టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ లో చేరిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ముని రామయ్య
హైదరాబాద్:- శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత మునిరామయ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ లో చేరారు. ఆయనతో పాటు అయన కుమారుడు ప్రవీణ్ కూడా టీడీపీ జండా కప్పుకున్నారు. ముని రామయ్య శ్రీకాళహస్తి ఎమ్మేల్యే గా, తుడా చైర్మన్ గా పని చేశారు. ప్రవీణ్ వైసీపీ స్టేట్ యూత్ జనరల్ సెక్రెటరీ గా ఉన్నారు. వీరితో పాటు వైసీపీ కి చెందిన మరో 22 మంది నేతలు కూడా టీడీపీలో చేరారు. టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంఛార్జి బొజ్జల సుధీర్ నేతృత్వంలో ఈ చేరికలు జరిగాయి. వైసిపి ప్రభుత్వ విధ్వంస పాలనను నిరసిస్తూ ఆ పార్టీ వీడినట్లు నేతలు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం తోనే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుంది అని మాజీ ఎంఎల్ఏ మునిరమయ్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు.