-నీళ్ళ కష్టాలు మేము తీర్చితే, కేంద్రంలోని బిజెపి కన్నీళ్లు పెట్టిస్తున్నది
-మోటార్లను మీటర్లు పెడతామని రైతులను, గ్యాస్ బండ ధరలు పెంచి సామాన్యులకు కునుకు లేకుండా చేస్తున్నది
-రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు వంటి పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదు
-కోహిర్ లో 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు..
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..అవసరమైన వైద్య సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేస్తాం. మంచి సేవలు అందేలా చూస్తాము.83 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి.ప్రభుత్వ ఆసుపత్రుల పై ప్రజల్లో ఎంతో నమ్మకం ఉంది.ప్రభుత్వం ప్రజల కోసం ఎంతో చేస్తున్నది.కేసీఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్స్ అందిస్తున్నది.మహిళలకు నీళ్ళు మోసే గోస లేకుండా చేసింది.మహిళలకు శుభాకాంక్షలు.రూ. 750 కోట్లు విడుదల చేస్తాము. వడ్డీ లేని రుణాలు ఇవ్వ బోతున్నం.మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య మహిళ ప్రారంభిస్తున్నాము.