– ప్రశ్నించిన 40మంది టీడీపీ కార్యకర్తలను వైసీపీ పొట్టనబెట్టుకుంది
– 3వేలకు పైగా టీడీపీ కార్యకర్తలపై అక్రమకేసులు పెట్టి వైసీపీ వేధిస్తోంది
– ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల భేటీ
– దీన్ని చూసి జగన్ రెడ్డి, వైసీపీ నేతలకు ఫ్యాంటులు తడిచిపోతున్నాయి
– అందుకేవరుసగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ పెంపుడు కుక్కల్లా నోటికి పని చెప్పారు
– ప్యాకేజీలిచ్చే కింగ్ జగన్ రెడ్డేనని వైసీపీ పెంపుడు కుక్కలు గ్రహించాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
జగన్ రెడ్డి, వైసీపీప్రభుత్వ దుర్మార్గాలు పెచ్చరిల్లి, రాష్ట్రంలో రాక్షపాలన శ్రుతిమించింది కాబట్టే, ప్రజాస్వామ్యపరిరక్షణ, రాష్ట్రక్షేమం కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల భేటీ జరిగింద ని, దానికే ప్యాంట్లుతడుపుకుంటున్న కొన్ని జగన్ రెడ్డి పెంపుడుకుక్కలు, వైసీపీలోని కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు పదవులనే బిస్కట్లకు ఆశపడి, ప్రజలసొమ్ముదిగమింగడంకోసం ఇష్టానుసారం మొరుగుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే .. 40 మందిని కిరాతకంగా హతమార్చి, 3వేలమందిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.“జగన్ రెడ్డి, వైసీపీప్రభుత్వ సైకోపాలనలో రాష్ట్రంలో రక్తపాతం పెచ్చుమీరింది. పాలకుల అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన 40మందిని నడిరోడ్డుపై వేటాడి, వెంటాడి కిరాతకంగా హతమార్చారు. 3వేల మంది టీడీపీ కార్యకర్తలపై తప్పుడుకేసులుపెట్టి జైళ్లకు పంపారు. వైసీపీప్రభుత్వ అరాచకాలు, దుర్మార్గాలు శృతిమించి పాకానపడ్డాయి. మంత్రులు, ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నవారిని వేధించి, వెంటాడటమే లక్ష్యంగా జగన్ రెడ్డి, అతని కేబినెట్ వ్యవహరిస్తోంది. జగన్ రెడ్డి విసిరే బిస్కట్లకు ఆశపడి, కాపువర్గానికిమంత్రులు, ఎమ్మెల్యేలు పెంపుడుకుక్కల్లా మొరుగుతున్నారు. పార్టీలు, ప్రభుత్వంతో సంబంధం లేకుండా, ప్రజలకోసం పనిచేసేవారిని కూడా ఇష్టానుసారం దూషిస్తున్నారు. వ్యక్తిగత విషయాలను ఎత్తిచూపుతూ, వారిపరువు, ప్రతిష్టలు మంటగలుపుతూ శునకానందం పొందుతున్నారు.
జనసేన అధినేత, ఆపార్టీ వారు చేసిన తప్పేంటో చెప్పండి?
టీడీపీకార్యాలయంపై, చంద్రబాబు ఇంటిపై దాడిచేసిన వారిపై చర్యలెక్కడ?
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ను ప్రభుత్వం విశాఖపట్నంలో ఎందుకు నిర్బంధించిందో కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానంచెప్పాలి. జనసేన కార్యకర్తలపై అక్రమకేసులుపెట్టి, ఎందుకు అరెస్ట్ లు చేయించారో చెప్పాలి. ఆడా,మగా అనేతేడా లేకుండా చొక్కాలు పట్టుకొని ఈడ్చుకెళ్లి జైల్లోపెట్టేంత నేరం వారేంచేశారు? ఏడాదిక్రితం ఇదేరోజు మంగళగిరిలోని టీడీపీకార్యాలయంపై కర్రలు, కత్తులు, రాడ్లతో వైసీపీ గూండాలు, వీధిరౌడీల్లా వీరంగం వేసి దాడిచేశారు. అంత దురాగతానికి పాల్పడిన వారిపై ఈ ప్రభుత్వం ఒక్కకేసైనా పెట్టిందా?
