తెలంగాణ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోంది.. అందుకు మహబూబాబాద్ ఘటన ఓ చక్కని ఉదాహరణ. హిందూ దేవి దేవతలను దూషించిన బైరి నరేష్, రేంజర్ల రాజేష్ లకు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారికే తెలంగాణ పోలీసులు అండగా నిలుస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రేంజర్ల రాజేష్, బైరి నరేష్ లకు మద్దతుగా నిలిచిన వారిపై చర్యలు తీసుకోవాలని బజరంగ్ దళ్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా.. బజరంగ్ దళ్ కార్యకర్తలనే టార్గెట్ చేసి పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఎస్పీ ఎదుటే దాడి చేస్తున్నారు. ఇదే విషయమై డీజీపీ గారిని కూడా కలవడం జరిగింది. అయినా నిన్న మల్లి విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలపై పోలీసులు దాడి చేసి కార్యకర్త కాలు విరగొట్టారు.
భాగ్యనగరంలోని మాదన్నపేటలో కూడా హిందూ ద్రోహులకు మద్దతుగా నిలిచిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో VHP ఫిర్యాదు చేసింది. కానీ వారిపై ఇంకా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. మహబూబాబాద్ లో బజరంగ్ దళ్ కార్యకర్తలపై దాడి చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు ఘోరమైన విపత్కర పరిస్థితిలో నెలకొన్నాయి. హిందువులు బతికే పరిస్థితి కనిపించడం లేదు. సరస్వతి మాతను దూషించిన రేంజర్ల రాజేష్ ను ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడం.. హిందూ వ్యతిరేక పాలనకు నిదర్శనం.! రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాయడం తగదు అని హిందూ సమాజం ఆరోపిస్తోంది.
పగుడాకుల బాలస్వామి
ప్రచార ప్రముఖ్
విశ్వహిందూ పరిషత్
తెలంగాణ రాష్ట్రం
9912975753
9182674010