– సైకో పనైపోయింది… సైకిల్ పాలన రాబోతుంది
– మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత సలహాదారుడు సజ్జల ని ఇంటికి పిలిచి గట్టిగా తన్నాడట
– పార్టీ ఓటమిని కొంత మంది వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు హైదరాబాద్ లోని ఒక ఫార్మ్ హౌస్ లో సెలబ్రేట్ చేసుకున్నారు అంట. అది తెలుసుకొని హాల్ లో ఉన్న టేబుల్ ని తన్నితే కాలు నొప్పి పెరిగింది అంట
– లిక్కర్ లో జగన్ ఆదాయం నెలకి 100 కోట్లు
– ఒక్క ఇసుకలోనే జగన్ ఆదాయం రోజుకి 3 కోట్లు
– యువగళం పాదయాత్ర వైసిపి కి అంతిమ యాత్ర
– ఉరవకొండ నియోజకవర్గం కూడేరు బహిరంగలో నారా లోకేష్
ఉరవకొండ నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం.
పెన్నహోబిళం లక్ష్మి నరసింహ స్వామి ఆలయం, సూర్యదేవాలయం ఉన్న పుణ్య భూమి ఉరవకొండ.
అద్భుతాలు సృష్టించే చేనేత కళాకారులు ఇక్కడ ఉన్నారు.
రాష్టంలో ఎక్కడ లేని విధంగా ఈ నియోజకవర్గంలో కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తాయి.
రాష్ట్రమంతా జగన్ ట్రాప్ లో పడినా మీరు మాత్రం జగన్ ట్రాప్ లో పడలేదు.
ఉరవకొండ ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.
యువగళం పాదయాత్ర వైసిపి కి అంతిమ యాత్ర.
మీరు టిడిపి ప్రభుత్వం రావాలనే కోరుకున్నారు. కానీ బ్యాడ్ లక్ తన్నే దున్నపోతు ప్రభుత్వం వచ్చింది.
ఉరవకొండ ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.
యువగళం పాదయాత్ర వైసిపి కి అంతిమ యాత్ర.
యూత్ పవర్ ఏంటో జగన్ కి చూపించాం.
30 రోజుల పాదయాత్ర పూర్తి అయ్యేసరికి జగన్ కి జ్వరం వచ్చింది.
61 రోజులు పూర్తయ్యే సరికి కాలి నొప్పి వచ్చింది.
ఇక 400 రోజులు అయ్యే సరికి ఫ్యాన్ మాడి మసైపోవడం ఖాయం.
సడన్ గా కాలినొప్పి రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ నొప్పికి రెండు కారణాలు ఉన్నాయి.
మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత సలహాదారుడు సజ్జల ని ఇంటికి పిలిచి గట్టిగా తన్నాడట.
పార్టీ ఓటమిని కొంత మంది వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు హైదరాబాద్ లోని ఒక ఫార్మ్ హౌస్ లో సెలబ్రేట్ చేసుకున్నారు అంట. అది తెలుసుకొని హాల్ లో ఉన్న టేబుల్ ని తన్నితే కాలు నొప్పి పెరిగింది అంట.
నేను టెర్రరిస్టుని కాను వారియర్ ని అని ముందే చెప్పా అయినా జగన్ వినలేదు. నన్ను అడ్డుకున్నాడు. కేసులు పెట్టాడు.
ఇప్పుడు ప్రజలు జగన్ కి టెర్రర్ అంటే ఏంటో చూపించారు.
జగన్ ప్రతి స్కీం లోనూ ఒక స్కాం ఉంటుంది. అందుకే ఆయనకి స్కాం మోహన్ అని పేరు పెట్టాను.
ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. ఇప్పుడు ఏకంగా జగన్ మద్యం దుకాణాలు తెరిచాడు.
ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ లాంటి చెత్త లిక్కర్ తయారు చేసి కోట్లు గడిస్తున్నాడు. లిక్కర్ లో జగన్ ఆదాయం నెలకి 100 కోట్లు. జగన్ ఎంత పాపం చేస్తున్నాడో తెలుసా గత నాలుగేళ్లలో లక్ష కోట్ల రూపాయల విలువైన విషం కంటే ప్రమాదకరమైన లిక్కర్ తాగించాడు. ఒక్కో కేసు లిక్కర్ పై జే ట్యాక్స్ 10 రూపాయలు. 100 రూపాయలు విలువైన మద్యం అమ్ముతుంటే దానికి అవుతున్న ఖర్చు 15 రూపాయలు మాత్రమే. కానీ జగన్ బాదుడు అదనంగా 85 రూపాయలు. ఈ పాపం జగన్ ని ఊరికే వదలదు.
