Suryaa.co.in

Andhra Pradesh

బీసీలపై ఈ ముఖ్యమంత్రికి ప్రేముంటే రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారు?

– వైస్ ఛాన్సలర్, సలహాదారులుగా బీసీలు పనికిరారా.?
– జగన్ ఇంట్లో.. సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మాత్రమే ఉంటారు.
– కానీ బీసీలు మాత్రం జగన్ రెడ్డి ఇంటి బయట ఉంటారు
– రాయలసీమకు జగన్ ఏం చేశాడు.? హంద్రీనీవా పనులు ఆపేశాడు.
– చిత్తూరు నియోజకవర్గం, దిగువమాసనపల్లిలో బీసీలతో ముఖాముఖిలో నారా లోకేష్

బీసీలకు రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది 1983లోనే. రాజకీయంగా ఎదిగిన ఏ బీసీ నాయకున్ని చూసినా దానికి కారణం ఎన్టీఆర్. చంద్రబాబు లక్ష్యం ఒక్కటే.. బలహీన వర్గాల్లో పేదరికం ఉండకూడదు. కుల వృత్తులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఐదేళ్లలో రూ.29 వేల కోట్లు సబ్ ప్లాన్ ద్వారా బీసీలకు ఖర్చు చేశాం. మొదటి విడత ఆదరణ పథకం కింద రూ.1000 కోట్లు ఖర్చు చేశాం. ఆదరణ-2 కింద పనిముట్లు అందించాలని కొనుగోలు చేశాం. కానీ ఎన్నికలు కోడ్ రావడంతో అన్నీ నిలిచిపోయాయి. కానీ ఈ ప్రభుత్వం వాటిని పంపిణీ చేయకుండా పాడుబెడుతోంది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లుగా..16 యూనివర్సిటీల్లో 9 మందికి వైస్ ఛాన్స్ లర్లుగా బీసీలకు ఇచ్చాం. ఆర్థిక శాఖ, టీటీడీ ఛైర్మన్, ఏపీ ఐఐసీ చైర్మన్ పదవులు కూడా బీసీలకే ఇచ్చాం.బలహీన వర్గాల విద్యార్థులు విదేశాల్లో చదవాలన్న లక్ష్యంతో విదేశీ విద్య పథకాన్ని ప్రవేశపెట్టాం. దాన్ని కూడా జగన్ రెడ్డి చంపేశాడు. విదేశాలకు వెళ్లి మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులకు ఈ ప్రభుత్వం డబ్బులివ్వకపోవడంతో లక్షల్లో అప్పు చేసి చదువుకునే పరిస్థితి.

జగన్ సొంత బిడ్డలు విదేశాల్లో చదవొచ్చా..బలమీన వర్గాల వారి పిల్లలు చదవకూడదా.? సీమ జిల్లాల నుండి వలసలు ఎక్కువయ్యాయి. డ్రిప్, ఇతర వ్యవసాయ పరికరాలు ఇవ్వడం లేదు. బీసీ సబ్ ప్లాన్ తెచ్చి, నిధులు కేటాయించింది చంద్రబాబే.అధికారంలోకి రాగానే కార్పోరేషన్లకు నిధులు కేటాయించి, బీసీలను ఆదుకుంటాం. బిసిలను రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది.ఎన్టీఆర్ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దాన్ని చంద్రబాబు 34 శాతానికి పెంచారు.కానీ జగన్ బిసి రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారు. దీంతో 16,500 మంది స్థానిక ఎన్నికల్లో పదవులు కోల్పోయారు. బీసీలపై ఈ ముఖ్యమంత్రికి ప్రేముంటే రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారు.?

టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు మళ్లీ 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం.బీసీ భవనాలకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాం. కొన్ని 90 శాతం పనులు పూర్తయ్యాయి. కానీ ఈ ప్రభుత్వం పనులు నిలిపేసి వాటిని తాగుబోతులపాలు చేసింది.అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే బీసీ భవనాలు పూర్తి చేస్తాం. పెన్షన్లు కూడా ఈ ప్రభుత్వం బీసీ సంక్షేమంలో చూపించారు. బీసీ విద్యార్థులు ఉద్యోగాలు పొందడానికి కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాం.నాయీ బ్రాహ్మణ, రజక వంటి వాళ్లకు ఎంత మంది ఉన్నా చేయూత ఇస్తామన్నారు. కానీ వాళ్లు ఇచ్చేది కేవలం 6 శాతం మందికే. విద్యుత్ బిల్లులు ఎక్కువ చూపి పథకాలు కోసేస్తున్నారు. సలహాదారుల్లో 71 శాతం మంది సొంత సామాజిక వర్గం వారే. వైస్ ఛాన్సలర్, సలహాదారులగా బీసీలు పనికిరారా.?కార్పొరేషన్ చైర్మన్ల పరిస్థితి వింతగా ఉంది. వాళ్లు ఆఫీసు ఎతుక్కునే పరిస్థితి ఉంది.56 కార్పొరేషన్ల ద్వారా రాష్ట్రంలో ఒక్కరికైనా లోన్ వచ్చిందా.? సలహాదారులకు 3 లక్షల జీతం..కేబినెట్ హోదా ఇస్తున్నారు. కానీ కార్పొరేషన్ చైర్మన్లకు ఆ అవకాశం లేదు.వాల్మీకీ, రజకులను ఎస్టీల్లో చేరుస్తాని హామీ ఇచ్చి జగన్ మోసం చేశాడు. కేంద్రం ఈ మధ్య 28 కులాలను ఎస్టీల్లో చేర్చింది. మరి ఈ ప్రభుత్వం ఎందుకు కృషి చేయడం లేదు.?

జగన్ ఇంట్లో.. సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మాత్రమే ఉంటారు. కానీ బీసీలు మాత్రం జగన్ రెడ్డి ఇంటి బయట ఉంటారు. ఈ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని ఆ నలుగురు రెడ్ల పక్కన కూర్చోనివ్వరు. వారి పక్కన చేతులు కట్టుకుని తిరుపతిలో నిల్చున్నారు.ఇదేనా సామాజిక న్యాయం.? పదవులిస్తే సరిపోదు..గౌరవం ఇవ్వాలి. కొందరు బీసీ-ఏ నుండి ఓబీసీ చేర్చాలని అడుగుతున్నారు.. ఆ అంశంపై ఆలోచిస్తాం. ఓ స్వర్ణకారుడు బంగారాన్ని దొంగతనం చేశారని పోలీసులు అతన్ని వైజాగ్ పట్టుకుని చంపి బంగారాన్ని తీసుకున్నారు.శవాన్ని రాజమండ్రిలో దహనం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. పాడిరైతుల గురించి మాట్లాడితే పేటియం బ్యాచ్ ట్రోలింగ్ చేస్తోంది.పాడి రైతులకు కావాల్సిన పశుగ్రాసం, సైలేజ్గతంలో సబ్సీడీలో ఇచ్చాం.గోశాల పనులు కూడా ప్రారంభించాం..కానీ ఈ ప్రభుత్వం రద్దు చేసింది. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసందానం చేయాల్సిన అవసరం ఉంది.యాదవ సోదరులు అడిగిన గొర్రెల పంపిణీ మంచి ఆలోచన. ఈ సారి యుద్ధప్రాదికను పంపిణీ చేసి వాటికి బీమా కూడా కల్పిస్తాం.ఆదరణ పథకం మళ్లీ తీసుకొస్తాం. బీసీలకు ఎన్నిపనిముట్లైనా ఇచ్చే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుంది.

రాయలసీమకు జగన్ ఏం చేశాడు.? హంద్రీనీవా పనులు ఆపేశాడు. పులివెందులకు బస్టాండ్ కూడా ఇంకా పూర్తికాలేదు.యువతు మటన్ షాపులు, చికెన్ షాపులు ఇస్తానని అన్నారు. ఎంటెక్, బీటెక్, ఉన్నత చదువుల చదివింది వైన్ షాపుల్లో పనిచేయడానికా.? చంద్రబాబు చేసిన అభివృద్ధిని రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించారు. కానీ ఏ సీఎం చేయని విధంగా రాష్ట్రాన్ని జగన్ చంపేశాడు.ఈ జిల్లాలో అతిపెద్ద పరిశ్రమ అమర్ రాజాను పక్కరాష్ట్రానికి తరిమాడు. ముఖేష్ అంబానీని కలసి బతిమాలి రిలయన్స్ తీసుకొస్తే అది కూడా తరిమేశాడు పక్క రాష్ట్రాల నుండి సీఎంలు వెళ్లి పరిశ్రమలు ఆహ్వానిస్తుంటే… మన రాష్ట్ర మంత్రి మాత్రం చలేస్తుందని వెళ్లలేదంటారు. ఇలాగైతే మన పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..?

LEAVE A RESPONSE