బీసీలకు అండగా నిలుస్తున్న టీడీపీని గెలిపించుకుంటాం

-చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే బీసీలు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా మేలు
-బీసీ సాధికార సమితులతో సమావేశంలో బీసీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే బీసీలకు రాజకీయంగా అవకాశాలు లభించాయి. ఆర్ధికంగా మెరుగైన జీవితం అందించేందుకు ఎన్టీఆర్ చొరవ తీసుకున్నారు. దాన్ని చంద్రబాబు మరింతగా ప్రోత్సహించారని తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సాధికార సమితి కన్వీనర్లు, జోనల్ టీడీపీ కో ఆర్డినేటర్స్, సాధికార సమితి కోఆర్డినేటర్స్, పార్లమెంట్ అధ్యక్షులు, కార్యదర్శులు, పార్లమెంట్ కో-ఆర్డినేటర్స్, పార్లమెంట్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్స్‌తో సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 3 నుండి మహానాడుకు ముందు సాధికార సమితులు, జోనల్ స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు పూర్తి చేయాలని సూచించారు. జగన్ రెడ్డి అరాచకాన్ని ఎలుగెత్తి చాటే ప్రతి బీసీ గొంతుకకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచిపోరాడుతుందన్నారు. బీసీలను దగా చేస్తున్న జగన్ రెడ్డికి 142 కులాల్లోని 2.52 కోట్ల మంది బీసీలు ఏకమై తగిన గుణపాఠం చెప్పబోతున్నామన్నారు. తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు చుక్కలు చూపించారు. పులివెందులలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్ధికి ఆధిక్యం రావడమంటే.. జగన్ రెడ్డిని చీత్కరించడమే. అదే విధంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ మహిళ పంచుమర్తి అనురాధను గెలిపించి.. తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి అని నిరూపించారని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

గత మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, కార్పొరేషన్ల ద్వారా నిధులు ఇవ్వకుండా దగా చేశారని సమావేశానికి హాజరైన సభ్యులు పేర్కొన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీసీలను అడుగడుగునా అణచివేస్తున్నారు. సబ్ ప్లాన్ నిర్వీర్యం చేశారు. రిజర్వేషన్లు కుదించి సుమారు 17వేల మందికి రాజకీయ అవకాశాలు దూరం చేశారు. కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. ఆదరణ పథకాన్ని తుప్పుపట్టించారు. బీసీ భవన్స్, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం నిలిపివేశారు. 26 మంది బీసీ నేతల్ని దారునంగా హత్య చేశారు. వందలాది మందిపై దాడులకు పాల్పడ్డారు. తప్పుడు కేసులు పెట్టి వేధించారు. బీసీలకు అండగా నిలిచిన పెళ్లి కానుకలు, విదేశీ విద్య, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు, స్టడీ సర్కిల్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, చంద్రన్న బీమా వంటి సుమారు 28 పథకాలను రద్దు చేశారు. కుల వృత్తి చేసుకునే వారికి ఉచిత విద్యుత్, ముడి సరుకులపై ఇచ్చే సబ్సిడీలు రద్దు చేశారు. వృత్తి చేయడమే పాపం అనేలా వారి జీవన స్థితిని దిగజార్చి బీసీలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. వచ్చే నెల నుండి చేపట్టబోయే బీసీ సాధికార సమితి సభ్యుల సమావేశాలను దిగ్విజయం చేయాల్సిందిగా కోరారు.

కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టి.డి.జనార్ధన్, మాజీ ఎంపీ కనకళ్ల నారాయణ, హెచ్.ఆర్.డీ ఛైర్మన్ బూర్ల రామాంజనేయులు, టీడీపీ బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, గుంటుపల్లి నాగేశ్వరరావు, బొడ్డు వేణుగోపాల్‌రావు, సింహాద్రి కనకాచారి, తాతా జయప్రకాశ్ నారాయణ, షేక్ షా వలి, నాగేశ్వర యాదవ్, రాజమండ్రి నారాయణ సహా పలువురు బీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply