నిందే మోసాడో..
నిండా మునిగాడో..
బాసే అయ్యాడో..
బాటే చూపాడో..
దారే చూపించాడో..
గోదారే చూసాడో..
వెన్నుపోటే పొడిచాడో..
వెన్ను చూపక నిలిచాడో..
కలే కన్నాడో..
నెలే ఉన్నాడో..
అన్నను ముంచాడో..
రాజకీయాల్లోకి దించాడో..
ముగ్గే వేశాడో..
సిగ్గే విడిచాడో..
మొత్తానికి నందమూరి
రాజకీయ ప్రస్థానంలో
తొలి అడుగు
ఆయనతోనే..
తొలి మడుగు ఆయనతోనే..
ఆయనతోనే ఢిల్లీ ప్రవేశం..
అక్కడే మొదలైంది ఆవేశం..
అన్న విజయంలో..
తన వినయం..
అన్న చరిత్రలో..
తన ఛత్రం..
అన్న దూకుడులో
తన రాపిడి..
అన్న కోపంలో
తన ప్రకోపం..
అన్న ప్రతాపంలో
తన పరితాపం..
మొత్తానికి ఒక రచ్చ..
ఎప్పటికీ చెరగని ఓ మచ్చ..!
నాదెండ్ల భాస్కరరావు..
1985 కి ముందు..
తర్వాత..
అన్నతో చిరకాల మైత్రి..
అలా గుర్తుపెట్టుకోదు
ఆయన్ని ధరిత్రి..
ఏదేమైనా ఉమ్మడి ఆంధ్రకు
తాను సైతం
ఒక ముఖ్యమంత్రి..!
– ఈ ఎస్కే..