-బీఆర్ ఎస్ అధినేత రాకకై మరాఠీ సోదరుల ఎదురు చూపులు
-కాందార్ లోహ సభ ద్వారా తెలంగాణ మోడల్ ఆవిష్కృతం
-అనితర సాధ్యమైన అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ మోడల్
-కేసీఆర్ ది దేశానికి అన్నం పెట్టే మోడల్
-మోడీది అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టే మోడల్
-కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. మోడీ అంటే ఒక అమ్మకం
-కేసీఆర్ ది ఇండియా యిజం
-మోడీది ఈడీయిజం
-ప్రాంతానికో వేషం..రాష్ర్టానికో మోసం
-బీజేపీ ఒక సెల్లర్ పార్టీ-కిసాన్ కిల్లర్ పార్టీ
-బీఆర్ ఎస్ ది రాజనీతి-బీజేపీది దమన నీతి
-కాందార్ లోహ సభ సక్సెస్ తో మోడీ దిమ్మదిరగాలి
-లక్ష మందికి పైగా “మహా”జనంతో సభ జరుగుతుంది
-పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
కాందార్ లోహ(మహారాష్ట్ర):- అభివృద్ధి, సంక్షేమం లో అగ్రగామిగా నిలిచి దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ మోడల్ ను సంపూర్ణంగా అర్థం చేసుకున్న మహారాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కి జై కొడుతున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర లోని కాందార్ లోహ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్రా కకై మరాఠీ సోదరులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాందార్ లోహ సభ ద్వారా తెలంగాణ మోడల్ ఆవిష్కృతమవుతుందని ఆయన పేర్కొన్నారు.
“అనితర సాధ్యమైన అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తెలంగాణ మోడల్. కేసీఆర్ ది దేశానికి అన్నం పెట్టే మోడల్.మోడీది అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టే మోడల్. కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. మోడీ అంటే ఒక అమ్మకం.కేసీఆర్ ది ఇండియా యిజం.మోడీది ఈడీయిజం.బీజేపీ ఒక సెల్లర్ పార్టీ.కిసాన్ కిల్లర్ పార్టీ. బీఆర్ ఎస్ ది రాజనీతి. బీజేపీది దమన నీతి. కాందార్ లోహ సభ సక్సెస్ తో మోడీ దిమ్మదిరగాలి. లక్ష మందికి పైగా మహారాష్ట్ర ప్రజలతో కాందార్ లోహ సభ జరుగుతుంది. దేశ ప్రజలు ఇకనైనా ఆలోచించాలి. గ్రామ గ్రామాన చర్చ జరగాలి. అందరికీ అన్నం పెట్టే కేసీఆర్ మోడల్ కావాలా ?.దేశ ప్రజలకు సున్నం పెడుతున్న మోడీ గోల్ మాల్ మోడల్ కావాలా?.ఎకరానికి 10వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతుబంధు కేసీఆర్ కావాలా?. రైతులను కార్లతో తొక్కించి తుపాకులతో కాల్చి చంపించే మోడీ కావాలా?
ఏ కారణంతోనైన రైతు మరణిస్తే 48 గంటల లోపు ఆ రైతు కుటుంబానికి 5లక్షల చొప్పున రైతుబీమా చెల్లించే కేసీఆర్ ధీమా కావాలా?. రైతును అవమానపర్చే మోడీ అహంకారం కావాలా?. ఆరు వందలకు మించి పెన్షన్లు ఇవ్వని గుజరాత్ బేరగాళ్ళ మోడల్ కావాలా?.రూ. 2016, రూ.3016 పెన్షన్లు ఇస్తున్న కేసీఆర్ మోడల్ కావాలా?. మోటార్లకు మీటర్లు పెట్టే మోడీ కావాలా?. 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న కేసీఆర్ కావాలా?.దళిత బంధు ఇచ్చే కేసీఆర్ కావాలా?.దళితులు అంటే గౌరవం లేని మోడీ కావాలా?. మతం పేరుతో మంట పెడుతున్న బీజేపీ కావాలా?. పచ్చని పంటలకు కర్మ,కర్త, క్రియ అయిన కేసీఆర్ గారు కావాలా?.సన్న బియ్యం ఇచ్చే కేసీఆర్ కావాలా?. దొడ్డు, ముక్క, పురుగు పట్టిన బియ్యం ఇచ్చే మోడీ కావాలా?.కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు చేసే కేసీఆర్ కావాలా,?ఆడపిల్లల భవిష్యత్తు ను పట్టించుకోని మోడీ కావాలా?. ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీళ్లు సరఫరా చేస్తున్న కేసీఆర్ కావాలా?.మురికినీటితో ప్రజల ప్రాణాలు తీస్తున్న మోడీ కావాలా?.ఈ అంశాలపై ప్రతీ ఇంట్లో చర్చ జరగాలి. ప్రతీ ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
