– ఎస్సీ మోర్చా రాష్ట్ర అద్యక్షులు కొప్పు భాష
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ని పదవ తరగతి పేపర్ లీకేజీ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భంలో బండి సంజయ్ పై PD యాక్ట్ పెట్టాలని BSP రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలపై యస్సిమోర్చా రాష్ట్ర అద్యక్షులు కొప్పుభాష తీవ్రంగా స్పందించారు.
ఈ సందర్భంగా బాష మాట్లాడుతూ.. కెసీర్ అవకాశం వచ్చినప్పుడల్లా యస్సి లను అణిచివేస్తుంటే బండి సంజయ్ యస్సిల పక్షాన నిలబడి చేసిన అనేక పోరాటాలు సంవత్సరాల కాలంగా ప్రభుత్వ కొలువుల కోసం నిర్విరామంగా చదివి తీరా (TSPSC) పేపర్ లీకై లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడితే ఈ నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసి వారి కి ధైర్యాన్ని ఇచ్చేందుకు అభ్యర్థుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ చేస్తున్న పోరాటాలు BSP నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కండ్లకి కనబడక పోవటానికి కారణం.. అతడు కేసీఆర్ కి రాజకీయ బినామి అని కొప్పుభాష భాషగారు ఘాటుగా వ్యాఖ్యానించారు. అసలు పదవ తరగతి పేపర్ లీక్ చేసిందెవరో అయితే కేసీఆర్ బండి సంజయ్పై అక్రమ కేసు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తే. సామాజిక బాధ్యత లేని ఆర్‌ఎస్ప్రవీణ్ బండి సంజయ్ గురించి మాట్లాడటం ఆయన కేసీఆర్ కి చేస్తున్న బానిసత్వం కి నిదర్శనమే కాక మరేం కాదన్నారు.
గురుకుల పాఠశాలల కార్యదర్శిగా ప్రవీణ్ ఉన్నప్పుడు అతడి నాయకత్వంలో జరిగిన అవినీతి,అక్రమాలు,విద్యార్తినిలపై జరిగిన అత్యాచారాలపై విచారణ జరిపితే ప్రవీణ్ అసలు రంగు బయటపడుఉందన్నారు. పోలీస్ ఉద్యోగిగా ఉన్నప్పుడు ప్రమోషన్ ల కోసం ఎన్కౌంటర్ల పేరిట RS ప్రవీణ్ చేసిన దళిత యువకుల హత్యలపై కూడా విచారణ జరిపించేలా అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ప్రవీణ్ చరిత్ర మాకు తెలియనిది కాదని కాబట్టి బండి సంజయ్ పై ఇష్టరీతిగా వాగితే కొండనాలుకకు మందేస్తామని హెచ్చరించారు.