-మాటిచ్చిన మూడురోజుల్లో బండి అందజేసిన యువనేత
ప్రార్థించే పెదవులు కన్నా, సహాయంచేసే చేతులు మిన్న అంటారు పెద్దలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాటిచ్చాడంటే, నెరవేరుస్తాడంతే అనే ముద్రపడియేంతగా నిబద్ధతతో హామీలు నెరవేరుస్తున్నారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో యువగళం పాదయాత్ర సందర్భంగా నాగరాజు అనే వ్యక్తి లోకేష్‌కి కొబ్బరి బొండాం కొట్టి ఇచ్చారు. తనపై అభిమానం చూపించిన నాగరాజుకి ఒక చేయి ఇబ్బంది ఉందని గమనించిన లోకేష్, ఏమైనా సహాయం కావాలా అని అడిగారు. సైకిల్ పై కొబ్బరి బోండాలు అమ్మకం కష్టంగా ఉందని, ఓ బండి కావాలని కోరాడు. మాటిచ్చిన మూడు రోజుల్లో నాగరాజు కోరుకున్న బండి చెంతకు చేరింది. శాంతిపురం మండల టిడిపి నేతలు నాగరాజుకి నారా లోకేష్ పంపిన బండిని అందజేశారు.