– అబద్దాల పునాది మీద బిజెపి రాజకీయ చేస్తుంది
* ప్రజల్లో , యువకుల్లో చైతన్యం పెపొందించే గడ్డ ముషీరాబాద్ గడ్డ
* తొలి, మలి దశల తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న నాయని నరసింహ రెడ్డి ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం
– హైదరాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్
హైదరాబాద్, ఏప్రిల్ 02 : BRS పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం లో భాగంగా ఈరోజు హైదరాబాద్ జిల్లా ముషీరాబాద్ నియోజకవర్గం ఆడికమేట్ డివిజన్ లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ నాయకత్వం లో డివిజన్ అధ్యక్షులు బాల్లా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ ఎమ్మెల్యే , మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , తలసాని సాయి కిరణ్ యాదవ్, ముఠా జై సింహ, కట్టెల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ఆత్మీయ సమ్మేళనం లో హైదరాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ..మోడీ ఓ అబద్ధాలకోరు..అబద్దాల పునాది మీద బిజెపి రాజకీయ చేస్తుందని మండిపడ్డారు. ఎవరైనా నువ్వు ఏం చదివావు..నీ సర్టిఫికెట్ ఏది అంటే ఎవరైన వారి చదివిన చదువుకు తగ్గ సర్టిఫికెట్ ను చూపిస్తారు. కానీ ప్రధాని మోడీ మాత్రం నువ్వు ఏం చదివవు..నీ సర్టిఫికెట్ చూపించు అంటే మాత్రం చూపించడు. పైగా అడిగిన వాళ్లపై కేసులు పెడతారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఇంత చదువు రాని మనిషి ప్రధాని గా ఉండాలే..ముర్కత్వం తో ఈరోజు మన దగ్గరి నుండి గ్యాస్ రూపంలో , పెట్రోల్ డీసెల్ రూపంలో దోచుకొని అదానీకి కట్టపెడుతున్నాడు. అటువంటి వ్యక్తి కి ఓటు వేద్దామా.. రాముడి పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి..శాంతియుతంగా ఉన్న తెలంగాణను విచ్ఛిన్నం చేయాలనీ ప్రయత్నం చేస్తున్నాడు.
కాబట్టి మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ..ఇప్పుడు కేసీఆర్ భారతదేశం గర్వించే స్థాయికి తీసుకెళ్లారు. అలాంటి తెలంగాణను దొంగలకు సద్దులు మోస్తున్న బీజేపీ కి విడిచిపెడతామా..?తెలంగాణ కాపాడుకోవాల్సిన భాద్యత మనపైన ఉందన్నారు. అలాగే ముషీరాబాద్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ కోసం శ్రీరామచంద్రుని వలే ఆనాడు కేసీఆర్ పోరాటం చేస్తుంటే..ఆయనకు గనుమంతుని వలే నాయని నరసింహ రెడ్డి నిల్చున్నాడు. కేసీఆర్ ఏ పిలుపుఇచ్చిన నాయని నరసింహ రెడ్డి సిద్ధంగా ఉండేవారు. తొలి, మలి దశల తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. అనంతరం 2001లో కెసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉండి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించాడు. అలాంటి గొప్ప నాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరణమన్నారు శ్రవణ్. ముషీరాబాద్ అంటే పోరాటాల గడ్డ. ఇక్కడ పోలీసుల లాఠీలు తిన్న వారు ఉన్నారు.. అసెంబ్లీ ముట్టడి , నిరాహార దీక్షలు , ర్యాలీ లు , దీక్షలు ఇలా ఎన్నో ఈ గడ్డ ఫై జరిగాయి. ప్రజల్లో , యువకుల్లో చైతన్యం పెపొందించే గడ్డ ఇది అన్నారు శ్రవణ్. గత పది ఏళ్లుగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో ముషీరాబాద్ ఎంతో అభివృద్ధి జరిగింది. ఇక ఇప్పుడు మూడోసారి మన కేసీఆర్ ని గెలిపించుకునే బాధ్యత మనపై ఉంది. ఆ బాధ్యతలను మనకు గుర్తు చేస్తూ..మనలో ఏమైనా చిన్న చిన్న మనస్పర్థలు ఉన్న , కార్యకర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్న అవన్నీ తెలుసుకొని వాటిని పరిష్కరించుకోవాలని , అంత ఒకటిగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సమావేశాల్లో ఏదో ఉపన్యాసాలు చెప్పడం కాకుండా కేసీఆర్ పాలన ఎలా సాగుతుంది..ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇకముందు జరుగుతుంది..రాష్ట్రంలో ఎలాంటి పధకాలు తీసుకొచ్చారు, వీటివల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది.. ప్రజలందరికి సంక్షేమ పధకాలు అందుతున్నాయా లేదా..రాష్ట్రం కోసం ఇంకా ఏంచేస్తే బాగుంటుంది..ఇవన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించుకోవాలన్నారు. అలాగే కేసీఆర్ గారు మూడో సారి అధికారంలోకి వస్తే భవిష్యత్ ఇక ఎంత బాగుంటుందో అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతుంటే.. బిజెపి , కాంగ్రెస్ పార్టీలు మాత్రం చంద్రుడు ఫై మచ్చను వెతికినట్లు , బిఆర్ఎస్ పార్టీ ఫై , సీఎం కేసీఆర్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు.వారి విమర్శలకు , తప్పుడు ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు. ఆనాడు తెలంగాణ రావొద్దని చాలామంది ప్రయత్నం చేశారు. తెలంగాణ వస్తే కరెంట్ కష్టాలుంటాయని నీటికి ఇబ్బంది వస్తుందని , హైదరాబాద్ అభివృద్ధి జరగదని , తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడతారని, తెలంగాణ వస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయని ప్రచారం చేసారని తప్పుడు ప్రచారం చేసిండ్రు.
