తన జన్మదినం సందర్భంగా కాచిగూడ ప్రాంతంలోని గోల్నాక పరిధిలో ఉన్న అనాధాశ్రమంలో హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మొక్కలు నాటారు. దాదాపు 500 మంది అనాధ పిల్లలు ఉన్న’ అంజుమన్ ఖాదిమిన్ ముస్లిమీన్ ‘ సంస్థ ప్రాంతంలో మొక్కలు నాటి అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హోంమంత్రి మహమ్మద్ అలీ తెలిపారు. పార్లమెంటు సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు తాను జన్మదినోత్సవ సందర్భంగా మొక్కలు నాటుతున్నానని తెలిపారు. అందరూ మొక్కలు నాటడం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హోం మంత్రి కోరారు.ఈ కార్యక్రమంలో TRS పార్టీ నాయకులు ఖాజా బద్రుద్దీన్, పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..