బండి సంజయ్ సతీమణికి మాతృ వియోగం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను, ఆయన సతీమణి శ్రీమతి అపర్ణ ను బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప కరీంనగర్ లో పరామర్శించారు. శ్రీమతి అపర్ణ తల్లి శ్రీమతి చిట్ల వనజ కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎమ్యేల్యే రఘునందన్ రావు తో కలిసి సంగప్ప వనజ చిత్రపటానికి నివాళులు అర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీమతి అపర్ణకి మరియు సంజయ్ గారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని కోరుతున్నట్లు సంగప్ప చెప్పారు.