మోడీ వచ్చి చేసిందేమిటి?.ఆలిండియా రేడియోలో స్పీచ్ లు,ఎయిరిండియా ప్లైట్లలో ఫారిన్ టూర్లు తప్ప.మాటలు కోటలు దాటే “మన్ కీబాత్” లు. ఢిల్లీ గుమ్మం దాటని చేతలు. బీజేపీకి రాజనీతి లేదు.ఉన్నదల్లా అవినీతి,ద్వంద్వనీతి, దమననీతి.. మోదీ పాలనలో నిరుద్యోగం రెండింతలు పెరిగింది.3.3% నుంచి 7.2%కి ఎగబాకిన నిరుద్యోగ గ్రాఫ్ . ప్రతి ఐదు పోస్టులకు ఒకటి ఖాళీ.22.69% కి పెరిగిన ఖాళీలు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలంటూ ఊదరగొట్టిన మోదీ ఉన్న ఉద్యోగాలనే ఊడ గొట్టిండు. ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డీకి పావుశేరు అమ్ముతున్న బీజేపీ ఒక సెల్లర్ పార్టీ. కంట్రీ కిల్లర్ పార్టీ. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు జైకిసాన్.అధికారంలోకి రాగానే నై కిసాన్. ఏ రాష్ట్రంలో ఎన్నికలుంటే ఆ రాష్ట్రంలో ఓట్ల కోసం సర్కస్ ఫీట్లు. ప్రాంతానికో వేషం..రాష్ర్టానికో మోసంలక్ష కోట్ల ప్యాకేజీ ఇస్తామని ఓట్ల కోసం పాట్లు.బీజేపీ అంటేనే గుజరాతీ గులాం ల పార్టీ.
బీజేపీ-అంటేనే బ్రోకర్ జూటా పార్టీ. అది భారతీయ జనతా పార్టీ కాదు.అది భ్రష్టాచారి జనతా పార్టీ. ప్రధాని మోడీ ఒక అదానీ కోసం పనిచేస్తుండు.కేసీఆర్ దేశంలోని అందరి కోసం పనిచేస్తుండు. మహారాష్ట్ర దేశానికి శ్వాస. ఆర్థిక రాజధానిగా మహారాష్ట్ర దేశానికే గర్వకారణం. ఇలాంటి గొప్ప రాష్ట్రం బీజేపీ తో నష్టపోకూడదు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ మహారాష్ట్ర లోనూ అమలు కావాలి. పల్లె పల్లె బీజేపీ పై తిరగబడాలి. బీఆర్ ఎస్ జెండాకు అండగా నిలవాలి. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కాందార్ లోహ సభ వేదికపైనా పెద్ద ఎత్తున బీఆర్ ఎస్ లో చేరడానికి వివిధ పార్టీల నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఆదర్శవంతమైన తెలంగాణ మోడల్ తమ రాష్ట్రంలో కూడా అమలు జరగాలన్నది మహారాష్ట్ర ప్రజల మనోగతం. తమ సంపూర్ణ మద్దతు తెలిపి తమ జీవితాలలో వెలుగులు నింపాలని కొరడానికి కేసీఆర్ రాకకై మహారాష్ట్ర ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లకు స్థానిక ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. కేసీఆర్ కి ఘన స్వాగతం పలికేందుకు మరాఠీ సోదరులు రెడీగా ఉన్నారు”అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్ష్ తివారి, మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదం, గణేష్ బాబు కదం, సంతోష్ వార్కడ్, ప్రవీణ్, అంకిత్ యాదవ్, శివరాజ్ ధోండ్గే, సునీల్ ధోండ్గే, విజయ్ ధోండ్గే, దత్తా కారముంగే, అజయ్ అంకరి, విశ్వంబర్ పాటిల్, శివరాజ్ పాటిల్, అప్పారావు పాటిల్ రఘు, రాజు, స్థానిక బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.