కంటి వెలుగు పథకం దేశంలోనే గొప్ప కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనంలోని లాంజ్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు ప్రత్యేక శిభిరాన్ని ప్రారంభించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.

ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ..కంటి వెలుగు పథకం దేశంలోనే గొప్ప కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలో కంటివేలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.కంటి వెలుగు పథకం పేదలకు ఎంతో ఉపయోగకరం. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా మన కంటి వెలుగు పథకాన్ని ఆయా రాష్ట్రాలలో అమలు చేయాలని ఆలోచిస్తున్నారు.కంటి వెలుగు పథకం అనేది పేద ప్రజలకు ఒక వరం లాంటిదిగౌరవ ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీలు అందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని కంటి పరీక్షలు చేయించుకోవాలి.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , వైద్య,ఆరోగ్య మరియు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు , పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు , లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అధికారులు, అసెంబ్లీ సిబ్బంది.<a href=”https://ibb.co/FwPN9ky”><img src=”” alt=”kanti” border=”0″></a>