Suryaa.co.in

Features

కమ్యూ నిస్టుల విధానాలు ఎలా ఉంటాయి అంటే….

వీళ్ళు మతతత్వానికి వ్యతిరేకులు అని చెప్పుకుంటారు. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే , వీళ్ళు కేవలం హిందూ మత పార్టీలకు మాత్రమే వ్యతిరేకులు. పశ్చిమ బెంగాల్‌లో పూర్తి మత పిచ్చి పార్టీ అయిన అబ్బాస్ సిద్ధికి పార్టీ తో, పొత్తు పెట్టుకుంటారు. అలాగే తమిళనాడు లో ముస్లిం లీగ్ పార్టీ తోనూ, కేరళ లో పీఎఫ్‌ఐ ( అత్యంత తీవ్ర మతతత్వ సంస్థ ఇది) తో నూ సత్సంబంధాలు నెరుపుతారు.. కమ్యూనిస్టులకు మొట్టమొదటి లక్షణం దైవాన్ని నమ్మరు. కానీ ఇందులో కూడా ఒక్కో మతానికి ఒక్కో రూలు. కమ్యూ నిస్టుల లో ఉన్న హిందువులను మాత్రమే దైవానికి దూరం చేస్తారు. కమ్యూనిస్ట్ లలో ఉన్న ముస్లిం లు, స్వేచ్చగా నమాజ్ చేస్తారు. కానీ హిందూ కమ్యూనిలు ఎవడు గుడి కి కూడా పోరు.

ఎవరైనా బలమైన హిందూ అభిమాని ఉంటే, వాన్ని తీవ్రంగా విమర్శిస్తారు. మతతత్వ వాది అని. కానీ ముస్లిం, క్రైస్తవుల లో ఉన్న తీవ్ర మత వాదుల జోలికి కూడా పోరు. ఇంత వరకు కమ్యూనిస్టులు ముస్లిం లలో ఉన్న మత పిచ్చి గురించి ఒక్కసారి కూడా విమర్శించిన దాఖలాలు లేవు గమనించండి.

యజ్ఞాలు, యాగాలు, పూజలను అవహేళన చేస్తూ అవమానిస్తారు. మూఢనమ్మకాలు అని ప్రజల భక్తి భావాలను పోగొట్ట డానికి ట్రై చేస్తారు. కానీ ముస్లిం లు రోజూ నమాజ్ చేయడం గురించి కానీ, క్రైస్తవులు చర్చ్ లో చేసే ప్రార్థనల గురించి కానీ ఒక్క మాట అనే సాహసం కూడా చేయరు. చేస్తే వాళ్ళు , వీళ్లకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేస్తారు అని భయం.

హిందువులను మాత్రం కులాల పేరు తో విడగొడతారు. దళితులు, బ్రాహ్మణులు, బీసీలు, అని ఒకరితో ఒకరు కొట్టుకునేలా చిచ్చు పెడతారు. అదే ముస్లిం మతాల్లో ఉన్న దురాచారాలు గురించి పల్లెత్తు మాట అనే సాహసం చేయరు.

130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం లో, రోజూ చాలా హత్యలు, రేప్ లు జరుగుతూ ఉంటాయి అందులో ఎవరైనా అగ్ర కులస్తులు దళితుల మీద రేప్ చేసిన ఘటన ఉంటే, ఇగ వీళ్లకు పండగే. ఒక నెల రోజులు ఆ సంఘటన ఆధారం చేసుకొని, హిందువుల్లో చిచ్చు పెట్టి ఇప్పటికే దళితులను దూరం చేసి , వాళ్ళు అందరూ క్రైస్తవం తీసుకునేలా చేశారు. అదే ఒక ముస్లిం ఒక దళిత అమ్మాయిని రేప్ చేసిన ఘటనలు ( అలాంటివి చాలా ఘటనలు ఉన్నాయి) ఉంటే, ఆ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు
వీళ్ళ వ్యూహం ప్రకారం హిందువులు అందరూ ఒక్కటిగా ఐక్యంగా ఉండకూడదు.

కరోనాను తయారు చేసి ప్రపంచం మీద వదిలిన చైనాను ప్రపంచం అంతా తిడుతున్న కూడా, కమ్యూనిస్టు లు ఒక్క మాటా అనరు. సందు దొరికితే చాలు, చైనా ఇంత గొప్ప అంత తోపు అని పొగడడనికి రెడీగా ఉంటారు. ఎందుకంటే చైనా లో ఉంది కమ్యూనిస్ట్ . అక్కడ శాశ్వతంగా కమ్యూనిస్టు లదే అధికారం. వాళ్ళ రాజ్యాంగంలో అలా ఉంది. అత్యంత మూర్ఖ రాజ్యాంగం వాళ్ళది. అయినా కూడా ప్రజాస్వామ్యం గురించి, మనకు లెక్చర్ లు ఇస్తారు గాని, చైనా మాట ఎత్తితే కోపం వస్తుంది..

బీజేపీ అంటే వీళ్లకు కోపం నషాళానికి అంటుతుంది. ఎందుకంటే అది హిందువులకు మద్దతుగా మాట్లాడుతుంది . హిందువులపై జరిగే అత్యాచారాల మీద పోరాడటం బీజేపీ సిద్దాంతం. అందుకే వీళ్లకు బీజేపీ అంటే పడదు. హిందువుల పక్షాన మాట్లాడే ఏకైక పార్టీ బీజేపీ ( గతంలో బాల్ ఠాక్రే ఉన్నపుడు శివసేన కూడా ఉండేది. కానీ ఆయన చనిపోయాక అది కూడా, ఇప్పుడు సెక్యులర్ గా మారిపోయి.. కాంగ్రెస్, కమ్యూనిస్టు పక్షాన చేరిపోయింది)

ఈ కమ్యూనిస్టు భావజాల వ్యక్తులు, ఇప్పుడు అన్ని డిపార్టుమెంట్లలో చేరిపోయారు. వీళ్ళందరూ కమ్యూనిస్టు భావజాలం కోసం పోరాడుతూ, హిందూ వ్యతిరేకులుగా మారి చైనా తొత్తులుగా మారుతున్నారు. మీడియా, పోలీస్, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ అధికారుల్లో అన్నిట్లో వీళ్ళు వ్యాపించారు ఇప్పుడు.

గ్రామాల్లో గ్రామ దేవతలకు బలి ఇచ్చే గ్రామస్తుల సంప్రదాయాలను గేలి చేస్తూ, మెల్లగా దేవుడు లేడు.. ఏం లేదు అంటూ ప్రజలను హిందూ మతానికి దూరం చేయడమే వీళ్ళ లక్ష్యం. వీళ్ళ ఇంటిలో కుటుంబ సభ్యులు అన్ని పూజలు చేస్తారు. హిందూ సాంప్రదాయాలు పాటిస్తారు.

వీళ్ళ కుట్ర లను ఎదుర్కోవడానికి మనం అందరం ధర్మానికి, దేవునికి, భక్తి కి దగ్గరగా ఉంటూ.. హిందువులు అందరం ఐక్యంగా ఉండాలి. వీళ్ళ ఆటలు తిప్పి కొట్టాలి. వీళ్లకు దేశం మొత్తం లో ఒక్క కేరళ తప్ప దిక్కూ మొక్కు లేదు. కానీ బీజేపీ ని ఓడించడానికి మిగతా పార్టీ లకు మద్దతిస్తూ, స్వయం సంతృప్తి పొందుతారు.

– శ్యాం

LEAVE A RESPONSE