-వైయస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అందరం అండగా ఉందామని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పిలుపునిచ్చారు. పేదవాళ్లు గొప్పవాళ్లవుతుంటే చాలామందికి నచ్చడం లేదని అన్నారు. పేదవాళ్ల అకౌంట్లలో డబ్బులు పడుతుంటే రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిపారు. శింగనమల మండల కేంద్రంలో వైయస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల ఖాతాల్లో నగదు వేస్తున్న ముఖ్యమంత్రి జగనన్నను అందరూ మెచ్చుకుంటుంటే, ప్రతిపక్షనేతలు మాత్రం శాపనార్థాలు పెడుతున్నారని విమర్శించారు.
తరాలు గడుస్తున్నా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లు దాటినా పేదవాడు ఎప్పుడూ పేదవాడుగానే ఉండిపోతున్నాడు. ఎందుకంటే వాళ్లు ఆ బడా నేతల కింద పని చేయాలి, వాళ్లు ఎదిగితే, వారికింద పనిచేసేవాడు ఎవరు ఉంటారు? అని ఇన్నాళ్లు ప్రతిపక్షాలు అణగదొక్కేసాయని అన్నారు. కానీ పేదవాడికి చేయూతనిచ్చే నవరత్న పథకాలను సృష్టించి, వారి జీవన చిత్రాన్ని మార్చిన ఘనత ఒక్క జగనన్నకే దక్కుతుందని అన్నారు.
విజ్నులైన ప్రజలందరూ గమనించండి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పది రూపాయలు రావాలంటే ఎలా ఉండేది? .. ఎన్నిచోట్ల తిరిగేవారు? ఎక్కడెక్కడ తిప్పేవారు? ఇప్పుడాపరిస్థితి ఉందా? రేపు ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి కోరారు.
శింగనమల మండలంలో 630 గ్రూప్ లకు, 6387 మంది సభ్యులకు కలిపి జగనన్న ఇచ్చింది…అక్షరాల రూ.5 కోట్ల 38 లక్షల 18 వేల రూపాయలు అని ఎమ్మెల్యే వివరించారు. ఇంత ఠంచనుగా ఇస్తున్న, చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న మాత్రమేనని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ ,ఎంపీపీ , జడ్పీటీసీ , సింగిల్ విండో ప్రెసిడెంట్ ,ఎంపీటీసీలు, సర్పంచులు, మండల కన్వీనర్ , నాయకులు,కార్యకర్తలు,సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.