Suryaa.co.in

Telangana

దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

– బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ బోర్డ్ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్

పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ నివాసం పై టీఆర్ఎస్ పార్టీ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.రాజకీయ పార్టీ నేతలు రాజకీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.ప్రతిపక్ష పార్టీల నేతల ఇంటిదగ్గర అదేవిధంగా పార్టీ ఆఫీసుల ముందు ముందస్తుగా పోలీసులను పెట్టడం గృహనిర్బంధాలు చేయడం టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరుగుతున్నదే.

వందలాదిమంది టిఆర్ఎస్ నేతలు గూండా ల్లాగా ధర్మపురి అరవింద్ ఒక పార్లమెంటు సభ్యుడు ఇంటిపై దాడి చేస్తుంటే నిఘా విభాగం ఎక్కడున్నది.టిఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పూర్తిగా అవహేళన చేస్తూ పరిపాలన సాగిస్తున్నది. అనడానికి పార్లమెంటు సభ్యులు ఇంటి పైన దాడి నిదర్శనం. ఒక పార్లమెంట్ సభ్యుడు ఇంటిపైన దాడి చేస్తే టిఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రి, మంత్రులు దాడులను ఖండించకపోవడం పరోక్షంగా ఒప్పుకున్నట్లే.

LEAVE A RESPONSE