– కోటంరెడ్డికి మాజీ ఎమ్మెల్యే అనిల్‌యాదవ్ సవాల్
ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫోన్ టాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి, సిటీ ఎమ్మెల్యే అనిల్
నెల్లూరు ; ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫోన్ టాపింగ్ జరగలేదు.ఎమ్మెల్యే కోటం రెడ్డికి సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్.ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసి స్పీకర్ దగ్గర వెళ్తాం.ఫోన్ టాపింగ్ జరిగిందని నువ్వు నిరూపిస్తే నేను రాజీనామాను యాక్సెప్ట్ చేస్తా.
ఫోన్ టాపింగ్ జరగలేదని నేను నిరూపిస్తే నువ్వు రాజీనామా యాక్సెప్ట్ చేస్తావా?24 గంటలు సమయం ఇస్తున్నా.. మీరు ఎప్పుడైనా రండి. నేను రెడీ.తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకే జగన్మోహన్ రెడ్డి పై శ్రీధర్ రెడ్డి ఇలాంటి విమర్శలు చేస్తున్నాడు.జనవరి 27న ఎమ్మెల్యే కోటంరెడ్డికి టిడిపి టికెట్ కన్ఫామ్ అయ్యింది.పార్టీని వీడే సందర్భం వచ్చింది కాబట్టి ఆయన ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని తీసుకొచ్చాడు.
ఆనం రామనారాయణ రెడ్డి చచ్చిన పాము.. ఆయన కేంది ప్రాణాహాని.శ్రీధర్ రెడ్డి ఫోన్ టాపింగ్ జరిగిందని కేవలం 16 సెకండ్ల ఆడియో మాత్రమే రిలీజ్ చేశాడు.మీడియాకు ఫోన్లో చూపించిన ఆడియో 51 సెకండ్ లు ఉంది.శ్రీధర్ రెడ్డికి దమ్ముంటే 51 సెకండ్ల వీడియో బయట పెట్టాలి.51 వీడియో బయట పెడితే శ్రీధర్ రెడ్డి బాగోతం మొత్తం బయటపడుతుంది.