Suryaa.co.in

Features

గుడిపూడి జంగములు అనగా..

రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి వారికి ఊడిగం చేస్తున్న నేటి మన కుల సంఘాల నాయకులు, వారి సంఘ దుకాణాల యొక్క పరిస్థితి మక్కీకి మక్కీగా… ఇదే నిజం,వాస్తవం,యధార్థం.

జై జంగమ దేవర.. జై బ్రాహ్మణ.. జై ఆర్య వైశ్య.. జై కాపు.. జై కమ్మ.. జై రెడ్డి.. జై క్షత్రియ.. జై వెలమ.. జై యాదవ.. జై గౌడ.. జై వడ్డెర.. జై రజక.. జై నాయిబ్రాహ్మణ.. జై పద్మశాలి.. జై ముదిరాజ్.. జైజై బిసి..etc జై మాల.. జై మాదిగ.. జై దళిత్.. జైజై ఎస్సి.. జై వాల్మీకి.. జై బంజారా.. జై రెల్లి.. జైజై ఎస్టీ etc… జైజై జంగమ
మనము సాధారణంగా ఎవరైనా అది చేస్తాను, ఇది చేస్తాను అంటూ ప్రగల్భాలు పలికి తరువాత వాటి వూసే ఎత్తని వాళ్ళను చూసి వీళ్ళు గుడిపూడి జంగముల (జంగాలు) వంటి వాళ్ళు అంటుంటారు. మరి ఈ గుడిపూడి జంగముల (జంగాలు) గురించి సవివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా…?

అనగనగా గుంటూరు జిల్లాలో గుడిపూడి అనే ఊరిలో ఎక్కువగా జంగమ దేవరలు నివాసముండేవారు. మీకు జంగమ దేవరలు అంటే ఎవరో తెలుసా. ఉదయాన్నే పెద్ద పెద్ద విభూతి రేఖలతో, ఒక చేతిలో గంట, వేరొక చేతిలో త్రిశూలం ధరించి అపర శివునిలా వేషం వేసి వస్తారే వారే ఈ జంగములు. వీరు ప్రతి ఊరూరూ తిరుగుతూ బిక్షాటన చేసి సంపాదించుకున్న తర్వాత సాయంత్రం వారి సొంత ఊరిలో ఒకచోట చేరి, ఆ రోజు వారు వెళ్ళిన ఊరిలో చూసిన వింతలు విశేషాల గురించి మాట్లాడుకుంటూ.. అక్కడ ఉన్న మంచి (ఉదాహరణకు మంచినీళ్ళ చెరువు, పెళ్ళి మండపాలు, ఆసుపత్రి, సమావేశ మందిరములు, భోజనాలు వంటివి) మన ఊరిలో కూడా అలానే ఏర్పాటు చేద్దాం అంటూ, ఎవరు ఏమేమిచేయాలో గట్టిగా తీర్మానించి, దానికి తగ్గ ప్రణాళిక కూడ అప్పటికప్పుడే తయారు చేసేసుకుంటారు. అవన్ని తప్పనిసరిగా రేపటికి రేపే జరిగిపోవాలనుకుంటారు.

కానీ తెల్లారేసరికి వీరు “ఎవరి జోలె వారు చంకన వేసుకుని బిక్షటనకు” మాత్రం వెళ్లిపోతారు. ప్రతిరోజూ రాత్రిపూట ఇవే మాటలు, ఇదే చర్చ, ఇదే తంతు. అంతే కాని వారు అనుకునే ఆ పనులు ఎప్పటికీ ఎన్నటికీ జరగవు. చేయలేరు కూడా… అదండీ “మన గుడిపూడి జంగాల” కుల సంఘ దుకాణాలు,వాటి నాయకుల కధ ఇది అసలు విషయం…అర్థం చేసుకుంటే అర్థం అయినంత…

అన్యాదా భావించవలదు…!!
మీకు తెలియని విషయాలు తెలుసుకోడానికే ఈ వాస్తవం…
యధార్థం,వాస్తవం ఎప్పుడూ చెదుగానే ఉండును…!!
ఊహల్లో విహరించడం మాని వాస్తవంలోనే బ్రతుకుదాం..!!

రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల కోసం, రాజకీయ పార్టీల్లో పదవులు పదవుల కోసం మన రాజకీయ పార్టీల వారికి నిత్యం ఊడిగం చేస్తున్న నేటి మన కుల సంఘాల నాయకులు, వారి సంఘ దుకాణాల యొక్క పరిస్థితి మక్కీకి మక్కీగా…ఇదే నిజం,వాస్తవం,యధార్థం..
ఈ కుల,జాతి సంఘాల నాయకుల వల్ల ఆయా కులాలకు ఎటువంటి ప్రయోజనం వుండదు. వారికి మటుకు ఈ స్వప్రయోజనాలు నిత్యం మన వల్లే జరుగును.
దయచేసి మీ మీ ప్రాంతాల్లో ఈ కుల దుకాణాల సంఘ నాయకుల్ని తొలుత చీదరించుకోండి, వీరి కుల మోసాల్ని ప్రచారం విస్తృతంగా చేయండి. వీరిని బహిరంగంగా అవమానించండి, సభల్లో,సమావేశాల్లో వెంటబడి తరిమి తరిమి కొట్టండి. వీరి బారిన ఆయా కులాల్లో అమాయకులు, ధనవంతులు,సహాయం చేసేవారు మోసానికి గురికాకుండా స్వీయ చైతన్యం తెచ్చుకోవాల్సిన బాధ్యత మనదే. కధ కంచికి మనం మన ఇంటికి…!!

– శివేశ్రీ
కుల చైతన్య వేదిక

LEAVE A RESPONSE