కానీ ఈరోజు తెలంగాణ ఎంతగా అభివృద్ధి జరుగుతుందో..ఎన్నెన్నొ పరిశ్రమలు తెలంగాణ కు వస్తున్నాయని , లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది, నీటి కష్టాలు పోయాయని , పంటలు బాగా పండుతున్నాయి , 24 గంటలు కరెంట్ ఉంటుంది..పక్క రాష్ట్రాలు సైతం తెలంగాణ అభివృద్ధి చూసి ఈర్ష పడే స్థాయికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారని మరోసారి గుర్తుచేశారు దాసోజు శ్రవణ్ . ఈరోజు రైతు బంధు , దళిత బందు , కేసీఆర్ కిట్ , కల్యాణ లక్ష్మి, హైదరాబాద్ కు భారీ పెట్టుబడులు , బస్తి దవాఖాన ఇలా ఇన్ని వచ్చాయంటే వాటిన్నిటికి కారణం కేసీఆర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మిషన్ భగీరథ పధకం తీసుకొచ్చి ఇంటి..ఇంటికి పంపు వేసి నీటి కొరత లేకుండా చేసారు. ఎన్నిన్నొ పరిశ్రమలు తెలంగాణ కు వస్తున్నాయని , లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది, నీటి కష్టాలు పోయాయని , పంటలు బాగా పండుతున్నాయి , 24 గంటలు కరెంట్ ఉంటుంది..పక్క రాష్ట్రాలు సైతం తెలంగాణ అభివృద్ధి చూసి ఈర్ష పడే స్థాయికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ను అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారని శ్రవణ్ గుర్తు చేసారు. ప్రతి ఒక్కరు కేసీఆర్ చేసిన అభివృద్ధి ని , తీసుకొచ్చిన పధకాలను , చేసిన మేలును పదిమందికి చెప్పండి. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టండి..బిజెపి పెంచిన ధరలను చూడండి. గ్యాస్ , పెట్రోల్ , నిత్యావసర ధరలు ఇలా ఇవన్నీ ఎంతగా పెంచేసారో, ప్రజల ఫై ఎంతో పన్నుల భారం వేస్తున్నారనో పదిమందికి చెప్పండని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిబిఐ, ఈడీ ల పేరుతో దాడులు చేస్తూ బిజెపి తప్పుడు ప్రచారం చేస్తుందని..వారి ప్రచారాన్ని ప్రతి ఒక్కరు తిప్పి కొట్టాలన్నారు.
ఈరోజు అబద్దాల పునాది మీద బిజెపి రాజకీయ చేస్తుంది. అభివృద్ధి చేయమంటే చేతగాని బిజెపి సన్యాసులు, ఈనాడు కేసీఆర్ ఫై కేసీఆర్ కుటుంబం ఫై పడి ఏడుస్తున్నారని దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ.. 8 సంవత్సరాల లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసారని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచి పేదలపై మోయలేని భారం మోపిందని మండిపడ్డారు. ప్రజల మధ్య విబేధాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి బిజెపి ని తరిమికొట్టాలని..ఎన్నికల్లో మరోసారి కేసీఆర్ ను గెలిపించుకోవాలన్నారు. ఆదివారం ఉదయం వెంకటేశ్వర నగర్ కాలనీ డివిజన్‌లో డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, డివిజన్ అధ్యక్షులు రాములు చౌహాన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ , అలాగే హైదరాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.