-చంద్రబాబుతో కలిసి కుట్రలు, కుతంత్రాలు
-విశాఖ గర్జన నుంచి డైవర్ట్ చేయడమే వారి లక్ష్యం
-అందుకే ఈ అనైతిక రాజకీయాలు
-ఇన్నాళ్లూ ముసుగులో రాజకీయాలు
-ఇవాళ ఇద్దరూ ముసుగు తొలగించారు
-కలిస్తే కలవండి. మాపై ఎందుకు విమర్శలు?
-పీకే అంటే ప్యాకేజీల పవన్‌కళ్యాణ్
-పీకే అంటే పెళ్ళిళ్ల పవన్‌కళ్యాణ్
-నీవు ముమ్మాటికి ప్యాకేజీ నాయకుడివే
-ఆ మాట అంటే చెప్పుతో కొడతావా?
-మరి నిన్ను ప్రజలంతా కలిసి అలాగే కొట్టాలా?
-వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
అది కాకతాళీయమా?:
ఇవాళ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఏ విధమైన మాటలు చెప్పారు. ఇద్దరం కాకతాళీయంగా కలిశామని కబుర్లు చెబుతున్నారు. ఎంత బాగా, ఇంకా ఎవరిని మోసం చేయాలని ఆ మాటలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ముసుగులో, చీకట్లో కలుస్తున్నారు. ఇదే విషయాన్ని మా పార్టీ చెబుతోంది. రాష్ట్ర ప్రజలు ఊహించిన విధంగానే మీ ఇద్దరి అక్రమ సంబ«ంధానికి ఫుల్‌స్టాప్ పెట్టి, మీ ఇద్దరి కొత్త బంధానికి తెరలేపారు. దీన్ని అందరం చూశాం. రేపటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కొత్తదనాన్ని చూస్తారని పవన్ అన్నారు. కానీ రేపటి వరకు ఆగలేకపోయారు. పెళ్లి, శోభనం ఒకరోజే అన్నట్లుగా వ్యవహరించారు. ఇద్దరూ కలిసి పోవడం. వారి మాటలు చూస్తే.. రాజకీయ ప్రయోజనాల కోసం అన్నట్లుగా కాకుండా.. రాష్ట్రంలో అప్రజాస్వామిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నట్లు మాట్లాడుతున్నారు. మీరు ఇద్దరూ కలవాలంటే కలవండి. అంతే కానీ ప్రజలను ఎందుకు మభ్య పెట్టాలని చూస్తున్నారు? వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు?
బాధ్యులకే పరామర్శలా?:
అసలు విశాఖలో ఏం జరిగింది? మంత్రులను ఎవరు కొట్టారు? వారిపై ఎవరు దాడి చేశారు? జనసేన కార్యకర్తలు కదా? మా పార్టీ కార్యకర్తలు జనసేనపై దాడి చేయలేదు కదా? అంటే దెబ్బ తిన్న వారిని పట్టించుకోకుండా, దాడి చేసిన వారిని చంద్రబాబు పరామర్శిస్తున్నారు. అసలు ఆయనకు బుద్ధి ఉందా? 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెబుతాడు.
డైవర్ట్ చేయడం ఉద్దేశం:
విశాఖ గర్జన కార్యక్రమాన్ని మీ ఇద్దరి కలయికకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారు? అసలు పవన్‌కళ్యాణ్ విశాఖకు ఎందుకు వెళ్లారు? నీ వ్యవహారం ఏమిటి? ఎందుకు నీవు అక్కడ కార్యక్రమం పెట్టుకున్నావు? విశాఖలో ప్రజలు తమ మనోభావాలు చెప్పడం కోసం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే, దాన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు మరో కార్యక్రమం పెట్టుకున్నారు. మా మంత్రులు తిరిగి వెళ్తుంటే వారిపై దాడి చేశారు. మళ్లీ మమ్మల్నే తప్పు పడుతున్నావు? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని విమర్శిస్తున్నారు. అందరూ ఏకం కావాలని అంటున్నారు. మీ వ్యవహారాలను ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు పార్టీ ప్రారంభించిన నాటి నుంచి అన్నీ అందరూ చూస్తున్నారు.
అది నిజమని రుజువు చేశావు:
నిన్ను ప్యాకేజీ నాయకుడు అంటే చెప్పుతో కొడతావా? మరి నిన్ను ఇవాళ అందరూ కలిసి నిన్ను కొట్టాలా? నీవు చేసిన పనేమిటి? ఇవాళ వైయస్సార్‌సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏమన్నారో.. నీవు చంద్రబాబుకు అమ్ముడు పోయావు అన్నారో.. అది నిజమని రుజువు చేశావు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో కాపు కులమంతా కలిసి ఉంది. మా పార్టీలో దాదాపు 33 మంది కాపు కులస్తులు ఎన్నికయ్యారు. కానీ జనసేన పార్టీ నుంచి చివరకు నీవు కూడా గెలవలేదు. మొత్తం కాపు కులాన్ని కట్ట కట్టుకు తీసుకుపోయి చంద్రబాబుకు అమ్మేయాలని చూస్తున్న నీవు, ఎప్పుడు ఏమేం మాట్లాడావో గుర్తు చేసుకో. నీవు కాపు కులానికి అనుకూలమో కాదో కానీ, చంద్రబాబుకు మాత్రం పూర్తిగా అనుకూలం. ఇది వాస్తవం.
చెప్పుతో కొట్టడం అంటే?:
నీవు ప్యాకేజీ నాయకుడివి అంటే, చెప్పుతో కొడతావా? అంటే ఎవరికీ చెప్పులు లేవా? ప్రజాస్వామ్యంలో ఉన్నాం. చెప్పులతో కొట్టడం అంటే ఏమిటో తెలుసా? నిన్ను గాజువాక, భీమవరంలో చిత్తుగా ఓడించారే.. అది చెప్పుతో కొట్టడం అంటే. నీ పార్టీ నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే అధికార పార్టీతో కలిసి వెళ్తున్నాడు. అదీ చెప్పుతో కొట్టడం అంటే.
గౌరవించడం మా పద్ధతి:
ఈ డ్రామా కానీ, ఈ యాక్టివిటీ అంతా కూడా, విశాఖ గర్జన కార్యక్రమాన్ని, అక్కడి ప్రజల మనోభావాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం. అదే నీ తాపత్రయం. నీ పార్టనర్ ఉద్దేశం. నీవే మా మంత్రులపై దాడి చేయించావు. మళ్లీ మమ్మల్ని విమర్శిస్తున్నావు. మరి ఆరోజు మా వెంట దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. మేము వారిని తీసుకురాలేమా? కానీ ఒకరికి ఒకరం గౌరవించుకోవాలి. అది మా పద్ధతి.
అందుకేనా ఈ ఫ్రస్టేషన్?:
మళ్లీ అంటున్నావు. మూడు పెళ్ళిళ్లు చేసుకోమంటున్నావు. నీ భార్యలకు భరణం ఇచ్చానని చెబుతున్నావు. అంటే పెళ్లి చేసుకోవడం. ఏడాది, రెండేళ్లు గడిపి ఆ తర్వాత పరిహారం ఇచ్చి వదిలేయడం. అదేనా నీ పద్ధతి. నీ మూడో భార్య నిన్ను వదిలిపోయిందా? అందుకేనా ఈ ఫ్రస్టేషన్. మాకు సందేహం కలుగుతోంది. ఇప్పటి వరకు నీ భాషలో చంద్రబాబు నీకు స్టెప్నీనో. లేక నీవు ఆయనకు స్టెప్నీవో. నిన్నటి వరకు వేరుగా ఉన్నట్లు వ్యవహారం. ఇవాళ మధ్యాహ్నం ఇద్దరూ ఒకటయ్యారు.
నీకసలు సిగ్గుందా?:
వంగవీటి రంగా గురించి మాట్లాడుతున్నావు. ఆయనను చంపిన వ్యక్తిని పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నావు. నీకు అసలు సిగ్గు ఉందా? కాపు నేత ముద్రగడ పద్మనాభంను, ఆయన కుటుంబ సభ్యులను దారుణంగా పోలీసులు వేధిస్తే, నాడు ఎక్కడ పడుకున్నావు, ఆనాడు ఎందుకు స్పందించలేదు. ఆరోజు అధికారంలో ఉన్నది నీ పార్టనరే కదా? అందుకే మళ్లీ చెబుతున్నాను. నీ పార్టీ కాపుల జనసేన కాదు. నీది కమ్మ జనసేన. నీ పక్కన ఉన్న నాదెండ్ల మనోహర్ ఇవాళ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ కళ్లల్లో అంతులేని ఆనందం. అంటే మిషన్ కంప్లీట్. సక్సెస్‌ఫుల్. ఇద్దరూ కలిసి నీ రాజకీయ పార్టీని నడిపిస్తున్నారు. సిగ్గు లేకుండా వారితో నడుస్తున్నావు.
వారితోనే ఉంటూ పోరాడతావా?:
విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నావు. అలా మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి నడుస్తున్నావు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయినా నీవు ఇవాళ విశాఖలో పోరాడతావా? దాన్ని అడ్డుకుంటావా? వారితో కలిసి నడుస్తూ, స్టీల్ ప్లాంట్ గురించి పోరాడతానని చెబుతావా?
