Suryaa.co.in

Telangana

హైదరాబాద్ లో బీజేపీ ధర్నా సిగ్గు చేటు

– రిజర్వేషన్ లేకపోయినా హైదరాబాద్ మేయర్ మహిళకు ఇచ్చాం.
-మార్కెట్ కమిటీల్లో 50% రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దే
-ఆడబిడ్డ పెళ్లికి 1లక్ష రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం సీఎం కెసిఆర్ దే
– మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఢిల్లీ : బీజేపీ రెండు సార్లు మేనిఫెస్టోలో మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. అనంతరం ఆ ఊసే ఎత్తలేదు.నిన్నటి దీక్ష కు పలు పార్టీలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మద్దతు తెలిపాయి.పరోక్షంగా కోట్ల మంది తమ సంఘీభావం తెలిపారు.రాష్ట్ర బీజేపీ నాయకులు ధర్నా ఎందుకు చేశారో తెలియదు.తెలంగాణలో స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

1,13,000వార్డు సభ్యుల్లో 59వేల మహిళ వార్డు సభ్యులు ఉన్నారు.6,844 మహిళ సర్పంచ్ లు ఉన్నారు.3,330మహిళ ఎంపీటీసీలు ఉన్నారు.300 పైచిలుకు మహిళ జెడ్పిటిసిలు ఉన్నారు.349 మంది ఎంపిపిలున్నారు. హైదరాబాద్ లో బీజేపీ ధర్నా సిగ్గు చేటు. ఎలాంటి రిజర్వేషన్ లేకపోయినా హైదరాబాద్ మేయర్ మహిళకు ఇచ్చాం.

మార్కెట్ కమిటీల్లో 50% రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దే.తెలంగాణ మహిళ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి.ఆడబిడ్డ పెళ్లికి 1లక్ష రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం సీఎం కెసిఆర్ దే. దేశంలో ఎక్కడైన ఈ పథకం అమలు చేస్తున్నారో బండి సంజయ చెప్పాలి?
మహిళల బిందెలు పట్టుకు రాకుండా ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లు ఇస్తున్నాం.మీరు పాలిస్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రాంతాల్లో ఇంటింటికి నీళ్లు ఇస్తున్నారా.?కేంద్రం సహకరించక పోయిన మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసాం.మా పథకం ఆదర్శంగా తీసుకొని కేంద్రం చేపట్టింది. గర్భిణీ నుంచి బిడ్డ పుట్టే వరకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.మహిళల భద్రత కోసం షి టీమ్స్ ఏర్పాటు చేసాం.వి హబ్ ఏర్పాటు చేసి మహిళలకు సహాయం అందిస్తున్నాం.

దేశంలో ఎక్కడా లేని విధంగా 1000 గురుకులలు ఏర్పాటు చేస్తే 600 కేవలం ఆడబిడ్డల కోసం కేటాయించారు. మహిళ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు.మహిళ దినోత్సవం రోజు గ్యాస్ ధరలు పెంచి మోదీ ప్రభుత్వం మహిళలకు గిఫ్ట్ ఇచ్చింది.మహిళలకు ఎవరు నష్టం చేస్తున్నారో బిజెపి నాయకులు తెలుసుకోండి.మోడీ ఆడిందే ఆట పాడిందే పాట.ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అని అనుకుంటున్నారు.

కెసిఆర్ దేశం మొత్తం తిరుగుతూ… తెలంగాణ మోడల్ అమలు చేస్తే ఉనికి కోల్పోతాం అని భావిస్తున్నారు.మహిళలు అంటేనే మోడీకి గిట్టదని అర్థం అవుతోంది.కేసీఆర్ వెన్నంటి ఉన్నవారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.కేంద్ర దర్యాప్తు సంస్థలను ఊసిగొల్పుతున్నారు.

2వ తేదీ దీక్ష ప్రకటన చేయగానే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చారు.కేసీఆర్ ని ఇబ్బంది పెట్టే యోచనలోనే కవిత కు నోటీసులు.ప్రజలంతా కెసిఆర్ వెంటే ఉంటారు.బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రతి మహిళ ఖండిస్తోంది.సంస్కారం మరచి.. ఈర్శతో మాట్లాడుతున్నారు.మీ ఇంట్లో అమ్మ, భార్య ఉంది.
రాజకీయ జీవితంలో జాగ్రత్తగా మాట్లాడాలి.కేసీఆర్, కేటీఆర్, కవితను తిట్టడం తప్ప చేసేందిమి బిజెపి నేతలు చేసేది ఏమి లేదు.దేశ అడబిడ్డల హక్కుల కోసం ఎమ్మెల్సీ కవిత ధర్నా చేశారు.మహిళ అందరం ఏకమవుతాం.. మహిళ శక్తి చూపిస్తాం.

 

LEAVE A RESPONSE