ఒక్కడినైనా అరెస్ట్ చేసి, జైలుకు పంపిందా? దాడికి సంబంధించిన దృశ్యాలు, సాక్ష్యాలను డీజీపీకి ఇచ్చినా, పార్టీ కార్యాలయంలో దాడిసమయంలో పట్టుబడిన వ్యక్తిని పోలీసులకు అప్పగించినా, ఇప్పటివరకు తీసుకున్న చర్యలు శూన్యం. మాచర్లలో నాపైనా, మాపార్టీనేత బుద్దావెంకన్నపైనా దాడిచేసిన వాడికి మున్సిపల్ ఛైర్మన్ పదవిచ్చి సత్కరించారు. ఆనాడు మాపై జరిగిన దాడిఘటనకు సంబంధించిన ఫోటోలు, ఆధారాలు పోలీసులకు ఇచ్చినా వైసీపీగూండాలపై చర్యలు తీసుకోలేదు. మాజీ ముఖ్యమంత్రి, ప్రధానప్రతిపక్షనేత చంద్రబాబునాయుడి ఇంటిపైకి జోగిరమేశ్ అనేవ్యక్తి తాగి దాడికి వెళ్తే, అతన్నేంచేశారు. అతని వెంట వచ్చిన వందలాదిమందిలో ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? రాష్ట్రంలో ఒక్కవైసీపీతప్ప, ఏ పార్టీఅయినా ఎన్నడైనా ఇలాంటిచర్యలకు పాల్పడిం దా? పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని గూండాగిరీ, రౌడీయిజం చేసే వారు ఎన్నాళ్లు చేస్తారు?
చంద్రబాబు ఇలానే చేసుంటే జగన్ రెడ్డి, అతని తొట్టిగ్యాంగ్ ఎక్కడుండేది?
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డిపై, వైసీపీవారిపై ఇదేవిధంగా దాడిచేయించి ఉంటే, వారంతా ఎక్కడుండేవారు? ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న తొట్టి గ్యాంగ్ ఎక్కడ ఉండేది? ఏమయ్యేది? మేం ఆనాడు ఈ జగన్ రెడ్డి మాదిరే దుర్మార్గంగా, రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించిఉంటే, వైసీపీ, ఆపార్టీలోనివారు నామ రూపాల్లేకుండా పోయేవారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన రాజకీయపార్టీ అధినేత ఏంచేయాలో, ఎలానిలబడాలో, ఏంమాట్లాడాలో చెప్పేఅధికారం మీకుఎవరిచ్చారు?
ఇప్పటికే వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులపై ప్రజలు చీపుర్లు, చెప్పులతో తిరగబడుతూ, ఎక్కడికక్కడ సన్మానాలుచేస్తున్నారు. జనందెబ్బకు భయపడే జగన్ అండ్ కో జనసేన అధినేతను లక్ష్యంగా ఎంచుకున్నారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ని కలిసి, ప్రభుత్వ దుశ్చర్యలను తప్పుపట్టి, సంఘీభావం ప్రకటించిన వెంటనే తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోయాయి. మంత్రులు, వైసీపీఎమ్మెల్యేల ప్యాంట్లు తడిసిపోయాయి. జగన్ రెడ్డికి, వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది కాబట్టే, జగన్ రెడ్డి ఉస్కోఅనగానే పెంపుడు కుక్కలు రోడ్లమీదకు వచ్చి, అరవడం మొదలెట్టాయి. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ల కలయిక వైసీపీ పతనానికి నాంది పలికిందని తేలిపోయింది.
తాగి, ఊగి,వాగే దాడిశెట్టి రాజా, గంటకొట్టి, అరగంట వస్తావా అనే అంబటి, జగన్ రెడ్డి, పవన్ కల్యాణ్ ల కాళ్లుపట్టుకున్న వాళ్లు కూడా చంద్రబాబు గురించి మాట్లాడితే ఎలా?
పొద్దున లేస్తే తాగి, ఊగి, వాగే దాడిశెట్టి రాజా కూడా చంద్రబాబునాయుడిని అనేవాడా? ప్యాకేజీలు ఇవ్వడానికి జగన్ రెడ్డిలా చంద్రబాబువద్ద అవినీతిసొమ్ము, వేలకోట్ల అక్రమార్జన లేదని తెలుసుకోరా..రాజా! అక్రమార్జన, అవినీతిపునాదులపై పుట్టిన వైసీపీకి, ఆపార్టీ నేతలకు జగన్ రెడ్డికి పవన్ కల్యాణ్, చంద్రబాబుల పేర్లుకూడా ఉచ్చరించే అర్హతలేదు. జగన్ రెడ్డి పెంపుడుకుక్కల్లా మొరుగుతున్న కాపువర్గ మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ కల్యాణ్ కాలిగోటికి కూడా సరిపోరు. గుండెలమీద చెయ్యేసుకొని వారికై వారు ఆత్మవిమర్శ చేసుకుంటే వారిబతుకేంటో వారికే అర్థమవుతుంది. తాము ఎప్పుడూ జగన్ రెడ్డి అవినీతిని, దోపిడీని ప్రశ్నిస్తూనే ఉంటాము. విశాఖపట్నం కేంద్రంగా విజయసాయిరెడ్డి సాగించిన భూదోపిడీగురించి, ఉత్తరాంధ్రలో మంత్రులుధర్మాన, బొత్స, సీదిరిఅప్పలరాజు, స్పీకర్ తమ్మినేనిలు సాగిస్తున్న భూకబ్జాలు, అరాచకాల గురించి ప్రశ్నించాము.
