– ఇసుక సరఫరా చేసే కాంట్రాక్టర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడానికి జగన్ తీసుకొచ్చిన నయా ఇసుకపాలసీనే కారణం.
• జగన్ రెడ్డి తక్షణమే చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఇసుక విధానం అమలుచేయాలి.
• ఇసుక సరఫరా కాంట్రాక్టర్లకు డబ్బులివ్వాల్సిన ప్రభుత్వం, తమ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నెపాన్ని జేపీ సంస్థపై వేస్తోంది.
– టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ
“రాష్ట్రంలో గుత్తేదారులు ఆత్మహత్యలు చేసుకునేపరిస్థితి రావడం ఈ ప్రభుత్వానికి నిజంగా సిగ్గుచేటని, రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ కార్యాలయం పైకి ఎక్కి గుత్తేదారులు ఆత్మహత్యాయ త్నానికి పాల్పడటం ముఖ్యమంత్రి చేతగానితనానికి నిదర్శనమని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …
“రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దివాళాతీసింది అనిచెప్పడానికి కాంట్రాక్టర్ల ఆత్మహత్యాయత్నమే నిదర్శనం. ప్రభుత్వకార్యాలయంపై ఎక్కినవారంతా జగన్ జమానాలో ఇసుక రీచ్ ల నుంచి ఇసుకను సరఫరా చేసినవారు. గతంలో కూడా ఒకకాంట్రాక్టర్ అప్పులబాధ తట్టుకోలేక బం ధువుల ఇంట్లో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. కాంట్రాక్టర్ల వెతలపై ముఖ్యమంత్రి ఏం సమా ధానం చెబుతాడని ప్రశ్నిస్తున్నాం. కాంట్రాక్టర్లతో పాటు ప్రభుత్వఉద్యోగులు కూడా సకాలంలో జీతాలు అందక అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
వైసీపీప్రభుత్వ హయాం లో కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బకాయిలకోసం చిప్పలుపట్టుకొని ధర్నాలు చేసిన సంఘ టన రాష్ట్రచరిత్రలో ఒకమాయని మచ్చగా మిగిలిపోయింది. అంతజరిగినా కూడా ఈ ముఖ్య మంత్రికి, ప్రభుత్వానికి సిగ్గురాలేదు. జగన్ ప్రభుత్వంలో ప్రతిపనిలో కమీషన్లు ఎక్కువయ్యాయి. ముఖ్యమంత్రికి, మంత్రులు, ఎమ్మెల్యేలకు దక్కాల్సిన వాటాలు క్రమంతప్పకుండా ఇస్తేనే గుత్తేదారుల్ని, ప్రభుత్వం ఉపేక్షి స్తోంది. రాష్ట్రంలో ఇసుకదోపిడీ తారాస్థాయికి చేరింది. ప్రభుత్వం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఏర్పాటుచేసినా దోపిడీఆగలేదు. ఇసుకఅమ్మకాలతో ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రమే బాగుపడుతున్నారు. కాంట్రాక్టర్లు ఇసుకపై ఆధారపడి బతికేవారి పరి స్థితి మాత్రం చాలాచాలా దారుణంగా ఉంది. వైసీపీప్రభుత్వంపై ఇప్పటివరకు 1500కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. న్యాయస్థానాలు చెప్పినా గుత్తేదారులకు ప్రభుత్వం డబ్బులివ్వకపోవడంతో, వారుపదేపదే న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తున్నారు. కాంట్రాక్టర్లు తమకు డబ్బులివ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటుంటే, ఏపీ మినరల్ కార్పొరే షన్ సంస్థకు జేపీ సంస్థ బకాయిలు పడిందని అధికారులు చెబుతున్నారు. జేపీసంస్థను అధి కారులు ఎందుకు నిలదీసి, రావాల్సిన సొమ్ముని రాబట్టులేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాం. ఇసుక రీచ్ లనుంచి ఇసుక బయటకుపోకముందే ప్రభుత్వానికి డబ్బువస్తుంది. కానీ కాంట్రా క్టర్లకు డబ్బులుఇవ్వడానికి మాత్రం కుంటిసాకులు చెబుతోంది. జగన్ తీసుకొచ్చిన నూతన ఇసుకపాలసీ మొత్తం దోపిడీకోసం తీసుకొచ్చిందే. జగన్ తీసుకొచ్చిన నయాఇసుక పాలసీ, రాష్ట్రఅభివృద్ధికే విఘాతంగా మారింది. దాని ప్రభా వంతోనే రాష్ట్రంలోని ఇసుకసరఫరా కాంట్రాక్టర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం.
చంద్రబాబునాయుడు తీసుకొచ్చిన ఇసుకపాలసీ వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు మేలుజరిగింది . ఆ పాలసీతో తనకు డబ్బురాదనే జగన్ కొత్తపాలసీ పేరుతో ఇసుకు ప్రజలకు దొరక్కుండా చేశాడు. అధికారంలోకి రాగానే కొత్తఇసుకపాలసీ తీసుకొచ్చి భవనిర్మాణకార్మికుల్ని రోడ్డున పడేసి, నిర్మాణరంగాన్ని, దాని అనుబంధ విభాగాలు కోలుకోకుండా దెబ్బతీశాడు. రాష్ట్రచ త్రలో ఇసుకపై కన్నేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు. జగన్ రెడ్డి హాయాం లో రోడ్లకాంట్రాక్టర్లు కూడా పనులుచేయడానికి ముందుకురావడంలేదు. ప్రభుత్వం ఏ టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకురావడంలేదంటే అందుకు ప్రధానకారణం జగన్మోహన్ రెడ్డి అవినీతే. తనఅవినీతి, అక్రమార్జన తప్ప ముఖ్యమంత్రికి రాష్ట్రప్రయోజనాలు, వ్యవస్థలపనితీ రు పట్టడంలేదు. కాంట్రాక్టర్లు బకాయిలకోసం భవనాలపైకి ఎక్కి ఆత్మహత్యలకు పాల్పడే పరి స్థితి రావడానికి ముమ్మాటికీ ముఖ్యమంత్రే కారణం.
రాష్ట్రంలో జరిగే ఇసుకదోపిడీని అరికట్టి, ప్రజలకు, కాంట్రాక్టర్లకు న్యాయంచేయాలని, టీడీపీప్రభుత్వం అమలుచేసిన ఉచితఇసుక వి ధానాన్నే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి అవినీతి విధానాలే రాష్ట్ర అభివృద్ధికి విఘాతంగా మారాయి. రాష్ట్రంలో పనిలేక ఉపాధికరువై, ప్రజలువలసలు పోతుం టే, పరిశ్రమలు రాష్ట్రానిక గుడ్ బై చెబుతుంటే, ముఖ్యమంత్రి మాత్రం నిస్సిగ్గుగా విశాఖ గ్లోబల్ సమ్మిట్ పేరతో ఇప్పటికీ పారిశ్రామికవేత్తల్ని, నిరుద్యోగయువతను నమ్మించాలని చూస్తున్నాడు.” అని రఫీ తెలిపారు.