– రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీపల్లా రాజేశ్వర్ రెడ్డి ,టీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, సీనియర్ నేత దేవీ ప్రసాద్
ఎన్నికల సంఘం పూర్తిగా వాళ్ళ చేతిలోనే ఉంటుందని మునుగోడు లో బీజేపీ నేతలు ఎన్నికల తేదీ ని ముందే చెప్పడంతో రుజువైంది.దొంగ ఓట్లు నమోదు చేయించిందే బీజేపీ, వాటిని అనుమతించేలా చేసింది కూడా బీజేపీ.కోర్టులకు వెళ్ళింది కూడా వాళ్లే. దొంగే దొంగ అన్నట్టు ఉంది.40 శాతం ఓట్లు తొలగుంచబడ్డాయి అని బీజేపీ చెప్తోంది చేసింది మీరే కదా?ప్రజా కోర్టులో బీజేపీ ఓటమి తధ్యం అని తేలిపోయింది.ఓట్లు పోయాయి కాబట్టి ఓడిపోయామని చెప్పటానికే ఈ ప్రయత్నం చేస్తున్నారు. 18వేల కోట్ల రూపాయలకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయింది నిజం.కేంద్ర బలగాలు తేవాలని చెప్తున్నారు.ఎన్ని బలగాలు తెచ్చిన నాగార్జునసాగర్,హుజూర్ నగర్ ఫలితమే ఇక్కడ రీపీట్ అవుతుంది.రాజగోపాల్ రెడ్డిని రాజకీయంగా బొంద పెట్టడం ఖాయం. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా రాజగోపాల్ రెడ్డి ఓటమి తప్పదు.