-ఫార్మా, IT రంగాల్లో ప్రపంచం లోనే అతిపెద్ద ఎగుమతిదారు..
-హైదరాబాద్ కేంద్రంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ప్రపంచ నలుమూలలకు అందించిన ఘనత…
-ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య సేవలను నామమాత్రపు ధరలకు అందిస్తున్న నగరంగా హైదరాబాద్ కు గుర్తింపు…
-తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన పర్యాటక ప్రదేశాలు..
-బుద్ధిజం కేంద్రాల అభివృద్ధి..
-ప్రపంచ స్థాయిలో బుద్ధవనం ప్రాజెక్టు నిర్మాణం
-సీఎం కేసీఆర్ సూచనల మేరకు పర్యాటక ప్రదేశాల అభివృద్ధి
-బెర్లిన్ లో వరల్డ్ టూర్స్ అండ్ ట్రావెల్ ఆపరేటర్లకు తెలంగాణ కు ఆహ్వానం
-ITB, బెర్లిన్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టూరిజం కల్చర్ ఎగ్జిబిషన్ లో ట్రావెల్ అండ్ టూర్ ఆపరేటర్స్ తో నిర్వహించిన సమావేశంలో మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
ITB, బెర్లిన్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టూరిజం అండ్ కల్చర్ టూరిజం ఏజెంట్లు తో రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ముఖాముఖి నిర్వహించారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాల విశిష్టతను వివరించారు. తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతూ.. ఇతర రాష్ట్రాలకు నిలుస్తోందన్నారు. తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు, బతుకమ్మ, బొడ్డెమ్మ పండుగ లు ఎంతో ప్రత్యేకమన్నారు. ఇంటర్నేషనల్ టూరిజం అండ్ కల్చర్ ఎగ్జిబిషన్లో తెలంగాణ టూరిజం స్టాల్ పర్యాటకులను టూర్స్ అండ్ ట్రావెల్ ఆపరేటర్లను విశేషంగా ఆకర్షించిందన్నారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్.
తెలంగాణ రాష్ట్రంలో బుద్ధిజానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నామన్నారు. నాగార్జునసాగర్ లో బుద్ధ వనం ప్రాజెక్టును ప్రపంచ స్థాయిలో నిర్మించామన్నారు. హైదరాబాద్ నగరం ఫార్మా ,ఐటీ , వెల్త్ క్యాపిటల్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. కరోన సమయంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లను సరఫరా చేసిన ఘనత హైదరాబాద్ నగరానికి దక్కిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ వైద్య సేవలు నామమాత్రపు ధరకు అందిస్తున్న నగరంగా హైదరాబాద్ కు ఎంతో గుర్తింపు లభిస్తుందన్నారు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్.
ఈ కార్యక్రమంలో ఇండియా టూరిజం సెక్రటరీ అరవింద్ సింగ్, భారత రాయబారి పర్వతనేని హరీష్, తెలంగాణ టూరిజం ఎండి మనోహర్, తదితరులు పాల్గొన్నారు.