Suryaa.co.in

Andhra Pradesh

రాళ్లు వేసిన ఘటనపై డీజీపీకి లేఖ రాసిన వర్లరామయ్య

చంద్రబాబు నాయుడి నందిగామ రోడ్ షోపై రాళ్లు వేసిన ఘటనపై డీజీపీకి లేఖ రాసిన తెదేపా నేత వర్లరామయ్య

రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపాన్ని మీ దృష్టికి అనేకమార్లు తీసుకొచ్చాం. ప్రత్యేకించి ప్రతిపక్ష నేతలపై అధికారపార్టీ వైసీపీ చేస్తున్న దాడులపై పలుమార్లు పిర్యాదు చేశాం. భద్రతా లోపాలకు కారణమైన అధికారులపై గానీ, దాడులకు పాల్పడిన వారిపై గానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 2019 ఆగష్టులో జెడ్ ప్లస్ క్యాటగిరి భద్రతలో ఉన్న నారా చంద్రనాయుడి ఇంటిపై డ్రోన్ కెమేరాలు ఎగురవేశారు. 2019 నవంబర్ లో అమరావతి రాజధాని బస్సు యాత్రపై రాళ్లు, కర్రలు రువ్వారు.2021 నంబంర్ లో అధికారపార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్షనేత ఇంటిపై దాడికి యత్నించాడు.

తాజాగా 2022 నవంబర్ 4 న ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పర్యటించిన చంద్రబాబు నాయుడి రోడ్ షోపై రాళ్లు వేశారు.రోడ్ షోకు ముందుగానే అనుమతులు తీసుకున్నప్పటికీ తగినంత భద్రత ఏర్పాట్లు చేయలేదు.రాళ్ల దాడి ముందుగానే ప్రణాళిక ప్రకారం జరిగిందనడానికి దాడి చేసే ముందు పవర్ కట్ చేయడమే.చంద్రబాబు నాయుడు గారిపై వేసిన రాయి ఆయన భద్రతా సిబ్బంది మధుకు తగలడంతో గాయలపాలైనాడు.

రూట్ మ్యాప్ పోలీసులకు ముందే ఇచ్చినప్పటికీ రోడ్ షో జరిగే చుట్టు ప్రక్కల ఇళ్లను ఎందుకు తనిఖీ చేయలేదు?ప్రజాసమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షనేతను ప్రజాస్వామ్యబద్దంగా ఎదుర్కోలేక అధికారపార్టీ గూండాలు ఇలా దాడులకు ప్రయత్నిస్తున్నారు. దాడికి పాల్పడిన గూండాలను రక్షించేందుకు రాయి యాత్రలోనే వారే వేశారని పోలీసులు చెప్పడం దుర్మార్గం.ప్రతిపక్షనేతకు సరైన భద్రత కల్పించడంలో పోలీసులు పైఫల్యం చెందారు.పోలీసులు ఐపిసి 120బి, 332 సెక్షన్ల కింద కేసు నమోదు చేయకుండా 324 కింద కేసు నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోంది.

విశాఖపట్నంలో అధికారపార్టీ మంత్రులపై జరిగిన సాదారణ దాడిపై మాత్రం ఐపిసి 307తో ఎట్మెప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు.చంద్రబాబు నాయుడిపై కుట్రపూరితంగా దాడి చేసి ఒక పోలీసు అధికారికి గాయాలైనప్పటికి ఎట్మెప్ట్ టు మర్డర్ కేసు ఎందుకు నమోదు చేయలేదు? భద్రతా లోపాలకు కారణమైన డిఎస్పీ, సిఐ, ఎస్.ఐ లకు సస్పెండ్ చేసి సరైన సెక్షన్లతో తీరిగి కేసు నమోదు చేసి నిందితులకు శిక్షపడేలా చూడండి.

LEAVE A RESPONSE