-2024 ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లు గెలవడం ఖాయం
-పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ వెల్లడి
-కాంగ్రెస్ సమీక్ష సమావేశానికి తరలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
-తిరుపతి లో కాంగ్రెస్ మహా పాదయాత్ర… అంబేద్కర్ భవన్ లో సభ
ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఏమన్నారంటే… కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్వల భవిష్యత్తు ఉంది. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రాష్ట్రంలో లిక్కర్, ఎర్రచందనం, ఇసుక, మైన్స్, భూ మాఫియా పాలన సాగిస్తోంది. వైసీపీని ప్రజలు నమ్మడం లేదు.కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నాము.
కాంగ్రెస్ పార్టీ ప్రాణ త్యాగాల నుంచి వచ్చిన పార్టీ.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించబోతోంది. కాంగ్రెస్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్ లాంటిది. ఎంతోమంది నాయకులు, కార్యకర్తలను తయారు చేసిన చరిత్ర కాంగ్రెస్ కి ఉన్నది.ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ నుంచి తయారై, నాయకులుగా ఎదిగారు.రాష్ట్రంలో ఉద్యోగస్తులకు భద్రత లేదు. సమస్యలు పరిష్కారం కావడం లేదు. అందుకే వారు గవర్నర్ ను కలిశారు.
కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ ఏమన్నారంటే… నాలుగున్నర నెలలు కొన్ని వందల గ్రామాలు తిరిగాను. వేల మందిని కలిశాను.శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు కాంగ్రెస్ గురించి అన్వేషణ చేశాను.ఊరూరు తిరిగాను, పల్లె పల్లెలో పేదల గుండెను కదిలించాను. పేదలు, దళితుల హృదయంలో కాంగ్రెస్ బతికే ఉన్నది. కాంగ్రెస్ రావాలని, కావాలని పేదల కోరుకుంటున్నారు. రాష్ట్రంలో పేదల పరిస్థితి అతి దారుణంగా ఉంది. బతకడం చాలా కష్టంగా ఉంది.తినడానికి తిండి లేదు మంచినీళ్లు తాగి, గంజి తాగి బతుకుతున్నారు.అన్నం లేక, ఆకలితో, ఆత్మ అభిమానంతో జీవిస్తున్నారు.దారిద్ర్యం ఎక్కువగా ఉంది. పేదరికం వల్ల పెళ్లిళ్లు కూడా చేసుకోవడం లేదు.
భారతదేశానికి రెండో స్వాతంత్ర్యం అవసరం. కోట్ల మంది కూటికి లేకుండా ఉన్నారు.శ్రీశైలం, శ్రీహరికోట నాగార్జునసాగర్ ప్రాజెక్ట్, జాతీయ రహదారులు ఇలా ఎన్నో సాధించింది. ఎనిమిదేళ్ల పాలనలో బిజెపి ఏమి సాధించింది? ప్రజా ఆస్తులను ప్రైవేటీకరణ చేయడం తప్ప. 20 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ లోకి రాబోతున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏపీకి ఏమి చేశారు?మళ్లీ అధికారం కొరకు చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నారు.100 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయం. ఇది దైవ నిర్ణయం. ప్రజల్లో వచ్చిన మార్పు.వచ్చే ఎన్నికల్లో 20 మంది మంత్రులు ఓడిపోవడం సహా, వైసిపి ప్రభుత్వం కనుమరుగవడం ఖాయం.
టీచర్లు, ఉద్యోగస్తులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు సంతోషంగా లేరు.సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు విలువ లేదు.నితీష్ కుమార్ స్టేట్మెంట్ వాస్తవం. 100 సీట్లకు బిజెపి పరిమితమవుతుంది. బిజెపిని ఓడగొట్టేందుకు అందరం సమిష్టిగా పని చేయాలి. ఈ సమావేశంలో ఏఐసిసి కార్యదర్శి మేయప్పన్, పిసిసి ఉపాధ్యక్షులు జంగా గౌతమ్ లు ప్రసంగించారు. పిసిసి ఉపాధ్యక్షుడు రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ లీగల్ సేల్ తిరుపతి జిల్లా అధ్యక్షులు రవి, పంటా శ్రీనివాసులు రెడ్డి, పూల చంద్రశేఖర్, తేజోవతి, శాంతి యాదవ్, పూతలపట్టు ప్రభాకర్, యార్లపల్లి గోపి గౌడ్, రాంభూపాల్ రెడ్డి, ప్రమీలమ్మ పాల్గొన్నారు.