Suryaa.co.in

Andhra Pradesh

సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోండి: ఏపీ సీఎస్ కు కేంద్ర హోంశాఖ లేఖ

-సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయంటూ హైకోర్టు లాయర్, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు
– కస్టోడియల్ టార్చర్ కు పాల్పడుతున్నారన్న గూడపాటి
– గత అక్టోబర్ లో కేంద్ర హోంశాఖకు లేఖ

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖకు లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. పలువురిపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడుతున్నారని తన ఫిర్యాదులో కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన తెలిపారు. అధికార వైసీపీ నేతల ఆదేశాల మేరకు ఆయన ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన గత అక్టోబర్ లో కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఈ ఫిర్యాదుపై కేంద్ర హోంశాఖ స్పందించింది. సునీల్ కుమార్ పై తగిన చర్యలు తీసుకోవాలని సీఎన్ ను ఆదేశించింది.
Home-Sec-Lr-to-AP-CS-03-02-2023

LEAVE A RESPONSE