-అందుకే పిచ్చిపచ్చిగా వాగుతున్నడు
-ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి…
-ఆ తరువాత నా తల నరకినా, చెప్పుతో కొట్టినా ప్రజల కోసం భరించేందుకు సిద్ధం
-కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కింది
-ప్రభుత్వ అధికారిగా ఉంటూ క్రైస్తవ మత ప్రచారం చేస్తారా?
-అలాంటి అధికారిని రోడ్లమీద ఉరికించి కొట్టండి
-సెస్ ను పూర్తిగా అవినీతి మయం చేసి దివాళా తీయించిన టీఆర్ఎస్
-లాభాల్లో ఉన్న సెస్ ను 450 కోట్ల అప్పుల్లో ముంచిన దుర్మార్గులు టీఆర్ఎస్ నేతలు
-మళ్లీ టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే… సెస్ ను ఎలక్ట్రిసిటీ బోర్డులో కలిపేయడం ఖాయం
-సెస్ దుస్థితిని చూసి ఆ మహానుభావుల ఆత్మలు ఘోషిస్తున్నయ్
-బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే సెస్ ను కంటికి రెప్పలా కాపాడతాం
-అవినీతిపరుల భరతం పడతాం… తిన్న సొమ్మంతా కక్కిస్తాం
-సిరిసిల్ల బీజేపీ కార్యకర్తల సమావేశంలో టీఆర్ఎస్ పై ధ్వజమెత్తిన బండి సంజయ్
ట్విట్టర్ టిల్లు ‘‘విత్ డ్రావల్ సిమ్టమ్స్’’తో బాధపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అందుకే పిచ్చిపిచ్చిగా వాగుతున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముందు ప్రజలకు అమలు చేయాలని సూచించారు. ఆ తరువాత ప్రజల కోసం తల నరకించుకోవడానికైనా… చెప్పు దెబ్బలు తినడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
ప్రభుత్వ అధికారిగా ఉంటూ క్రైస్తవం వల్లే కరోనా తగ్గిందని, క్రైస్తవంవల్లే భారత్ అభివ్రుద్ధి చెందిందంటూ మాట్లాడిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును రోడ్లపై ఉరికించి కొట్టినా తప్పులేదని మండిపడ్డారు. లాభాల బాటలో ఉన్న సెస్ ను పూర్తిగా దివాళా తీయించిన టీఆర్ఎస్ అభ్యర్థులకు మళ్లీ ఓట్లేసి గెలిపిస్తే… సెస్ కు ఇవే ఆఖరు ఎన్నికలవుతాయని హెచ్చరించారు. పొరపాటున టీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే సెస్ ను ఎలక్ర్టిసిటీ బోర్డులో కలిపేయడం ఖాయమన్నారు.
సెస్ దుస్థితిని చూసి ఎంతో గొప్ప ఆశయంతో ఆ సంస్థను నెలకొల్పిన మహానుభావులు చెన్నమనేని రాజేశ్వరరావు, తంగళ్లపల్లి నర్సింగరావుల ఆత్మలు ఘోషిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే… సెస్ ను కంటికి రెప్పలా కాపాడుకోవడంతోపాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తామని హామీ ఇచ్చారు.
సెస్ ఎన్నికల్లో భాగంగా బండి సంజయ్ ఈరోజు సిరిసిల్ల విచ్చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిరిసిల్లలోని లహరి గ్రాండ్ ఫంక్షన్ హాలులో బండి సంజయ్ సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బండి సంజయ్ తోపాటు జిల్లా అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణి రుద్రమదేవి, టి.వీరేందర్ గౌడ్, జిల్లా ఇంఛార్జ్ మోహన్ రెడ్డితోపాటు బీజేపీ బలపర్చిన సెస్ అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….
రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గపు, నియంత, రాక్షస పాలన అంతం కోసం ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నా. 5 విడతలు పూర్తయ్యాయి. ఈ యాత్రను, బహిరంగ సభను విజయవంతం చేసిన అందరికీ పేరుపేరునా వందనాలు. తెలంగాణ మాదిరిగా దేశమంతా అభివ్రుద్ధి చెందాలని కేసీఆర్ అంటున్నడు… తెలంగాణ ఏ విషయంలో అభివ్రుద్ధి చెందింది? రుణమాఫీ ఇయ్యలే. ఉద్యోగాలు భర్తీ చేయలే. నిరుద్యోగ భ్రుతి ఇయ్యలే. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇయ్యలే. దళిత బంధు ఇయ్యలే. దళితులకు 3 ఎకరాలు ఇయ్యలే. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నయా పైసా ఇయ్యలే.. రైతుల ఆత్మహత్యలు ఆగలే. వడ్ల కొనుగోలు సరిగా చేయడం లేదు. ఫ్రీ యూరియా ఇయ్యడం లేదు.
వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తానని మాట తప్పిండు. ఇయాళ 15 గంటలే సరఫరా చేయాలని అధికారికంగా ఆదేశాలిచ్చిండు. మరి తెలంగాణ దేంట్లో అభివ్రుద్ధి చెందింది? రాష్ట్రాన్ని ఏ విధంగా అభివ్రుద్ధి చేశారని దేశానికి నమూనా కావాలంటున్నవ్. తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యమకారులందరినీ పక్కన పెట్టినవ్. ఇయాళ టీఆర్ఎస్ పార్టీలో కూడా తెలంగాణ పదాన్ని తీసేసి ప్రజలను వంచించినవ్. లండన్, ఇస్తాంబుల్, న్యూయార్క్ చేస్తానన్న హామీలేమైనయ్… టీఆర్ఎస్ దివాళా తీసిన పార్టీ. బందిపోట్ల రాష్ట్ర సమితి. బార్ అండ్ రెస్టారెంట్ సమితి. ఆ పార్టీని జనం పట్టించుకోవడం లేదు. అందుకే ప్రీపెయిడ్ (ముందస్తు చెల్లింపులతో కొనుగోలు చేసిన), పోస్ట్ పెయిడ్ నేతలను తీసుకొచ్చి బీఆర్ఎస్ కేసీఆర్ గురించి గప్పాలు కొడుతున్నడు.
రైతులకు సాయం చేస్తున్న ప్రభుత్వం నరేంద్రమోదీదే. ఎంత భారమైనా రైతులకు సబ్సిడీపై కేంద్రం యూరియా సరఫరా చేస్తోంది. రైతులకు ఫసల్ బీమా అమలు చేస్తున్నరు. ఏటా రూ.6 వేలు ఇస్తున్నరు. తెలంగాణను అభివ్రుద్ధి చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. అవసరమైన నిధులిస్తోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. రోడ్లు, రైల్వే లేన్లు సహా అన్ని విషయాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా తిరిగి కేంద్రాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నరు. జనంలో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలని చూస్తున్నరు.
కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కింది. అయ్య నా తలను 6 ముక్కలు చేస్తానన్నడు. కొడుకేమో చెప్పుతో కొడతానంటున్నడు. బిడ్డనేమో మా అరవింద్ ను చెప్పుతో కొడతానంటుంది. మీలాగా సంస్కార హీనంగా మాట్లాడలేం. మీరిచ్చిన హామీలన్నీ అమలు చేయండి… అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వండి. దళితులకు మూడెకరాలు ఇవ్వండి. పోడు భూముల సమస్య పరిష్కరించండి. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలివ్వండి. రైతులకు రుణమాఫీ చేయండి. ప్రజా సమస్యలన్నీ పరిష్కరించండి. అప్పుడు నా తల నరకండి. నరికించుకోవడానికి సిద్ధంగా ఉన్నా.. చెప్పుతో కొట్టించుకోవడానికి రెడీగా ఉన్నా.. లాభాల్లో ఉన్న సెస్ ను అప్పులు చేసిందెవరు? అధికార పార్టీ పాలనలో సెస్ ఉంటే లాభాల్లో నడవాల్సింది పోయి అప్పుల్లో ఎందుకు మునిగిపోయింది? 450 కోట్ల అప్పులుండటానికి కారణమెవ్వరు? ప్రభుత్వ శాఖలే కరెంట్ బిల్లుల పేరిట రూ.160 కోట్ల బకాయి ఎందుకు చెల్లించడం లేదు? పవర్ లూం కరెంట్ సబ్సిడీ నిధులు రూ.40 కోట్లు ఎందుకు చెల్లించడం లేదు? మీ నిర్వాకంవల్ల సకాలంలో బిల్లులు కట్టకపోవడంవల్ల డిస్కంలు సర్ ఛార్జీ పేరిట సెస్ పై రూ.250 కోట్లు భారం పడ్డ మాట వాస్తవం కాదా?
సెస్ ను పూర్తిగా అవినీతిమయం చేశారు. సెస్ లో రూ.33 కోట్ల అవినీతి జరిగిందని క్రిష్ణయ్య కమిటీ నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు. కాంట్రాక్టర్ల కోసం, కొనుగోళ్ల పేరుతో కమీషన్ల కోసం సెస్ ను పూర్తిగా భ్రష్టు పట్టించింది టీఆర్ఎస్ కాదా? ఎంతో గొప్ప ఉన్నతాశయంతో సెస్ ను నెలకొల్పిన మహానుభావులు చెన్నమనేని రాజేశ్వరరావు, తంగళ్లపల్లి నర్సింగరావు ఆత్మలు.. కేసీఆర్ పాలనలో సెస్ దుస్థితిని చూసి ఘోషిస్తున్నయ్.
కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసి చంపుతారు… సెస్ పరిస్థితి కూడా అట్లనే ఉంది. సెస్ ను ఎలక్ట్రిసిటీ బోర్డులో కలపాలని కేసీఆర్ డిసైడ్ అయ్యిండు. అందుకే లాభాల్లో ఉన్న సెస్ ను అప్పుల పాల్జేసి దివాళా తీయించిండు. మళ్లీ పొరపాటున టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే సెస్ కు ఇవే ఆఖరు ఎన్నికలు కాబోతున్నయ్. సెస్ ను ఎలక్ట్రిసిటీ బోర్డులో కలిపేయడం ఖాయం.
కేంద్రం కరెంట్ లేని పేదలకు రూ.125 లకే కరెంట్ కనెక్షన్లు ఇస్తోంది. సెస్ పరిధిలో 5,200 మందికి కనెక్షన్లు ఇచ్చిన ఘనత కేంద్రానిదే.కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో రాబోయేది బీజేపీయే. సెస్ కు సంబంధించి బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే సెస్ ను లాభాల బాటలో నడిపిస్తాం. వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన సేవలందిస్తాం. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే… సెస్ లో అవినీతికి పాల్పడిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జైలుకు పంపుతాం. అవినీతి సొమ్మును రికవరీ చేస్తాం. ఆ మహానుభావులు చెన్నమనేని రాజేశ్వరరావు, నర్సింగరావు ఆశయాలకు అనుగుణంగా సెస్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం చేసిన శివారు గ్రామాల ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది. అభివ్రుద్ధి పేరుతో భూములు లాక్కొని పరిహారం కూడా ఇవ్వని దుర్మార్గులు.
రూ.33 కోట్లు దోచుకున్న దొంగలను పక్కన పెట్టుకుని సెస్ ను నాశనం చేసిన టీఆర్ఎస్ నేతలను చూసి జనం థూ అని ఛీదరించుకుంటున్నరు. అయినా ఆ పార్టీ నేతలకు సిగ్గు రావడం లేదు.ఇవన్నీ ప్రశ్నిస్తుంటే… ట్విట్టర్ టిల్లు చెప్పుతో కొడతానంటూ పిచ్చిపిచ్చిగా వాగుతున్నడు. డ్రగ్స్ వాడి వాడి మానేసిండు కదా…. ‘‘విత్ డ్రాయల్ సిమ్టమ్స్’’ బాధపడుతున్నడు. ఏదైనా వ్యసనముండి అకస్మాత్తుగా మానేస్తే కొద్దిరోజులు పిచ్చిపచ్చిగా ఉంటుంది కదా… ట్విట్టర్ టిల్లు కూడా అట్లనే ఉన్నడు.. పచ్చిపిచ్చిగా వాగుతున్నడు.
ప్రజా ధనాన్ని కేసీఆర్ అడుగడుగునా దుర్వినియోగం చేస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతున్నడు. ఆ పార్టీ నేతలు భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలతో ప్రజలను ఇబ్బంది పడుతున్నరు.అందుకే సెస్ ఎన్నికల్లో ఓటర్లు టీఆర్ఎస్ ను ఓడించేందుకు సిద్ధమైనరు. బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించడానికి రడీగా ఉన్నరు.
అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. కానీ కొందరు అధికారులు టీఆర్ఎస్ కు చెంచాగిరి చేస్తున్నరు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నడు. మెప్పుకోసం కేసీఆర్ కాళ్లు మొక్కుతున్నడు.కేసీఆర్ ఏమో కరోనా కు పారాసెట్మాల్ వేసుకోమంటడు… ఇంకో అధికారి (హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును ఉద్దేశించి) ఏమో… క్రైస్తవం వల్లే కరోనా తగ్గిందంటడు. క్రైస్తవం వల్లే భారత్ అభివ్రుద్ధి చెందిందంటడు… సిగ్గుండాలే…ఈ దేశంలో ఎందుకున్నవ్? ఈ దేశం విడిచి పో… ఈ దేశంలో పుట్టి పరాయి పాట పాడతవా? ప్రభుత్వ అధికారిగా ఉంటూ మత ప్రచారం చేస్తవా? బాగా బరితెగించినరు. ఇలాంటి అధికారులు రోడ్లమీద యాడ కన్పించినా ఉరికించి ఉరికించి కొట్టండి.సెస్ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులకు ఓటేసి ఘన విజయం చేకూర్చాలని సెస్ ఓటర్లను అభ్యర్థిస్తున్నా.