హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అక్కిరెడ్డి సంజీవరెడ్డి, తోపాటు కరకగూడెం సర్పంచ్ ఊకే రామనాథం, మదర్ సాహెబ్, సోమరాజు,కుడితిపుడి కోటేశ్వరరావు, బూర నర్సయ్య,గోగ్గలి నరసయ్య, సుబ్బారావు, నిమ్మ లింగారెడ్డి, ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు వారందరికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గులాబీ కండవా కప్పి పార్టీలోకి స్వాగతం ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ ఈసారి మంచి విజయాలు సాధించబోతున్నదని, అందరూ కలిసి కట్టుగా విజయం ఏకపక్ష మయ్యేలా పనిచేయాలని సూచించారు. పినపాక నియోజకవర్గ అభివృద్ధి పై ప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి ఉందన్నారు.