతున్నారనే వ్యాఖ్యల వీడియోలను అచ్చెన్నాయుడు విలేకరులకు ప్రదర్శించారు)

చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్రకు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ లన్నీ జగన్ ధనదాహంతో, అవినీతితో ఇతరప్రాంతాలకు తరలిపోవడం వాస్తవంకాదా? రాజధాని అయితే విశాఖ అభివృద్ధిచెందుతుంది అంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. విశాఖ నగరాన్ని ఐటీ కేంద్రంగా తీర్చిదిద్ది, పెట్రోకారిడార్, మెడ్ టెక్ జోన్, లులూగ్రూప్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అదానీ డేటాసెంటర్, ఫిన్ టెక్ వ్యాలీ, మిలీనియం ఐటీ టవర్స్ తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వంకాదా? విశాఖలో మూడుసార్లు సీఐఐ సమ్మిట్ నిర్వహించాం. అమరావతి రైతులు పాదయాత్రగా దైవ దర్శనానికి వెళ్తే మీకెందుకు నొప్పి? పైసా తీసుకోకుండా రాజధానికి భూములివ్వడం రైతులు చేసినతప్పా?

నాకు బుర్ర ఉంది … బొత్స, ఇతరులకు కనీసం బుర్ర, బుద్ధికూడా లేదని రాజధానిపై వారు చేసిన వ్యాఖ్యలతోనే తేలిపోయింది. బొత్సకు బుర్రఉంటే గతంలో ఆయనేం మాట్లాడాడో, ఇప్పుడేం మాట్లాడుతున్నాడో తనకు తాను వింటే మంచిది. జగన్ రెడ్డి, బొత్స, ధర్మాన, తమ్మినేని, ధర్మశ్రీ ఉత్తరాంధ్రను ఉద్దరిస్తామంటే చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, టీడీపీ అడ్డుకున్నాయా? అరసవెల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతం ధర్మాన, బొత్స, జగన్ రెడ్డిల జాగీరా? మూడేళ్లు మంత్రిగా ఉన్న బొత్స విశాఖపట్నానికి, ఉత్తరాంధ్రకు ఏంచేశాడు? 40 ఏళ్లపాటు ఏపార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా బొత్స, ధర్మాన మంత్రులుగా ఉన్నారు.. సంవత్సరాలతరబడి మంత్రులుగాఉన్న వాళ్లు ఉత్తరాంధ్రకు ఏం ఒరగబెట్టారో చెప్పాలి.

విశాఖ కేంద్రంగా జగన్ రెడ్డి అతని గ్యాంగ్ సాగిస్తున్న భూకబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలి…
విశాఖలో జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ 40వేల ఎకరాలు అన్యాయంగా కొట్టేశారు. ఏజెన్సీ ప్రాంతాలను కొల్లగొడుతూ, విలువైన బాక్సైజ్ ఖనిజాన్ని లూఠీచేస్తున్నారు. దసపల్లా భూములు, 22(ఏ)లోని భూములు, రుషికొండ, పంచగ్రామాల భూముల్ని, గంగవరం పోర్టుని మాయంచేశారు. తాము మాట్లాడిన దానిపై విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలి.

విశాఖ కేంద్రంగా జగన్ అండ్ కో సాగిస్తున్న భూదోపిడీపై అన్ని ఆధారాలతో సీబీఐ విచారణ కోరతాం.. విశాఖ కేంద్రంగా వైసీపీ భూకబ్జాలు, దోపిడీ చూసి అక్కడి ప్రజలు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. పదవులకోసం పాకులాడే వారి మాటలు నమ్మకుండా ఉత్తరాంధ్ర వాసులంతా సేవ్ ఉత్తరాంధ్ర అని ముక్తకంఠంతో నినదించాలి. ఉత్తరాంధ్రపై వాలిన వైసీపీ రాబందుల్ని తరిమికొట్టి, ఆప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆప్రాంత వాసులందరిపై ఉంది. వైసీపీవారికి సిగ్గుంటే, చేతనైతే తాము లేవనెత్తిన అంశాలపై, వ్యక్తిగత విమర్శలు చేయకుండా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. చేతనైతే, చేవ ఉంటే బొత్స, ధర్మాన, తమ్మినేనిలు తమప్రాంతానికి న్యాయంచేయాలి.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తిచేసి, 5లైన్లరోడ్లువేసి, పరిశ్రమలు తెచ్చి వారి పనితనం చూపించాలి. అవిచేయడం చేతగాక ప్రజలమధ్య విబేధాలు సృష్టిస్తున్నారు. విశాఖవాసులు ఎప్పుడు ఎవడొచ్చి తమభూములు,ఆస్తులపై పడతారోనన్న భయంతో వణికిపోతున్నారు. కొత్త రాజకీయ డ్రామాలో భాగంగా వైసీపీ పేటీఎం బ్యాచ్, జగన్ రెడ్డి వీరాభిమానులు కలిసి నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటుచేశారు దానిలో ప్రజలు పార్టీలు లేవు. ఉత్తరాంధ్ర వాసులంతా సేవ్ ఉత్తరాంధ్ర నినాదంతో వైసీపీరాబందులనుంచి మనప్రాంతాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నా.

రాష్ట్రప్రజలంతా రోడ్లు, తాగునీరు, ఉద్యోగాలు అడుగుతున్నారుగానీ మూడురాజధానులు, 30రాజధానులు కాదు. మూడున్నరేళ్లలో ఏం చేశారయ్యా అంటే చెప్పుకోవడానికి ఏంలేదు. ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాలకు టీడీపీప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చింది. అభివృద్ధిచేయడం చేతగాక, మూడురాజధానుల రాగం ఆలపిస్తున్న జగన్ రెడ్డి తక్షణమే అసెంబ్లీని రద్దుచేయాలి” అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE