• జగన్ ఉత్తుత్తి బటన్ తో ఎవరికీ లాభం లేదు
– చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల గ్రామంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు
– వర్షాలతో తమకు జరిగిన నష్టాన్ని చంద్రబాబుకు వివరించిన రైతులు
ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారంటే..అధిక వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రత్తి పంటను పరిశీలించాను…పంట మొత్తం వర్షాలకు దెబ్బతింది.భారీ వర్షాలకు ప్రత్తి, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు.పల్నాడు జిల్లాలో2.52 లక్షల ఎకరాల్లో ప్రత్తి, 1.50 లక్షల ఎకరాల్లో మిరప పంటల సాగు ఉంది.మిరప, ప్రత్తి పంటలకు ఇప్పటికే ఎకరానికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టారు.
తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న ముఖ్యమంత్రికి ఈ పంట నష్టం పట్టడం లేదా. అసత్యాలు చెప్పడంలో జగన్ దిట్ట….రైతులను ఆదుకోవాలనే ఆలోచన జగన్ కు లేదు. ప్యాలెస్ లో కూర్చుని కులకడానికి కాదు మీరు సిఎం అయ్యింది.రైతులకు ఇంత నష్టం జరిగితే అధికారులుగాని, ఎమ్మెల్యే గాని రాలేదు.పొలాలకు వెళ్లే ఎమ్మెల్యేలు రాలేదు….రైతులకు మేలు చేసే సిఎం రావాలి. జగన్ ఉత్తుత్తి బటన్ తో ఎవరికీ లాభం లేదు….జగన్ పొట్ట అబద్దాల పుట్ట.
జగన్ కు ధైర్యం ఉంటే రైతులకు ఏమి ఇచ్చావో ప్రతి గ్రామంలో బోర్డు పెట్టాలి. రైతులకు కట్టాల్సిన పంటల భీమా డబ్బులు కూడా కట్టని ప్రభుత్వం ఇది.మన మీద కేసులు పెడితే ఏమవుతుంది. పవన్ కళ్యాన్ పార్టీ వారి పైనా కేసులు పెట్టారు. అందుకే నేను వెళ్లి సంఘీభావం తెలియజేశాను.మాపై కేసులు పెట్టడంపై పెట్టే శ్రద్ద రైతులను ఆదుకోవడంపై పెట్టాలి.
గత ఏడాది మిర్చికి తామర పురుగువచ్చి పంట పోతే ఒక్కరైనా వచ్చి చూశారా.జగన్ రెడ్డి పాలన వల్ల రైతులు అంతా నాశనం అయ్యారు. జగన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ మటాష్. జగన్ సిఎం అయిన తరువాత గుంటూరు జిల్లాలో ఆత్మహత్యలు పెరిగాయి. జగన్ పాలనలో 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో ఎక్కువ రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉంది….కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది.
దేశంలోనే ఎక్కువ అప్పు ఉండే రైతులు మన రాష్ట్ర రైతులే. రైతులపై తలసరి అప్పు 2.45 లక్షల గా ఉంది. ఈ ప్రభుత్వంలో మైక్రో ఇరిగేషన్ రావడం లేదు…ఎరువులు సకాలంలో రావడం లేదు.2024లో గాని, జగన్ భయపడి ముందు ఎన్నికలు జరిపినా గానీ వైసిపిని ప్రజలను భూస్థాపితం చేస్తారు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు ఉరితాళ్లు వేస్తున్నాడు. తెలంగాణ మీటర్లు పెట్టడం లేదు. ఎక్కడా లేని ఈ అతితెలివి నీకే ఎందుకు వచ్చింది జగన్.ఈ అతి తెలివి పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలి. భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి ఎకరా పత్తికి 30 వేలు, ప్రతి ఎకరా మిరపకు 50 వేల పరిహారం ఇవ్వాలి. మైక్రో ఇరిగేషన్ ద్వారా 90శాతం సబ్సిడీ ఇచ్చిన ఘనత టిడిపి దే. టిడిపి హయాంలో 60 వేల కోట్లు ఇరిగేషన్ పై ఖర్చు పెడితే….ఇప్పుడు పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు.
జగన్ ఎక్కడ నుంచి వచ్చాడు….రైతు కుటుంబం నుంచి రాలేదా? అమరావతి రైతులను హేళన చేస్తారా….కార్లు, బంగారం అని హేళన చేస్తారా? నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఒక్కరికి ఉద్యోగం రాలేదు. నా జీవితంలో దాపరికం లేదు…అందుకే అన్ స్టాపబుల్ లో అన్ని వివరించాను. రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసేవరకు విశ్రమించను.
పవన్ కళ్యాణ్ విశాఖ పట్నం వెళ్లే హక్కులేదా? మీ దోపిడీ, కబ్జాలు బయటపడతాయి అని పవన్ ను అడ్డుకున్నారా?వినుకొండలో రైతును చెప్పుతో కొట్టి కేసులు పెట్టి జైల్లో పెట్టిన ప్రభుత్వం ఇది. జగన్ మోహన్ రెడ్డి సైకో అనుకుంటే…ఆయన కొత్త సైకోలను తయారు చేస్తున్నారు.అమరావతి కి వెళ్లేటప్పుడు నా కాన్వాయ్ పై దాడి చేస్తే ప్రజాస్వామ్యం అన్నారు.నా ఇంటిపై ఎమ్మెల్యే దాడికి వస్తే వాళ్లు అపాయింట్మెంట్ కోసం వచ్చారు అని చెపుతున్నారు.
టిడిపి కార్యాలయంపై దాడి చేసి ఏడాది అయ్యింది….ఇప్పటికీ చర్యలు లేవు..డిజిపి సమాధానం చెప్పగలరా? తాటాకు చప్పుళ్లకు, అక్రమ కేసులకు, దాడులకు నేను భయపడను. వివేకా హత్య జరిగితే నారా సుర రక్త చరిత్ర అన్నారు. నాది హత్యలు చేసిన చరిత్ర కాదు…ఆ తరహా రాజకీయం తెలీదుతప్పులు చేసిన వారిని బోను ఎక్కించిన చరిత్ర నాది.
నాడు వివేకా హత్యపై జగన్ సిబిఐ దర్యాప్తు కావాలి అన్నారు…తరువాత సిఎం అయ్యాక సిబిఐ దర్యాప్తు వద్దు అన్నారు. కన్న కూతురుగా తండ్రి హత్యపై పోరాడుతున్న సునీతను అభినందించాలిసిబిఐ దర్యాప్తు చేస్తుంటే వారిపైనే కేసులు పెట్టారు.ఇది ఎక్కడైనా ఉంటుందా…ఎవరైనా అడ్డంగా ఇలా చెయ్యగలరా? ఇప్పుడు సుప్రీం కోర్టులో మళ్లీ వివేకా హత్యపై విచారణ జరుగుతుంది.
సునీత వాదన అంత నిజం అని సిబిఐ కూడా అఫిడవిట్ వేసింది. ఈ ముఖ్యమంత్రికి ఒక్క నిముషం అయినా ఆ సీట్లో కూర్చునే అర్హత ఉందా.పవన్ రాజకీయ పార్టీ వేరే కావచ్చు…..కానీ ప్రజాస్వామ్యం కోసం నేను వెళ్లి మద్దతు ఇచ్చాను.రాజకీయ పార్టీలకే దిక్కులేకపోతే……ఇక ప్రజల సంగతి ఏంటి. అందుకే ఈ రోజు ప్రశ్నిస్తున్నా….తప్పుడు ఆరోపణలకు సిఎం సమాధానం చెప్పాలి జగన్ పాలనలో బిసిలు, ఎస్సిలు, ముస్లింలు సహా అందరూ దెబ్బతిన్నారు. జగన్ పాలనలో ప్రజల అప్పులు పెరిగాయి..ఆదాయం పెరగలేదు. అప్పులు పెంచే ప్రభుత్వం మనకు అవసరమా? ఈ ముఖ్యమంత్రి ప్రతాపం అన్నా క్యాంటీన్ లపైనా. రాష్ట్రాన్ని కాపాడుకుందాం…అందరూ సహకరించాలని కోరుతున్నా.