Suryaa.co.in

International Telangana

డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ కు ఉబ్జెకిస్తాన్ ఆరోగ్యశాఖ అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం

2023, ఏప్రిల్ 13 నుండి 15వ తారీఖు వరకు తాష్కెంట్ లో జరగనున్న ఉషబెకిస్థాన్- భారత మెడికల్ ఫారం సదస్సుకు, తెలంగాణ హైదరాబాద్ కు చెందిన అలర్జీ సూపర్ స్పెషలిస్ట్, డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది.

తాష్కెంట్ లో జరిగే ఈ సదస్సుకు, హైదరాబాద్ అశ్వినీ ఎలర్జీ సెంటర్ అధినేత డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ కు విడుదలైన ఈ ఆహ్వానం లో, అలర్జీ ఇమ్యునాలజీ భాగాన్ని దక్షిణ భారతదేశంలో, అతి అరుదైన, నాణ్యమైన, అత్యాధునికమైన సేవలు అందిస్తున్నారని, వీటివలన వేలాదిమందికి అంతర్జాతీయ ప్రమాణాలతో చికిత్స విధానము అందిస్తున్న కారణంగా, ఆహ్వానము పంపుతున్నామని, రిపబ్లిక్ ఆఫ్ ఉషబెకిస్థాన్- జాతీయ విద్య శాఖ తెలిపింది.

ఈ సదస్సుకు భారత సర్కారు తరఫున, కేంద్ర ఆరోగ్య శాఖ, కేంద్ర ఆయుష్ విభాగం, వివిధ జాతీయ విశ్వవిద్యాలయాలు, వివిధ వైద్య రంగాలలో పేరు పొందిన సంస్థ ప్రతినిధులు, పాల్గొంటున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.

డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ నాయకత్వంలో అందిస్తున్న మెరుగైన ఎలర్జీ సేవలను, వారి దేశములో కూడా ప్రణాళికాబద్ధ తో, వైద్యుల ట్రైనింగ్ ప్రోగ్రాం, అత్యాధునిక చికిత్సా సేవా విభాగము, తదితర మెడికల్ అండ్ సైంటిఫిక్ కార్యక్రమాలపై రానున్న రోజుల్లో కలిసి పనిచేయటానికి, ఈ ఆహ్వానం పంపుతున్నామని,ఉషబెకిస్థాన్ అంతర్జాతీయ వైద్య సంబంధాల ఇంచార్జ్ వైస్ రెక్టార్ లాజిసె నీయఓజ తెలిపారు.

LEAVE A RESPONSE