ఎన్నికల ముందు టిడిపి నాయకులు ఇసుకను దోచేస్తున్నారు అన్నాడు. అప్పుడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు.
ఇప్పుడు స్కామ్ మోహన్ పాలనలో ఇసుక బంగారం అయ్యింది. ట్రాక్టర్ ఇసుక ఐదు వేలు. డబ్బంతా ఏ పందికొక్కులు తింటున్నాయి?
ఒక్క ఇసుకలోనే జగన్ ఆదాయం రోజుకి 3 కోట్లు.
ఇక ఇంటి స్థలాలు ఒక పెద్ద స్కామ్. భూముల కొనుగోలు, ఆ భూమిని చదును చెయ్యడం, సొంత అనుచరులకు ఆ స్థలాలు కేటాయించడం, ఇళ్ల నిర్మాణం ఇలా ఒక్క ఇళ్ల స్థలాల స్కీం లోనే రకరకాలుగా 25 వేల కోట్ల స్కాం జరిగింది.
స్కాం మోహన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్.
బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది.
అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు.
స్కాం మోహన్ వాలంటీర్ వాసు ని పంపి గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టారు.
వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి టిడిపి గెలిస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తారు అని ప్రచారం చేస్తున్నారు.
సంక్షేమాన్ని రాష్ట్రానికి పరిచయం చేసిందే టిడిపి బ్రదర్ జగన్.
సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన హిస్టరీ నీది స్కాం మోహన్ .
అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్.
100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం గా స్కాం మోహన్ ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించొచ్చు.
స్కాం మోహన్ యువతను చీట్ చేసాడు.
జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. ఖైదీలకు 2 వేల రూపాయల మెస్ ఛార్జీలు ఇస్తుంటే, విద్యార్థులకు మాత్రం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.
మేము అనంతపురం జిల్లా కి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. జగన్ అనంతపురం కి పీకింది ఎంటి?
స్కాం మోహన్ మహిళల తాళిబొట్లు తాకట్టు పెడుతున్నాడు.
మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25వేల కోట్లు అప్పు తెచ్చాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు.
టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం.
స్కాం మోహన్ రైతుల్ని కోలుకోలేని దెబ్బతీసాడు.
స్కాం మోహన్ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. అవి ఏంటో తెలుసా గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్.
రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు.
రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి.
మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు.
టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత చీని, టమాటో, వేరుశనగ రైతుల్ని ఆదుకుంటాం.
స్కాం మోహన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు.
వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు.
పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు.
హక్కుల కోసం పోరాడిన కానిస్టేబుల్ ప్రకాష్ పై కేసులు పెట్టి వేధించింది వైసిపి ప్రభుత్వం.
బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు స్కాం మోహన్.
పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు.
బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు.
దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం.
నెల్లూరు జిల్లా చాటగొట్ల లో వైసిపి నేత ప్రభాకర్ ఒక బీసీ వడ్డెర మహిళకు అప్పు ఇచ్చాడు. ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదని వివస్త్రను చేసి దూషించాడు. ఆ అవమానం భరించలేక ఆ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
దళితుల పై వైసిపి పాలనలో దమనకాండ కొనసాగుతూనే ఉంది.
డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది.
ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, జగన్ లిక్కర్ స్కామ్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. పెద్దిరెడ్డి అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు.
ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా?
సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఉరేగించారు.
వైసిపి పాలనలో దళితులను చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు.
మైనార్టీ సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు.
మైనారిటీలను వైసిపి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది.
దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు.
మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు.
ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు.
జగన్ రెడ్డి సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.
ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు.
పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది.
కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లికి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది.
టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు.
ఉరవకొండ ఎమ్మెల్యే గారి గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి.
మూడు తరాలకు వారధి పయ్యావుల కేశవ్ గారు.
మా తాత ఎన్టీఆర్ గారి దగ్గర కేశవ్ గారు రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు.
మా నాన్న విజనరీ చంద్రబాబు గారితో కలిసి పనిచేశారు.
ఇప్పుడు పెద్దన్న లా నన్ను నడిపిస్తున్నారు.
కేశవ్ గారిని చూస్తే అధికార పక్షానికి వణుకు. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసెంబ్లీ లో మైక్ కట్ చేస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు ప్రణయ రెడ్డి అరాచకాల గురించి కూడా మీకు చెప్పాలి.