చేతనైతే, చేవఉంటే వాటికి సమాధానంచెప్పండి. మేం మీఅవినీతి గురించి ప్రశ్నిస్తుంటే దానికి సమాధానంచెప్పకుండా గర్జనఅన్నారు. అదికాస్త తుస్పుమనేసరికి ఏంచేయాలో పాలుపోక పవన్ కల్యాణ్ ను నిర్బంధించారు. 2014లో తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించాలని పవన్ కల్యాణ్ కాళ్లుపట్టుకున్న కొట్టుసత్యనారాయణ, ఇప్పుడేదో మంత్రి పదవి ఉందికదా అని మిడిసిపడుతున్నాడు. నడమంత్రపుఅధికారంతో ఎగిసిపడుతున్న వైసీపీ నేతలందరికీ త్వరలోనే రాష్ట్రప్రజలు చెప్పులతోకొట్టి, సత్కారంచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవినీతి పునాదులపై పార్టీని నిర్మించి, అధికారంలోకి వచ్చి, రాష్ట్రాన్ని దోచుకుంటున్న జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి లది ఏ కలయిక?
వారిది కాలుష్యకలయిక… లేక కాటికిపోయే కలయికా? గంటకొడుతూ, అరగంటవస్తే చాలని అమ్మాయిలని పిలిచే అంబటి రాంబాబుస్థాయి ఎంత… అతని బతుకెంత? మంత్రిపదవికోసం ఆంబోతు బాబు ఎంతకైనా దిగజారుతాడు అనడానికి అతని వ్యాఖ్యలే నిదర్శనం. తనకు రాజకీయభిక్ష పెట్టిన చిరంజీవికుటుంబాన్ని హేళనచేస్తూ, పవన్ కల్యాణ్ ని విమర్శిస్తున్న కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ఇతరులందరూ జగన్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడే పవన్ కల్యాణ్ ని, చంద్రబాబుని విమర్శిస్తున్నారు. జగన్ రెడ్డి కాళ్లుపట్టుకొని పదవులు తెచ్చుకున్న అమర్నాథ్… నీవా కాపులు, పవన్ గురించి మాట్లా డేది? అరేయ్ అమర్నాథ్ … నీవయస్సు చంద్రబాబునాయుడి గారి అనుభవమంతలేదు, పవన్ కల్యాణ్ కాలిధూళికి కూడా నువ్వుసరిపోవని తెలుసుకో! అన్నంపెట్టిన ఇంటికే కన్నంవేసేలా అమర్నాథ్ ప్రవర్తిస్తున్నాడు.
పేర్ని నాని అలియాస్ పనికిమాలిన నానీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లుకూడా రావు
పనికిమాలిన నాని అలియాస్ పేర్నినాని … మొన్ననే జగన్ రెడ్డి కేబినెట్ నుంచి ఫుట్ బాల్ ని తన్నినట్టు తన్నాడు. అయినా నానికి సిగ్గు, శరంలేవు. వచ్చేఎన్నికల్లో నాని, బందర్ నియోజకవర్గంలో డిపాజిట్లుకూడా తెచ్చుకోలేడు. నానీకి ఆ నమ్మకం ఉంటే, తనతో పందేనికి రావచ్చు. ఎలాంటి పందేనికైనా తానుసిద్ధమే. వచ్చేఎన్నికల్లో బందర్ లోపోటీ చేసే ధైర్యం నానీకి లేదు. తనకొడుకుని ఎన్నికల బరిలో నిలబెట్టాలని చూస్తున్నాడు.
ఇలాంటి నీతిలేని వ్యాఖ్యలు మాట్లాడుతున్న వారంతా నిజంగా అసలు కాపులేనా? కాపులమని చెప్పుకుంటూ జగన్ కు భయపడి, అతని అవినీతిలో భాగస్వాములై, రాష్ట్రాన్ని, నమ్ముకున్నవారిని సర్వనాశనం చేసిన ఆవర్గ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికైనా కాస్త మానవత్వంతో ప్రవర్తిస్తే, జనంలో బతికిబట్టకడతారని హెచ్చరిస్తున్నాం.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యపరిరక్షణకోసం అన్నిపార్టీలు, మేథావులు, ప్రజాసంఘాలు పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఆక్రమంలోనే చంద్రబాబునాయుడు గారు నిన్న అందరికంటే ముందు ఒకఅడుగు ముందుకేసి పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారనే వాస్తవాన్ని ప్రజలంతా గమనించాలి” అని బొండా సూచించారు.