– రాష్ట్రానికి, ప్రజలకు ఏదైనా సాధిస్తే, ఆ విషయం చెప్పడానికి భయమెందుకు? జగన్ తొలిసారి ఢిల్లీ వెళ్లినప్పుడు చెప్పిందే, మళ్లీమళ్లీ ఎందుకు చెబుతున్నారు?
• ప్రధానిని ముఖ్యమంత్రి కలిస్తే, వారిద్దరి మధ్య ఏంజరిగిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?
• అమరావతి నిర్మాణానికి చంద్రబాబు ఏంచేశాడో, జగన్ ఏంచేశాడో ప్రజలకు బాగా తెలుసు
• రాజధాని కోసం ఈ నాలుగేళ్లలో జగన్, అతనిప్రభుత్వం ఏంచేసిందో వాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేయించే దమ్ము, ధైర్యం సజ్జలకు ఉన్నాయా?
• బీజేపీనేత సత్యకుమార్ పై వైసీపీ గూండాలు దాడిచేస్తే, దానికి సమాధానం చెప్పకుండా, సజ్జల తలాతోక లేకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
బీజేపీనేత సత్యకుమార్ పై రాజధానిలో జరిగినదాడి ప్రణాళిక, పద్ధతిప్రకారమే జరిగిందని, జగన్, అతనిప్రభుత్వం అమరావతి నిర్మాణానికి నాలుగేళ్లలో చేసింది శూన్యమని, ఈ మాట సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులే అంటారని, కావాలంటే ఆయన వారిని అడగొచ్చని, చంద్రబాబు అంతా గ్రాఫిక్స్ చేస్తే, వైసీపీనేతలు రాజధానిప్రాంతంలోని కంకర, గ్రావెల్, ఇసుక ఎలా అమ్ముకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే …
జగన్ ఢిల్లీపర్యటనలు జనంకోసమే అయితే, ఉభయసభల్లో సమాధానంచెప్పకుండా, ప్రశ్నించిన టీడీపీసభ్యుల్ని ఎందుకు బయటకు నెట్టేశారు?
“ఈనాడుమీడియాను, రామోజీరావు గురించి సజ్జల మాట్లాడేముందు, సాక్షిమీడియా, దాని యాజమాన్యం చేస్తున్నదోపిడీపై సమాధానంచెప్పాలి. ముఖ్యమంత్రి పదేపదే ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడో, ఎవరిని కాపాడటానికి, ఏంలబ్ధి పొందడానికి వెళ్తున్నాడో సజ్జల ప్రజలకు సమా దానంచెప్పాలి. ఉభయసభల్లో ముఖ్యమంత్రి ఢిల్లీపర్యటనలపై తాము సమాధానంచెప్పమం టే టీడీపీసభ్యుల్ని సభనుంచి సస్పెండ్ చేశారు. సభలకు కూడాసమాధానంచెప్పుకోలేనంత గా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏంకార్యక్రమాలు వెలగబెడుతున్నాడో సజ్జలకు మాత్రమే తెలుసు. వివేకా హత్యకేసులో ఎక్కడ తనతమ్ముడు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారోనన్న భయంతోనే జగన్ అర్థరాత్రి, అపరాత్రి అని తేడాలేకుండా ఢిల్లీ వెళ్తున్నాడు. బీజేపీ నేతపై వైసీపీవాళ్లు ఎం దుకు దాడిచేశారన్న ప్రశ్నకు సమాధానంచెప్పకుండా సజ్జల, చంద్రబాబు ఏంచేయలేదు అని సంబంధంలేకుండా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు అమరావతిలో ఏంచేశాడో ప్రజలకు తెలుసు.. సజ్జల కుటుంబసభ్యులకు కూడా తెలుసు. మేం ఛాలెంజ్ చేసి చెబుతున్నాం..అత ని కుటుంబసభ్యులే అతనికి స్పష్టంగా చెబుతారు. హైదరాబాద్ తర్వాత అమరావతే పెద్ద మ హానగరం అవుతుందని స్వయంగా పొరుగురాష్ట్ర మంత్రి కేటీఆరే అన్నారు.
