Suryaa.co.in

Telangana

అర్చనకు మంత్రి సత్యవతి అభినందన

ఏడు గంటల పాటు వరుసగా జాతీయ గీతం పాడి ప్రపంచ రికార్డు సృష్టించిన పండుగ అర్చనను మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. జనగణమన జాతీయ గీతాన్ని 75 సార్లు వరుసగా ఏడు గంటల పాటు ఆలపించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో డా.అర్చన పండుగ సాధించిన ఘన విజయాలను గుర్తించి జాతీయ పత్రిక “తారే జమీన్ పర్” సంపాదకులు రూపొందించిన ఫిబ్రవరి సంచికను రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ శుక్రవారం రోజు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో తన కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ అర్చన జాతీయ గీతాన్ని ఆలపించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకోని దేశం గర్వించేలా చేసిందని మంత్రి కొనియాడారు. జాతీయతా భావాన్ని పెంపొందించడంతోపాటు, భారత జాతీయ గీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేసి అర్చన రికార్డు సాధించిందని మంత్రి అన్నారు.

LEAVE A RESPONSE