పిట్ట కొంచెం కూత ఘనం అనే మాట వింటుంటాం..
ప్రణయ రెడ్డి విషయంలో మాత్రం పిట్ట కొంచెం అవినీతి ఘనం.
మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు ప్రణయ రెడ్డి అనంతపురం, కూడేరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూదందాలు చేస్తున్నాడు. కూడేరు పరిధిలో ఎక్కడ లేఅవుట్ వేయాలన్న ఎకరాకు ఐదు లక్షలు ప్రణయ్ రెడ్డికి కప్పం కట్టాల్సిందే. ఈ ప్రణయ్ రెడ్డి అక్రమాలు ఎంతవరకు వెళ్లాయంటే కూడేరులో ఓ మహిళకు చెందిన భూమిని ఫేక్ ఆధార్ కార్డు సృష్టించి కొట్టేశాడు. ఆమె కేసు పెడితే ఇతని అక్రమాలు బయటపడ్డాయి. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.
కూడేరు మండలం కమ్మూరు గ్రామ పరిధిలో అసైన్డ్ భూమికి సంబంధించి నకిలి ఎన్ఓసీలు సృష్టించి భూమి కాజేడానికి ప్రయత్నించాడు. ఈ కేసులోనూ జైలుకు వెళ్లాల్సిన వాడు.. కానీ అధికారులను బలి చేసి తాను తప్పించుకున్నాడు.
ఉరవకొండ నియోజకవర్గం లో గాలి మరలకు సంబంధించి అనేక అక్రమాలు చేస్తున్నాడు. విండ్ పవర్ సంస్థలకు వాహనాలన్నీ ఈయనే సప్లై చేస్తున్నాడు. ఇటీవల ఓ సంస్థ వీళ్లు పంపించే వాహనాలు బాలేవని చెప్పినందుకు వాళ్ల తలలు పగలగొట్టారు.
గాలి మరల వద్ద పనిచేసే సెక్యూరిటీ గార్డులను శ్రమ దోపిడీ చేస్తున్నాడు. సంస్థల నుంచి పెద్ద మొత్తంలో వేతనాలు తీసుకొని. సెక్యూరిటీ గార్డులకు మాత్రం సగం కూడా ఇవ్వడం లేదు.
ఆఖరికి పేదల బియ్యాన్ని కూడా కర్ణాటక లో అమ్ముతున్నాడు.
కర్ణాటకలోని హాసన్ నుంచి హైదరాబాద్ వరకు హెచ్పిసిఎల్ గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేస్తోంది. కూడేరు మండలంలో హెచ్పీసీఎల్ గ్యాస్ పైప్ లైన్ పరిహారం విషయంలో సుమారు ఐదు కోట్ల వరకు అక్రమాలు చేశారు. నిజంగా నష్టపోతున్న రైతులకు అరకొరా పరిహారం అందించారు. తన అనుచరుల భూముల్లో పండ్ల తోటలు లేకపోయినా ఉన్నట్లు సృష్టించి ఒక్కొక్కరు 10 లక్షలు చొప్పున పరిహారం కొట్టేశారు.
కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో నక్కలగుట్టను ప్రణయ్ అనుచరుడు కబ్జా చేశాడు. అక్కడితో ఆగకుండా గుట్టపై చీని చెట్లు ఉన్నట్లు సృష్టించి రూపాయలు లక్షల్లో పంట నష్ట పరిహారం కాజేశాడు. నకిలీ డి పట్టాలు సృష్టించి కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కొట్టేశాడు.
ఉరవకొండని అభివృద్ధి చేసింది టిడిపి.
50 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలి అనే ఉద్దేశంతో మెగా డ్రిప్ పథకాన్ని ప్రారంభించాం. 890 కోట్లు కేటాయించి పనులు చేసాం. 90 శాతం పనులు పూర్తయ్యాయి. కానీ ఈ దుర్మార్గపు ప్రభుత్వం వచ్చి ఆ పధకానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది.
ఉరవకొండలో 8.50కోట్లతో 50పడకల అధునాతన ప్రభుత్వ వైద్యశాల నిర్మాణం చేశాము.
అనంతపురం నుంచి విడపనకల్ వరకు 70కిలోమీటర్ల మేరకు 332 కోట్లతో నూతన రోడ్డు నిర్మాణం మరియు పెన్నహోబిళం బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది.
ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతి పల్లెకి త్రాగునీటిని అందచేయాలని ఉద్దేశ్యంతో 53 కోట్లతో త్రాగునీటి పథకం మంజూరు చేసాం.
గుంతకల్ బ్రాంచ్ కెనాల్ ఆధునీకరణ కొరకు 330 కోట్లతో దాదాపు పనులు పూర్తి చేయడం జరిగింది.
నియోజకవర్గంలో 36 కోట్లతో 19 గ్రామీణ రోడ్లు మంజూరు చేయిచడం జరిగింది.
ఉరవకొండ పట్టణంలో 11 కోట్లతో బైపాస్ నుండి మార్కెట్ యార్డ్ వరకు నాలుగు వరుసల సిమెంట్ రోడ్డు నిర్మాణం వేయడం జరిగింది.
ఉరవకొండ పట్టణంలో మన ప్రభుత్వంలో మూడు వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చాము. వాటికే ఈ ప్రభుత్వ హయాంలో పేరు మార్చి జగనన్న కాలనీల పేరుతో ఇంటి పట్టాలు మంజూరు చేశారు
మన ప్రభుత్వ హయంలో పిఎంఏవై – ఎన్టీర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం క్రింద ఉరవకొండ నియోజకవర్గంలో 16 వేల ఇల్లు మంజూరు చేయించాము. ఇది రాష్ట్రంలోనే అత్యధికం.
దున్నపోతు ప్రభుత్వం వచ్చిన తరువాత ఉరవకొండని ఒక తన్ను తన్నింది.
డ్రిప్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయి,
బెలుగుప్ప మండలంలో హంద్రీనీవా 36వ ప్యాకేజీ పనులు ఆగిపోయాయి,
వజ్రకరూర్ మండలంలో హంద్రీనీవా ద్వారా నీరందించాల్సిన 33వ ప్యాకేజీ పనులు ఆగిపోయాయి,
గుంతకల్ బ్రాంచ్ కెనాల్ ఆధునీకరణ పనులు ఆగిపోయాయి.
ప్రభుత్వం ఏర్పాటు అయిన ఆరు నెలలులోనే డిస్ట్రిబ్యూటరీలకు లత్తవరం, షెక్షానిపల్లి, కోనాపురం, చాబాల, ధర్మపురి గ్రామాలకు నీరు అందిస్తాం అని జగన్ మోహన్ రెడ్డి గారు ఉరవకొండ నియోజకవర్గ పాదయాత్రలో ప్రకటించారు కానీ ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదు.
హంద్రీనీవా కాలువ వెడల్పు చేస్తాం అని జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఇంతవరకు వాటికి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టలేదు.
లత్తవరం, షెక్షానిపల్లి, కోనాపురం, చాబాల, ధర్మపురి గ్రామాలకు మన ప్రభుత్వ హయంలో నీటిని విడుదల చేయడం జరిగింది. కానీ భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలాన గడిచిన మూడు సంవత్సరాలుగా నీటిని అందించడంలో విఫలమైనది.
జీడిపల్లి నిర్వాసితులకు మంజురైన R & R పనులు ఈ ప్రబుత్వం వచ్చాక ఇప్పటివరకు కూడా మొదలు కాలేదు. మన ప్రబుత్వం వచ్చిన వెంటనే నిధులు విడుదల చేస్తాం.
80 వేల ఎకరాలకు నీరు అందిస్తాం అన్న జగన్ హామీ ఏమైంది.
ఉరవకొండ మండలంలోని లత్తవరం, షెక్షానిపల్లి, కోనాపురం..వజ్రకరూరు మండలంలోని చాబాల, ధర్మపురి.. బెలుగుప్ప మండలంలోని గంగవరం, కోనాపురం, నరసాపురం, బ్రామ్హనపల్లి శ్రీరంగపురం, చెరువులకు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హంద్రీనీవా ద్వారా నీటిని తీసుకురావడానికి చర్యలు చేపడుతాం.
50వేల ఎకరాలలో సాముహిక బిందుసేద్యం (మెగా డ్రిప్) పథకం ద్వార రైతులకు నీరు అందించాలి అనే ఉద్దేశ్యంతో 890కోట్లతో నిలిచిపోయిన పనులను పూర్తి చేసి అగ్రిహల్చర్ హబ్ గా మారుస్తాం.
చేనేత కార్మికుల కొరకు క్లస్టర్ ఏర్పాటుకు చొరవ చూపుతాము.
కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ మన ప్రభుత్వ హయంలోనే సర్వే పూర్తి అయినది దీని కొరకు చొరవ చూపుతాము.