– చిత్తూరులో ప్రభుత్వ యూనివర్శిటీకి కృషి చేస్తాం
-జగన్ పాలనలో గంజాయి, డ్రగ్స్ లో ఏపీ నంబర్ వన్
-దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలో
– చిత్తూరు నియోజకవర్గం, కృష్ణాపురం గ్రామంలో యువతతో ముఖాముఖిలో లోకేష్
టీడీపీ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థలో కేజీ టు పీజీ సిలబస్ మారుస్తాం. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగావకాశాలు లభించేలా నైపుణ్యతతో కూడిన విద్యను ప్రవేశపెడతాం.మాతృభాషలో విద్యావ్యవస్థ కొనసాగుతుంది. ఇంగ్లీషు మీడియం కూడా ఉంటుంది.ఇవన్నీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే ఇవన్నీ పూర్తిచేస్తాం. చదువుపై అవగాహన లేనివాడు సీఎం కావడం వల్ల రాష్ట్ర విద్యావ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుంది.
పేదవాళ్లు పీజీ చదవకూడదనే దురుద్దేశంతో ప్రభుత్వం జీఓ 77తెచ్చింది. దీనివల్ల ఫీజు రీయింబర్స్ మెంట్ నిలిపేశారు. ఫలితంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు డిగ్రీతోనే ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని పునరుద్ధరిస్తాం. వైసిపి ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాను కూడా దుర్వినియోగం చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగిలే చూస్తాం.చంద్రబాబుతో మాట్లాడి చిత్తూరులో ప్రభుత్వ యూనివర్శిటీకి కృషి చేస్తాం. కొత్త కంపెనీలను కూడా రప్పించి యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి లేకుండా చేస్తాం. చంద్రబాబు సీఎం అయ్యాక సచివాలయాల ఉద్యోగాలు తీసేస్తారని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రక్షాళనచేసి సచివాలయాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తాం. ఉద్యోగులెవరూ భయపడాల్సిన అవసరం లేదు. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని ఏ పరిశ్రమకూ ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. పరిశ్రమలన్నీ విద్యుత్ ఛార్జీలు,పన్నులకు భయపడి పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయి. వీటికి తోడు జగన్ కమీషన్లు కట్టలేక కంపెనీలన్నీ ఏపీని వదిలేస్తున్నాయి.
జగన్ పాలనలో గంజాయి, డ్రగ్స్ లో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉంది. దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా అది ఏపీదే అవుతోంది. ఈ విషయాన్ని కర్ణాటక పోలీస్ డీఎస్పీనే చెప్పారు.టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ నుండి విముక్తి చేస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిస్తాం. కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం. విరివిగా లోన్లు ఇప్పిస్తాం. యువతను పారిశ్రామికవేత్తలుగా చేసేందుకు చంద్రబాబు వద్ద అనేక ప్రణాళికలు ఉన్నాయి.భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలో ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక తప్పని సరిగా పన్నులు, నిత్యావసరాల ధరల రేట్లు కూడా తగ్గిస్తాం.
వైసీపీ అధికారంలోకి వచ్చాక రైతులకు ప్రోత్సాహకాలు లేవు. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు లేవు. వ్యవసాయ రంగంలో ముందుకు వెళ్లాలనుకున్న యువతను టీడీపీ అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చరిత్రలో ఇదివరకెన్నడూ లేనివిధంగా 25వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశాం. గ్రామాలన్నింటిలో ఎల్.ఈ.డీ లైట్లు వేశాం. చంద్రబాబుకు అధికారం ఉన్నా, లేకున్నా పక్క రాష్ట్రాల్లో కూడా అత్యంత గౌరవం దక్కుతోంది. దానికి గల కారణం పారదర్శకత పాలన. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అన్ని రంగాల్లో ఏపీ ముందంజలో ఉంటుంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక వినూత్నవిధానాలను పెద్దఎత్తున ప్రపంచానికి పరిచయం చేస్తాం.