Suryaa.co.in

Andhra Pradesh

గిట్టని వారిని ముఖ్యమంత్రి తప్పుడు కేసులతో సాధిస్తున్నాడు

– సుబ్బారావు గుప్తా, దళితయువకుడు అజయ కుమార్ లపై తప్పుడు గంజాయికేసులు పెట్టి, వేధించడం జగన్ రెడ్డి రాచరికపోకడకు నిదర్శనం
• సుబ్బారావు గుప్తాపై గంజాయికేసు పెట్టినందుకు పోలీసులు సిగ్గుపడాలి
• సరైన పోలీస్ అధికారి విచారిస్తే, ఆకేసులో ఏ1 ముఖ్యమంత్రి అయితే, ఏ2 డీజీపీ అవుతాడు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

“రాష్ట్రంలో రాచరికపాలన సాగుతోందని, జగన్ రెడ్డి తననుతాను ఒకరాజులా భావిస్తూ, తానంటే గిట్టనివాళ్లను దారుణంగా హింసిస్తున్నారని, తప్పుడుకేసులతో వారిని జైళ్లకుపం పుతున్నాడని, ప్రజాస్వామ్యపాలనలో ఇలాంటివాటికి తావుఉండదని తెలిసికూడా ముఖ్య మంత్రి నియంతలా వ్యవహరించడం దురదృష్టకరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య అభిప్రాయపడ్డారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయాకార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …గంజాయి పండించేవారు.. సరఫరాదారులు, విక్రయదారుల్ని కఠినంగా శిక్షించాల్సిన ముఖ్యమంత్రి, దాన్నే తన కక్షసాధింపులకు సాధనంగా వాడుకోవడం సిగ్గుచేటు. సుబ్బారావుగుప్తాపై పెట్టిన దొంగగంజాయికేసు భవిష్యత్ లో ముఖ్యమంత్రి మెడకే ఉరితాడు అవుతుంది.
“ఒంగోలుకు చెందిన సుబ్బారావుగుప్తా గతంలో ముఖ్యమంత్రి తీరుని, వైసీపీప్రభుత్వ చర్యల ను ప్రశ్నించాడన్న అక్కసుతో అతనిపై బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. సుబ్బారావు గుప్తాను బాలినేని అనుచరులు చావబాదారు. ఆఘటన జరిగిన నాటినుంచీ సుబ్బారావుగుప్తాని జగన్మోహన్ రెడ్డి వెంటాడుతూనే ఉన్నాడు. దొంగకేసులు పెట్టడంలో నిష్ణాతులైన రాష్ట్రపోలీసులు నిన్న సుబ్బారావుగుప్తాపై ఒంగోలులో గంజాయికేసు పెట్టారు.

అతనివద్ద గంజాయిదొరికిందని అకారణంగా అరెస్ట్ చేశారు. సుబ్బారావుగుప్తా గంజాయి అమ్ముతున్నాడని చెప్పడానికి నిజంగా పోలీసులకు బుద్ధుందా? సుబ్బారావుగుప్తా సామాజికవర్గంలో ఎవరూ అలాగంజాయి అమ్మురు..అలాంటి పనిచేయడానికి వారికి మనసొప్పదు. కానీ పోలీసులు అతనిపై గంజాయికేసు పెట్టి.. బెయిల్ రాకుండా ఇరికించేశా రు. సుబ్బారావు గుప్తాపై పెట్టిన గంజాయికేసులో ఏ1 జగన్మోహన్ రెడ్డి అయితే, ఏ2 డీజీపీ అవుతాడు. సుబ్బారావు గుప్తాపై పెట్టిన దొంగగంజాయికేసు భవిష్యత్ లో జగన్ మెడకే ఉరితాడుగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. అజయ్ కుమార్ అనే దళితయు వకుడు గతంలో వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసేవాడు.. ఎందుకో అతనికి నచ్చక బయటకువచ్చేశాడు. అతను ఒకసందర్భంలో రాష్ట్రంలో చంద్రబాబుప్రభుత్వమే అధికారం లోకి వస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే, దానికి పోలీసులు అతనిపైకూడా తప్పుడు గంజాయి కేసుపెట్టారు. ఇవన్నీచూశాక, రాష్ట్రప్రభుత్వ మద్ధతుతో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పండించే గంజాయి ముఖ్యమంత్రి వ్యతిరేకులపై దొంగకేసులు పెట్టడానికి పోలీసు లకు బాగా ఉపయోగపడుతోంది అని చెప్పకతప్పదు. కుప్పంలో కూడా ఒకమహిళ ఇంట్లో పోలీసులు గంజాయి పెట్టడానికివెళ్లారు.. అక్కడివారు వెంటపడేసరికి పారిపోయారు. ఇవన్నీ చూస్తుంటే ముఖ్యమంత్రికి సిగ్గుగాలేదా అనిప్రశ్నిస్తున్నాం. గంజాయి పండించేవారిని, సరఫ రా, విక్రయాలుచేసేవారిని పట్టుకొని శిక్షించలేని ముఖ్యమంత్రి, పోలీస్ యంత్రాంగం ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు.

