Suryaa.co.in

Andhra Pradesh

కోటంరెడ్డి మా ఊపిరి.. ఆయనతోనే మా ప్రయాణం: నెల్లూరు మేయర్

వైసీపీ అధిష్ఠానంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యే కలకలం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆయనపై వైసీపీ మంత్రులు కూడా అదే స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనపై ఇప్పటికే ఒక కిడ్నాప్ కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు కోటంరెడ్డికి నెల్లూరు మేయర్ పొట్లురి స్రవంతి తన పూర్తి మద్దతును ప్రకటించారు. తమ జెండా, తమ ఊపిరి కోటంరెడ్డేనని ఆమె తెలిపారు. కార్పొరేటర్ గా, మేయర్ గా తాను ఎదగడానికి కోటంరెడ్డే కారణమని చెప్పారు. ఆయన కోసం అవసరమైతే మేయర్ పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని అన్నారు. ఆయన ఎటుంటే తాను కూడా అటే నడుస్తానని స్పష్టం చేశారు. శ్రీధర్ అన్నా… నీతోనే నా రాజకీయ ప్రయాణం అని అన్నారు. ఆమె మాటలకు శ్రీధర్ రెడ్డి చలించిపోయారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయడం లేదని కోటంరెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆయన టీడీపీలోకి వెళ్లే అవకాశాలున్నాయి.

LEAVE A RESPONSE