అందుకు మేము సిద్ధం:
విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావద్దని నీ ఆలోచన. అదే చంద్రబాబు సంకల్పం. దాన్ని బలంగా వినిపించేందుకు విశాఖ ఉద్యమాన్ని డైవర్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఏం చేసినా, ఏం మాట్లాడినా విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటై తీరుతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎంతసేపూ విశాఖ ప్రజల మనోభావాలు గౌరవించొద్దు. వారి బాణి వినిపించొద్దు. అదే మీ లక్ష్యం. ఇప్పటికైనా మీ వైఖరి మానుకొండి. మారండి. మీ కలయిక రోడ్డెక్కింది. మీరు కలిసి పోరాడతామంటున్నారు. మీరు యుద్ధం అన్నారు కదా. అందుకు మేము సిద్ధం. నేను యుద్ధానికి రెడీ అన్నావు కదా. అందుకు మేము సిద్ధం. 2024 ఎన్నికల్లో కూడా 2019 నాటి ఫలితాలే వస్తాయి. యుద్ధం ఫలితం అదే.
ప్రజలే బుద్ధి చెబుతారు:
నిన్ను ప్యాకేజీ పవన్ అనడానికి ఇంత కంటే రుజువు ఏం కావాలి? చంద్రబాబు ఎయిర్‌పోర్టు నుంచి వస్తుండడం ఏమిటి? నీవు నొవాటెల్‌లో ఉంటే ఆయన వచ్చి కలవడం ఏమిటి? మీ నాటకాలను ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు కలవడమే కాకుండా, అందరూ కలిసి రావాలని అంటున్నారు. మీకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. మీరే మాపై దాడి చేశారు. మళ్లీ మాపైనే ఆరోపణలు చేస్తున్నారు. రేపు అమరావతి రైతులు ఉత్తరాంధ్ర వస్తారు. వారిపై దాడి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. కచ్చితంగా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ బాధ్యత వహించి తీరాలి. వికేంద్రీకరణ జరగాలి. మా ప్రాంతం అభివృద్ధి చెందాలి. అందుకే జగన్‌గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మా దగ్గర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటవుతుంది.
మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
రాష్ట్ర రాజకీయాల్లో పవన్ విలన్:
సినిమాల్లో పవన్ హీరో. రాజకీయాల్లో జీరో. ఎక్కడా ఆయనకు స్పష్టత, నిలకడ లేదు. పైగా ఎక్కడికక్కడ కార్యకర్తలను ఉసి గొల్పుతున్నాడు, సినిమాల్లో ఆయన హీరో కావొచ్చు. కానీ రాజకీయాల్లో విలన్‌లా మారాడు. అసలు చిరంజీవి అనే వ్యక్తి ఆయనకు జీవితం ఇవ్వకపోతే, పవన్ ఎక్కడ ఉండేవాడు?
గతంలో నాగబాబు కూడా పవన్‌ను తప్పు పట్టాడు. ఇవాళ చేతికి కట్టు కట్టుకుని నిలబడ్డాడు. రాష్ట్ర రాజకీయాల్లో పవన్ ఒక విలన్. ఇది వాస్తవం. పెళ్లి అనేది ఒక సర్దుబాటు జీవితం. సొంత ఇంట్లోనే భార్యనే సక్రమంగా ఏలుకోని వ్యక్తి, రాష్ట్రాన్ని ఏం ఏలుతాడు? ఆయన ఎప్పుడు, ఏ పార్టీతో కలిసి ఉంటాడనేది ఎవరికీ తెలియదు. ఈ 8 ఏళ్లలో 8 పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఏమంటున్నాడు. బీజేపీ వాళ్లు రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదని అంటున్నాడు. ఆయనకు కావాల్సింది చంద్రబాబును కలిసే రోడ్ మ్యాప్. ఇవాళ కలిశారు.
చచ్చిన పామును చంపుతామా?
వారి క్యారెక్టర్ అస్సానినేషన్ మేము చేయడం ఏమిటి? వారు ఎలాంటి వారనేది అందరికీ తెలుసు. చచ్చిన పామును ఇంకా ఎందుకు చంపుతాం? మేము జనవాణి కార్యక్రమం వద్దని చెప్పలేదే. తనంతట తానే అక్కడికి వెళ్లనన్నాడు. తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు కాబట్టి, జనవాణిలో పాల్గొనబోనని చెప్పారు. అది ఆయన స్వీయ నిర్ణయం. కానీ ప్రజలను రెచ్చగొడితే, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఎవరూ ఊర్కోబోరు. ఆయన ముమ్మాటికి ప్యాకేజీ నాయకుడే. అది తప్ప ఇంకోటి లేదు. పీకే అంటే ప్యాకేజీ కళ్యాణ్. పీకే అంటే పెళ్ళిళ్ల కళ్యాణ్.