తానంటే గిట్టనివారు ఎవరైనాసరే…ముఖ్యమంత్రి తప్పడు కేసులతో సాధిస్తున్నాడు
తానంటే గిట్టనివారిపై ముఖ్యమంత్రి పోలీసులతో దొంగకేసులు పెట్టించడం సరైందికాదు. పోలీ సులు వ్యవహరిస్తున్నతీరు కూడా సమంజసంకాదు. గంజాయికేసు ఎన్.డీ.పీ.ఎస్ యాక్ట్ కిందకు వస్తుంది. దానిలో రాష్ట్రపోలీసుల జోక్యం సరైనవిధానంకాదు. ముఖ్యమంత్రి, పోలీసు ల తీరుచూశాక ప్రజలుకూడా చాలాజాగ్రత్తగా ఉండాలి. ప్రతిపక్షనేతలు పవన్ కల్యాణ్, సీపీఐ రామకృష్ణలాంటి వారుకూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే ఈ పోలీసులు వారి వాహ నాల్లో కూడా గంజాయిపెడతారు. జగన్ దెబ్బకు సొంతపార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజే రాష్ట్రా నికి రావడానికి భయపడుతున్నాడు. అతన్ని పోలీసులు గతంలో తప్పడుకేసులో అరెస్ట్ చే సి విరగ్గొట్టారు. సొంతపార్టీ ఎంపీకి పట్టినగతే.. ముఖ్యమంత్రి రాచరికవ్యవస్థకు నిదర్శనం. నెల్లూరు వైసీపీఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రిని వ్యతిరేకించాడని అత నిపై కూడా తప్పుడుకేసులుపెట్టారు. అతన్ని కూడా ఏదో ఒక రోజు ఈపోలీసులు తప్పుడు కేసులుపెట్టి అరెస్ట్ చేయడంఖాయం. ప్రభుత్వతప్పుడు విధానాలకు పోలీసులు సహకిస్తుం టే ఇక రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ ఎక్కడఉంటుంది? డీజీపీగా ఉన్నవ్యక్తిని న్యాయస్థా నంలో నిలుచోబెట్టి, ఐపీసీ సెక్షన్లు చదివించినప్పుడే ఆస్థానంలో ఉన్నవ్యక్తి రాజీనామా చేయాలి. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా పోలీసులతీరుపై ఆలోచించాలి. డీజీపీకి చెప్పకుండానే ఒంగోలు పోలీసులు సుబ్బారావుగుప్తాపై గంజాయికేసుపెట్టారా? ముఖ్యమంత్రి తక్షణమే సుబ్బారావుగుప్తాపై పెట్టించిన గంజాయికేసును ఎత్తేయించాలి. అలానే దళితయువకుడు అజయ్ కుమార్ పై పెట్టిన దొంగకేసునికూడా తక్షణమేతీసేయాలి. నిజంగా తప్పుచేస్తే శిక్షించాల్సి న ప్రభుత్వమే తప్పులమీద తప్పులుచేస్తుంటే, ప్రజలు శిక్షించడంఖాయం.

ముఖ్యమంత్రి, మంత్రిమండలి తొందరపడితే, సుప్రీంకోర్టు తొందరపడుతుందా? ప్రభుత్వం తీసుకున్న మూడురాజధానుల నిర్ణయం కాన్ స్టిట్యూషనల్ బెంచ్ సమీక్షించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది
రాష్ట్రరాజధాని అమరావతే అని కేంద్రంచెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి దుగ్ధతో, దురాలోచన తో మూడురాజధానుల ప్రకటనచేశాడు. మూడురాజధానుల కేసుసుప్రీంకోర్టులో విచారణలో ఉండగా.. రాష్ట్రప్రభుత్వ తరుపున్యాయవాదులు చెప్పినతేదీకంటే ముందే విచారించాలని ప ట్టుబట్టి భంగపడ్డారు. రాష్ట్రరాజధాని అంశం రాజ్యాంగపరమైన అంశాలకు సంబంధించింది అని, దాన్ని సుప్రీంకోర్టు కాన్ స్టిట్యూషనల్ ఫుల్ బెంచ్ (7గురు న్యాయమూర్తుల ధర్మాసనం) ముందు విచారించాల్సి ఉందని, సుప్రీంకోర్టు జడ్జి కే.ఎం.జోసెఫ్ స్పష్టంగా చెప్పారు.

దేశ అత్యున్నతన్యాయస్తానం స్పష్టంగా చెప్పినాకూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆత్రుతపడితే ఎలా? జగన్ కు మెలుకువ వస్తే తెల్లారినట్టుకాదు. కోడికూస్తేనే తెల్లారినట్టు అని ముఖ్యమంత్రి, మంత్రిమండలి గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రి వర్గం ఎంతగా ఆరాపడినా ప్రభుత్వంతీసుకున్న మూడురాజధానుల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించదు. ఎస్సీలకు తాను మేనమామను అని జగన్ రెడ్డి చెప్పిందంతా పచ్చి అబద్ధం.

జగన్ దళిత బిడ్డలకు కంసమామ అనే చెప్పాలి. చంద్రబాబుహయాంలో వేలాదిమంది దళిత బిడ్డలు విదేశాలకువెళ్లి చదువుకుంటే, జగన్ వచ్చాక వారంతా రోడ్డునపడ్డారు. పోలీస్ స్టేషన్లో ఒక దళితయువకుడికి గుండుకొట్టించిన వ్యక్తి వారికి మేనమామ అవుతాడా..కంసమామ అవుతాడా? దళిత మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు చేయించే జగన్ రెడ్డి వారికి మేనమామ అవుతాడా..కంసమామ అవుతాడా? గతఎన్నికల్లో జగన్ రెడ్డి దళితుల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నాడు, ఆదళితులే వచ్చే ఎన్నికల్లో వైసీపీప్రభుత్వానికి బుద్ధిచెప్పి, జగన్ ను అధ:పాతాళానికి తొక్కేయడానికి సిద్ధమయ్యారు” అని రామయ్య స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE