Suryaa.co.in

Andhra Pradesh

మిస్బా చేసిన తప్పేంటి? బాగా చదవడమే చేసిన తప్పా?

జగన్ రెడ్డి పాలనలో మైనారిటీలకు రక్షణ లేదు
మిస్బాపేరుమీద ఓ కాంప్లెక్స్ కట్టిస్తాం
పుంగనూరుకు పాపాల పెద్దిరెడ్డి శని
బీడీ కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, కల్లూరులో ముస్లిం మైనారిటీలతో యువనేత నారా లోకేష్ ముఖాముఖి

కార్యక్రమం ప్రారంభంలో ముస్లిం మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి లోకేష్ ను ఆశీర్వదించారు. మైనారిటీ మహిళ యువతనేతకు రక్షాబంధన్ కట్టి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.

టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ…
• రాష్ట్రంలోని మైనారిటీలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు చూసి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
• గత నాలుగేళ్లలో ఏపీకి ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేని వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తుండడంతో పొలిటికల్ స్టంట్ లో భాగంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను పెట్టారు. జగన్ రెడ్డి మాయమాటలకు మైనారిటీలెవరూ మోసపోవద్దు.
• టీడీపీని గెలిపించుకుని..మైనారిటీల సమస్యల్ని పరిష్కరించుకుందాం.

లోకేష్ ను కలిసిన మిస్బా తల్లిదండ్రులు…
చిత్తూరుజిల్లా, పలమనేరుకు చెందిన మైనారిటీ అమ్మాయి మిస్బా వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. మిస్బా తల్లిదండ్రులు వజీర్ అహ్మద్, నసీమా యువనేత నారా లోకేష్ ను పుంగనూరు నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన మైనారిటీల ముఖాముఖిలో కలిశారు. మిస్బకు సంబంధించిన మార్కుల లిస్టులు, డ్రాయింగ్ పుస్తకాలు, వివిధ పోటీల్లో మిస్బా సాధించిన విజయాలకు సంబంధించిన సర్టిఫికెట్లు తెచ్చి లోకేష్ కు చూపించారు. తమ కుమార్తె బాగా చదువుతోందని తట్టుకోలేక వైసీపీ నాయకులు టీసీ ఇప్పించి, తమ కుమార్తె చదువుకు అడ్డం పడ్డారని వాపోయారు. దాన్ని తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుందని కన్నీరుమున్నీరయ్యారు. మైనారిటీ పిల్లలు బాగా చదవకూడదా? చదివితే వేధించి చంపేస్తారా? అంటూ తమ ఆవేదనను యువతనేతకు చెప్పుకుని బాధపడ్డారు. తమ కుమార్తె చనిపోయి ఏడాది గడిచినా ప్రభుత్వం తమను కనీసం ఓదార్చలేదని, ఎటువంటి సహాయసహకారాలు లేవని తెలిపారు.

ఈ సందర్భంగా యువనేత లోకేష్ మాట్లాడుతూ….
• మిస్బా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని, తన కూతురికి పోటీ వస్తోందనే కక్షతో మిస్బాకి చదువును దూరం చేయాలనే దురుద్దేశంతో వైసీపీ నాయకుడు సునీల్ బలవంతంగా టీసీ ఇప్పించారు.
• మిస్బా తన డ్రాయింగ్ బుక్ లో నేను బాగా చదువుకోవాలి. డాక్టర్ కావాలని రాసుకుంది.(మిస్బా డ్రాయింగ్ బుక్ చూపిస్తూ).
• మిస్బా చేసిన తప్పేంటి? బాగా చదవడమే చేసిన తప్పా?
• వైసీపీ పాలనలో దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల వాళ్లు చదువుకోకూడదనే విధంగా పరిస్థితులు ఉన్నాయి.
• మిస్బా తల్లిదండ్రులను మేం ఓదారిస్తే దాన్ని రాజకీయం చేసి, వేధిస్తున్నారు. ఇదేం సంస్కృతి?
• బాగా చదవేవారిని ప్రోత్సహించిన ముఖ్యమంత్రులను, ప్రభుత్వాలను చూశాం కానీ…ఇలా వేధించి చంపే ప్రభుత్వాన్ని జగన్ రెడ్డి పాలనలోనే చూస్తున్నాం.
• జగన్ రెడ్డి పాలనలో మైనారిటీలకు రక్షణ లేదు.
• వేధింపులు, హత్యలు, దాడులు, అక్రమ కేసులతో మైనారిటీలపై కక్షపూరితంగా జగన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు.
• తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఎప్పుడూ ఇలా జరగలేదు.
• మిస్బా కుటుంబానికి మేం అండగా నిలబడతాం..
• మిస్బాపేరుమీద ఓ కాంప్లెక్స్ కట్టిస్తాం. దానిలో ఓ షాపును మిస్బా తల్లిదండ్రులకు ఉచితంగా ఇచ్చి, రూ.5లక్షల పెట్టుబడి పెట్టి ఆర్థిక తోడ్పాటునందిస్తాం.
• మిస్బా తమ్ముడు నిజాముద్దీన్ ను చదివిస్తాం..అన్ని విధాలా ప్రోత్సహిస్తాం
• మిస్బాను మానసికంగా వేధించిన వైసీపీ నాయకుడు సునీల్ పై అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షిస్తాం

ముఖాముఖిలో యువనేతకు పుంగనూరు నియోజకవర్గ మైనారిటీలు తమ సమస్యలు వివరించారు.
అష్రఫ్ అలీ: మా పిల్లలు చదువుకునేందుకు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలి.
బావాజీ: జంగవారిపల్లి పంచాయతీలో షాదీఖానా నిర్మాణానికి గత నాలుగేళ్లుగా ప‌దిసార్లు కొబ్బరికాయలు కొట్టి ఆపేశారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు షాదీఖానా నిర్మించండి. మా పిల్లలకు చదువు నేర్పించే హజరత్ పక్క రాష్ట్రం నుండి వస్తారు. అతను ఉండడానికి ఓ ఇల్లు లేదు. సదుపాయాలు లేవు. వాటిని కూడా ఏర్పాటు చేయాలి.
ఫిరోజ్: మా ప్రాంతంలో వైసీపీ వాళ్లు చేస్తున్న దోపిడీలు, అక్రమాలపై మేం ప్రశ్నించాం. ఏడుగురు మైనారిటీ యువకులపై మంత్రి పెద్దిరెడ్డి అక్రమ కేసులు పెట్టి, మాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. జైల్లో 21రోజులు పెట్టారు. నేను కువైట్ లో ఉద్యోగం చేసేవాడిని. నా పాస్ పోర్టు కూడా రద్దు చేశారు. నన్ను ఆర్థికంగా, మానసికంగా వేధిస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయండి.
ఖాసి: భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి.
అబుబకర్: బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించండి. ఏమైనా కంపెనీలు, ఫ్యాక్టరీలు తెచ్చి ఉపాధి అవకాశాలు కల్పించండి.
వలి: మదర్సాలకు ప్రభుత్వం వచ్చాక ఆర్థిక తోడ్పాటునందించండి.

యువనేత నారా లోకేష్ మైనారిటీ సమస్యలపై స్పందిస్తూ….
• పుంగనూరుకు పాపాల పెద్దిరెడ్డి శనిలా దాపురించాడు.
• పేదవాళ్లు చదవకూడదు, తప్పులను నిలదీయకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, అభివృద్దిలోకి రాకూడదనే దురుద్దేశంతో బెదిరింపు, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడు.
• మూడుసార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి ఈ నియోజకవర్గానికి ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదు.
• టీడీపీ పాలనలో నేను మంత్రిగా ఉన్నప్పుడు రూ.100కోట్లు పుంగనూరు అభివృద్దికోసం ఇస్తే కనీసం వాటిని వినియోగించకుండా పనులకు అడ్డుపడ్డాడు.
• కేవలం తాను ఇచ్చిన పప్పు బెల్లాలు మాత్రమే తీసుకుని పేదవాడు పేదరికంలోనే మగ్గిపోవాలి అనే విధంగా పెద్దిరెడ్డి ప్రవర్తిస్తున్నాడు.
• జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మైనారిటీల సంక్షేమాన్ని గాలికొదిలేశాడు.
• వైసీపీ నాయకులు తమ జేబులు నింపుకోవడం తప్ప, రాష్ట్ర ప్రజల సమస్యల్ని పట్టించుకోవడం లేదు.
• మైనారిటీలను వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. కొంత మంది మైనారిటీలను దారుణంగా చంపేశారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఒక్క పుంగనూరులోనే 12మంది మైనారిటీలపై అక్రమ కేసులు పెట్టారు.
• మైనారిటీలను దారుణంగా చంపేస్తున్నా ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా కనీసం నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నాడు.
• 2024 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక మైనారిటీల సంక్షేమాన్ని గతంలో అమలు చేసిన విధంగా యథావిధిగా కొనసాగిస్తాం.
• పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను ఎగరేయండి..మీకు నిజమైన అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేసి చూపిస్తాం.
• పుంగనూరు ప్రజలు ఉద్యోగాలు కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా కంపెనీలు, పరిశ్రమలు తీసుకొస్తాం.
• బీడీ కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థిక తోడ్పాటునందిస్తాం.
• భవన నిర్మాణరంగం కార్మికులకు గత పాలనలో అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తాం. జగన్ రెడ్డి దోచుకున్న కార్పొరేషన్ నిధులను వెనక్కి తీసుకొచ్చి, వాటిని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తాం.
• ఈ ప్రాంతంలో ఉన్న అవకాశాలను బట్టి జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలు తెచ్చేందుకు ప్రయత్నిస్తాం.
• ఖబరస్తాన్ ఆస్తుల దోపిడీలు, వక్ఫ్ బోర్డు ఆస్తుల కబ్జాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు తెస్తాం.
• మిమ్మల్ని అక్రమ కేసులతో ఇబ్బందిపెట్టే అధికారుల తోలు తీస్తాం..వాళ్లపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేసి వాళ్లను సర్వీస్ నుండి తొలగిస్తాం..అవసరమనుకుంటే జైలుకు కూడా పంపుతాం.
• అక్రమ కేసులు అన్నింటినీ కొట్టేస్తాం.
• వైసీపీ నాయకుల బెదిరింపులకు, అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దు. మీకు అండగా నేనుంటా. అవసరమైతే లాయర్లను మేం మీకు అందుబాటులో ఉంచుతాం.
• మీ హక్కుల కోసం మీరు పోరాడండి…మీ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు, సహకారం ఉంటుందని హామీ ఇస్తున్నా…

LEAVE A RESPONSE