కేసుల భయంతో ప్రధాని, కేంద్రహోంమంత్రి కాళ్లుపట్టుకోవడానికే జగన్ ఢిల్లీ పర్యటనలు
ముఖ్యమంత్రి ఢిల్లీపర్యటనలపై సమాధానంచెప్పమంటే తాడు-బొంగరం లేని సజ్జల ఎందుకు మాట్లాడతాడు? అసలు సజ్జలకు ఏంఅధికారం ..ఏహోదా ఉందని ఇష్టానుసారం మాట్లాడు తున్నాడు? అతను ప్రభుత్వానికి సలహాదారుమాత్రమే..మంత్రికాదు. మంత్రులు సమాధా నం చెప్పకుండా తగుదనమ్మా అంటూ అన్నింట్లో సజ్జల ఎందుకు తలదూరుస్తాడు? బీజేపీనేతపై దాడి ఎందుకు జరిగిందో, ఎవరుచేశారో సమాధానంచెప్పకుండా పిచ్చికూతలు ఎందుకు కూస్తున్నాడు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి తాను అనుకూలమన్న జగన్, ఇప్పుడు ఎందుకు మాటమార్చాడు? ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లేది ముమ్మాటికీ ప్రధాని, హోంమంత్రి కాళ్లుపట్టుకోవడానికే. జగన్ తొలిసారి సీఎం హోదాలో ఢిల్లీవెళ్లినప్పుడు ఏం చెప్పారో, ఇప్పటికీ అదేచెబుతున్నారు. ప్రత్యేకహోదా ఎంతసాధించారో, ఏం సాధించారో ఇప్ప టికే ప్రజలకు బాగాఅర్థమైంది. ప్రధానిస్థాయి వ్యక్తిని ముఖ్యమంత్రి కలిస్తే, ఆయనేం మాట్లాడా రో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. దానిగురించి సమాధానంచెప్పకుండా చిల్లర ఆరోపణలు.. చౌకబారు ఆరోపణలని సజ్జల నోటికొచ్చినట్టు మాట్లాడటం సరైందికాదు.
సాక్షి లో ఉన్నప్పుడు సజ్జల ఎంతదోచాడో తెలియదా? సాక్షి ముసుగులో జగన్, అతని కుటుంబం ఎంత అవినీతిచేసిందో ప్రజలకు తెలియదా? వాలంటీర్లే సాక్షిపత్రిక చదవాల్సిన ఖర్మ మాకు పట్టలేదని బహిరంగంగానే అంటున్నారు..ఆ విషయం సజ్జల తెలుసుకుంటే మంచిది. అవినీ తిపత్రిక సాక్షిని పెంచిపోషిస్తున్న సజ్జల, జగన్ లకు ఈనాడు, రామోజీరావుల గురించి మాట్లాడే అర్హతలేదు. అమరావతి ఎక్కడికీపోదు. 2024లో టీడీపీప్రభుత్వం రాగానే రాజధా నిలో ఏంచేయాలో అదిచేస్తుంది? జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా, ఎవరికీ సంబంధంలేదు. నీతి, నిజాయితీ అనేవి ఎలాఉంటాయో తెలియని సజ్జల, వాటిగురించి మాట్లాడటం సిగ్గుచే టు. జగన్ ఢిల్లీవెళ్లిన ప్రతిసారీ మీడియావారికి ఒకటే కాగితం ఇస్తున్నాడు. దాన్నిబట్టే అత ను రాష్ట్రానికి, ప్రజలకు ఏంచేస్తున్నాడో, ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడో అర్థమైపోతోంది. జగన్, అతని ప్రభుత్వదౌర్జన్యాలను ప్రజలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో నే తెలిపోయింది. జగన్, సజ్జల, వైసీపీనేతలు వాస్తవాలు తెలుసుకుంటే మంచిది. సజ్జలకు సిగ్గుంటే, ఇప్పటికైనా అమరావతిలో వైసీపీప్రభుత్వం ఏంచేసిందో, ఎంతఖర్చుపెట్టిందో జగన్ తో పూర్తి వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాగ్రహాని కి వైసీపీ భవిష్యత్ లో ఎన్నిముక్కలవుతుందో కూడా చెప్పలేం. ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లు తెరిచి అధికారంఆఖరికిచేరిన సమయంలో అయినా ప్రజలగురించి ఆలోచించి, వారికి ఏదైనా మంచిచేయాలి” అని అశోక్ బాబు హితవుపలికారు.