పేదల వైద్యానికి కేసీఆర్ సర్కారు తన వంతు సాయం తప్పకుండా అందిస్తుందని తెలంగాణ డెప్యూటీ స్పీకర్ పద్మారావు హామీ ఇచ్చారు. నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి లో భాగంగా ఉపసభాపతి పద్మారావు గౌడ్ శుక్రవారం సికింద్రాబాద్ నియోజకవర్గంలో తార్నాక ప్రాంతానికి చెందిన వనజ , అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ఎల్లమ్మ కు CMRF ద్వారా మంజూరైన నిధుల మంజూరు పత్రాలు (LOC) లబ్దిదారులకు అందించారు. సీతాఫలమంది లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ 2 లక్షలు 1.00 లక్షలు విలువజేసే LOC పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు , పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.