Suryaa.co.in

Andhra Pradesh

పాలనా సంస్కరణల్లో దేశానికే ఏపీ ఆదర్శం

-గ్రామ సచివాలయ వ్యవస్థ దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రానికి నిపుణుల కమిటీ సూచన
-ఎంపీ విజయసాయి రెడ్డి

విశాఖపట్నం, నవంబర్ 23: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితో ప్రవేశపెట్టిన వ్యవస్థలన్నీ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్ది పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా బుధవారం పలు అంశాలు వెల్లడించారు.

ఏపీలో అమలవుతున్న గ్రామ సచివాలయ వ్యవస్థను దేశమంతటా అమలు చేయడం ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలు సమర్ధంగా ప్రజలకు చేరే వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక నిపుణుల కమిటీ సూచించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన 32 మందితో కూడిన నిపుణులు బృందం ఈ దిశగా సూచనలు చేసిందని అన్నారు. మొత్తం 8 రాష్ట్రాల్లో కేంద్ర బృందం పర్యటించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ సాహసోపేతమైన ప్రయోగమంటూ కితాబిచ్చిందని, పెద్ద రాష్ట్రాలకూ సాధ్యం కాని రీతిలో సచివాలయాల ద్వారా సక్రమంగా పంపిణీ జరుగుతోందని బృందం ప్రశంసించిందని అన్నారు.

చంద్రబాబును చూసి “ఇదేం ఖర్మ” అని భావిస్తున్న ప్రజలు
పప్పు నాయుడు (లోకేష్) ఎందుకూ పనికిరాడు “ఇదేం ఖర్మ” అని చంద్రబాబు భావిస్తుండగా, చంద్రబాబును చూసి ప్రజలు “ఇదేం ఖర్మ” అని అనుకుంటున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు. అయితే బాబు దెబ్బకు 23కే పరిమితమయ్యామనీ- 2024 ఎన్నికల్లో ఈ సంఖ్య సున్నా అయిపోయే ప్రమాదం ఉందని “ఇదేం ఖర్మ” అని టీడీపీ ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నారని తెలిపారు.

LEAVE A RESPONSE